శ్రీ మతి ఉమారమణ గారు

by అచ్యుతుని రాజ్యశ్రీ

 హిందుస్థానీ సంగీతంలో ప్రవేశం ఉన్న వారు. అన్నమయ్య పదార్చనలో ఉంటూ రామకృష్ణ మఠం తో అనుబంధం కలిగిన ఆమె తన భావాన్ని తరుణి తో పంచుకుంటున్నారు.మరి చదవండి…

పేరు ఉమా రమణ ( P ఉమా మహేశ్వరి )

w/o P V రమణ

వృత్తి ఆన్లైన్ మ్యూజిక్ టీచర్

పుట్టి పెరిగిన వూరు సికింద్రాబాద్

టీన్ ఏజ్ లోనే వివాహం జరగడం తో చదువు పాలిటెక్నిక్స్ తో సరిపెట్టొకొవాల్సి వచ్చింది ..భర్త IFFCO లో రిటైర్డ్ Manger అకౌంట్స్… ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు అయి సెటిల్ అయ్యారు ..అమ్మాయి కి సితార్ వాయిద్యం లో ప్రావీణ్యత ఉన్నది.. అబ్బాయికి తబలా నేర్పించాము … వారు చిన్నప్పుడే చాల చోట్ల ప్రదర్శనలు చేసారు

సంగీతము అంటే చిన్నపటినుండి చాల ఇష్టం.. అయితే నేర్చుకోవడం 35 వ ఏట జరిగింది … ఉద్యోగ రీత్యా భోపాల్ మధ్య ప్రదేశ్ లో ఉండడము మూలాన మొట్టమొదట హిందూస్థానీ సంగీతం నేర్చుకున్నాను …నా మొదటి గురువు గారు శ్రీ గోవింద రావు గారు , గంధర్వ విద్యాలయం ద్వారా హిందుస్తానీ సంగీతము అభ్యసించాను. హైదరాబాద్ కి వచ్చిన తరువాత అన్నమాచార్య కీర్తనలు అంటే చాలా ఇష్టము కలిగింది… కర్నాటిక్ మ్యూజిక్ లో న మొదటి గురువు గారు శ్రీమతి శారద గారు, అన్నమాచార్య ప్రాజెక్ట్ … పద్మశ్రీ Dr శోభా రాజు మేడం గారు నిర్వహించే తరగతులలో కూడా చాల కీర్తనలు నేర్చుకున్నాను…. చాల మంచి గురువుల వద్ద చాల కీర్తనలు క్లాసికల్ అండ్ సెమి క్లాసికల్ మ్యూజిక్ అభ్యసించాను … చాల ప్రోగ్రామ్స్ లో పాడి అవార్డ్స్ పొందాను

నా జీవితములో శ్రీ రామ కృష్ణ మఠం ఒక కొత్త మలుపు తెచ్చింది…. మఠం కి తరుచు వెళుతూ అక్కడ జరిగే కార్యక్రమాలలో పాల్గొనడము జరిగింది …. ఒక సారి చిన్న పిల్లలకి అన్నమాచార్య కీర్తనలు సమ్మర్ క్యాంపు లో నేర్పే అవకాశము ఇచ్చారు. అది చాల బాగా జరగడము తో నాకు మఠం లో అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి కీర్తనలు మరియు భజన్స్ కూడా నేర్పించే అవకాశము ఇచ్చారు …. మఠం లో జరిగే PMC (పేరెంట్స్ మోటివేషన్ కోర్స్) వంటి ఎన్నో కార్యక్రమాలలో అవకాశము ఇచ్చారు… అప్పటి వరకు నేను ఒక సాధారణ గృహిణి ని …. ఇలా అవకాశములు రావడము తో నాకు కొద్దిగా బయటి ప్రపంచము లో కి

వచ్చాను. నేను గత పది సంవత్సరాలు గా మఠం వారికి నా సేవలు అందజేస్తున్నను

నాకు ఈ సదావకాశము ఇచ్చినందుకు ప్రెసిడెంట్ మహారాజ్ శ్రీ జ్ఞానదానంద స్వామిజి గారికి మరియు మాజీ డైరెక్టర్ గారు శ్రీ భోధమయానంద స్వామిజి మహారాజ్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .. కరోనా వచ్చి రామకృష్ణ మఠం వెళ్లే అవకాశం లేకుండా పోయింది… అప్పుడు మఠం వారు ఆన్లైన్ లో క్లాసులు నిర్వహించడానికి అవకాశము ఇచ్చారు…. అందు వలన నాకు నా స్టూడెంట్స్ తో అనుబంధము ఇంకా పెరిగింది… ఇదివరకు Hyd , Sec లోని వారే మఠంకి వచ్చే వారు … ఆన్లైన్ అవడము తో ఇండియా మొత్తం మీద స్టూడెంట్స్ కి నేర్పించే అవకాశము దొరికింది . రామకృష్ణ మఠం వారికి నేను సర్వదా కృతజ్ఞురాలిని

శ్రీ వెంకటేశ్వర స్వామి కృప వలన తిరుపతి కార్తీక బ్రహ్మోత్సవములు , అన్నమయ్య జయంతి మరియు వర్ధంతి ఉత్సవములలో పాల్గొనే సదావకాశములు లభించాయి … నా విద్యార్థిని విద్యార్థులతో కూడి హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ఉన్న ప్రముఖ దేవాలాలయలో చాల సార్లు సంకీర్తనలు చేసాము … చిలుకూరు బాలాజీ గుడి లో చాల సార్లు సంకీర్తనలు పాడాము

నాకు సంగీతము కాక వండడము అందరికి పెట్టటం అంటే చాల ఇష్టం …. మా పిల్లల ప్రోత్సాహము తో www. gruhinii.com అనే వెబ్సైటు ను స్టార్ట్ చేశాను… అందులో అన్ని రకాల వంటలు, పచ్చళ్ళు,వడియాలు పిండి వంటలు మాత్రమే కాక … భక్తి సంకీర్తనల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో పబ్లిష్ చేయడము మొదలు పెట్టాను.. యూట్యూబ్ ద్వారా నా పాటలు మరియు వంటలను పోస్ట్ చేస్తున్నాను. నా ఛానెల్ ఉమా రమణ …. వీడియో చేయడము ఎడిటింగ్ చేయడము అన్ని మా అబ్బాయి ప్రోత్సాహము తో నేర్చుకొని నా వరకు నేను ఎడిటింగ్ చేయగల్గుతున్నాను … నాకు దాదాపు 6.97K subscribers ఉన్నారు

ఒక సాధారణ గృహిణి నైన నేను ఆ దేవుని కృప వలన నా విద్యార్థుల ఆదరణ మరియు అభిమానుల ఆదరణ పొందగలుగుతున్నాను

This post was created with our nice and easy submission form. Create your post!

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంఘసేవిక శ్రీమతి శ్రీలక్ష్మిరెడ్డిగారు!

తరుణిచిత్రం