సంఘసేవిక శ్రీమతి శ్రీలక్ష్మిరెడ్డిగారు!

by అచ్యుతుని రాజ్యశ్రీ

ఆమె పుట్టింట అత్తింట సిరి సంపదలకు లోటులేదు.సరస్వతీపుత్రులు అంతా! కానీ పూర్వజన్మ సంస్కారం  కన్నతల్లి సేవాభావం ఇతర వనితలకష్టాలు కన్నీరు చిన్నారి శ్రీలక్ష్మిని సంఘసేవికగా తీర్చిదిద్దాయి.9849161302 కి ఫోన్ చేస్తే చాలు!ఆమె పలికి చేయూతనందిస్తారు.మరో మదర్ థెరిసాగా అన్నీ ప్రభుత్వాల అవార్డ్స్ అందుకున్నారు. 1997లోశ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ ఫ్యామిలీకౌన్సిలింగ్ సెంటర్ గా విస్తరించింది. నారాయణగూడాలో అందరికీ అందుబాటులో ఉంది. కర్ణాటక  షిర్ఠీ మహారాష్ట్ర మొదలైన ప్రాంతాలలో ఆడవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈమె! లయన్సు రోటరీ రెడ్ క్రాస్ మెంబరు గా లెక్కలేనన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.రామకృష్ణ మఠం లో చేరాక ఆమెలో ఓపట్టుదల అంకిత భావం  సమాజం కి ఏదో చేయాలి అనే తపన మొలకగా మొదలైంది. వటవృక్షంగా…

సినిమా జూనియర్ ఆర్టిస్టులకు హెల్త్ క్యాంపులు నిర్వహించి హీరో సుమన్ ఆధ్వర్యంలో సన్మానం పొందారు. నారాయణమ్మ కాలేజీ ఆడపిల్లలకు రాష్ట్రవ్యాప్తంగా ముగ్గులపోటీలు నిర్వహించి 5లక్షలరూపాయల విలువైన బహుమతులు చెక్కులు అందజేశారు తన స్వంత డబ్బు తో! ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లిలో మగపిల్లలకు  వాలీబాల్ పోటీలు నిర్వహించి ప్రోత్సహించారు.

ఇక ఆమె నేపధ్యం గూర్చి తెలుసుకుందాం!నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు లో పుట్టారు. అమ్మ నాన్న లు శ్రీమతి అల్లారెడ్డి కమలమ్మ వెంకురెడ్డి గార్లు!6అత్తలు చిన్నాన్న! ఆడపడుచుల పెళ్ళి పేరంటాలు వంటవార్పుతో తల్లి  రోజూ 20మంది ఆలనాపాలనా చూడటం చిన్నారి శ్రీ లక్ష్మి మనసులో గాఢంగా నాటుకుంది.ఇద్దరి అన్నల ఏకైక చెల్లిగా హైస్కూల్ చదువు కాగానే శ్రీ జయపాల్ రెడ్డిగారితో(లాయర్) పెళ్లి అందమైన మలుపు!అత్తగారిది ఖమ్మం. ఆసుపత్రులు  మురికివాడల్లో పొదుపు సంఘాలకు సి.ఎం.ఇ.వై.గ్రూపులు ఏర్పాటు చేశారు. ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు జనని అవార్డు2జూన్ 2022లో దిమోస్ట్ పవర్ఫుల్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ అండ్ యాక్టివిస్ట్ అవార్డు(ఢిల్లీలో) పొందారు. చాలా విషయాలపై రచనలు చేశారు. పెద్ద అమ్మాయి ఐ.ఎ.ఎస్.చిన్న అమ్మాయి డాక్టరు. అబ్బాయి లాయర్.”మనం నీట్ గా ఆత్మ విశ్వాసం తో కనపడితేనే జనంకి నమ్మకం ఏర్పడుతుంది. మనం ఈసురోమని ఉంటే “వీరు మనకేం సాయం చేయగలరు?”అనే భావం ఎదుటివారిలో కనపడుతుంది.అందుకే మన కట్టుబొట్టు శుచి శుభ్రత కి నేను ప్రాధాన్యత ఇస్తాను”అని గల గలా చైతన్య స్రవంతి లా ఉండే శ్రీలక్ష్మిరెడ్డిగారు ఇంకా ఎన్నెన్నో జాతీయ అంతర్జాతీయ బహుమతులు పొందాలి అని  ఆశిద్దాం

 

This post was created with our nice and easy submission form. Create your post!

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారతమాత

శ్రీ మతి ఉమారమణ గారు