మన మహిళామణులు – శ్రద్ధేష్ నందిని..

విధిని జయించిన శ్రద్ధేష్ నందిని…

అన్నీ సక్రమంగా ఉన్నా దేనికోదానికి ఆరాటం అసంతృప్తి.కానీ విధికి తలొగ్గిన శ్రద్ధేష్ జీవిత పోరాటాలు చేస్తూ నవ్వుతూ ఉంటారు.ఆమె మనకు స్ఫూర్తిదాత! శ్రద్ధేష్ పేరు ఎంత బాగుందో కదూ? ఆమె పూర్వీకులు ఎన్నో తరాల క్రితం యు.పి.నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇంట్లో హిందీ మాట్లాడుతారు.తెలుగు ఆంగ్లం అనర్గళంగా మాట్లాడటమేకాదు రకరకాల చేతిపనుల్లో ఆమె నిష్ణాతురాలు. అమ్మ నాన్నలు శిరోమణి శ్రీవాస్తవ ఎస్.ఎస్.కరణ్. అక్క డాక్టర్ దుర్గేష్ నందిని.చెల్లి అవదేష్. రకరకాల పూసలతో అలంకరణ సామగ్రి పూసలల్లటం కవితలు వ్యాసాలు రాయడం ఆమె హాబీలు. ఉత్సాహంతో తన బాధను మర్చిపోయి ఇతరులతో సరదాగా నవ్వుతూ తృళ్లుతూ గలగల మాట్లాడే ఆమె తనని గూర్చి ఇలా చెప్పారు” నాకు నాల్గునెలల వయసులో మాఅక్క దుర్గేష్ ( దాదాపు ఒకటిన్నర రెండేళ్ల వయసులో) పోలియో డ్రాప్స్ డి.పి.టి.ఇంజక్షన్ ఇవ్వడం రియాక్షన్ తో అక్కకి ఎడమకాలు నాకు శరీరమంతా చచ్చుబడింది. మానాన్న ఆర్మీలో సుబేదారు ఆపై మేజర్! యుద్ధ భూమిలో ఉన్నారు.ఐనా మాకోసం అమ్మ నాన్నలు పడిన తిప్పలు అంతా ఇంతా కాదు.చూపని డాక్టర్లు చేయని వైద్యం లేదు.పూనే బెంగుళూర్ ఇంకా ఎవరు ఏసలహా ఇస్తే అలా మమ్మల్ని తిప్పారు.ఆయుర్వేదం హోమియో చికిత్స లకు కూడా నేను కోలుకోలేకపోయాను. అదృష్టవశాత్తు అక్కకి దాదాపు నయమై ఆమె మామూలు మనిషి కావటం కాస్త ఊరటకల్గించింది. మహావీర్ హాస్పిటల్ లో సర్జరీ చేశారు.హిమాయత్ నగర్ లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో నన్ను ఉంచారు.రోజూ ఇంటినుంచి నన్ను తీసుకువెళ్లటం కష్టమని.అక్కడ నాకు కేర్ టేక్ ఉంది.కానీ భయంకర నరకం బాధ అనుభవించాను. ఎవరితో చెప్పుకునేది? ఇప్పటికీ తల్చుకుంటే నాగుండె ఝల్లు మంటుంది.

శ్రద్ధేష్ 8_9 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు హిమాయత్ నగర్ లో ఒక డాక్టర్ ఇంట్లో ట్రీట్మెంట్ కోసం ఉంచారు.అక్కడ ఆమెకు సరిగా తిండి పెట్టక కొట్టి తిట్టి హింసించేవారు ఆయాతో సహా! కానీ శ్రద్ధేష్ తల్లి బంధువులు బంధువులొచ్చినపుడు మాత్రం ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసేవారు. అలా 7_8 నెలలు చిత్ర హింస అనుభవించిన ఆపాప అనుకునేది” ఈ యమయాతనల కన్నా దివ్యాంగురాలిగా ఉంటే నే నయం.” ఇప్పటికీ ఆ పాత జ్ఞాపకాలు ఆమెను తొలిచేస్తుంటాయి.
శ్రద్ధేష్ కి ఇంట్లోనే అమ్మ అమ్మమ్మ చదువుచెప్పారు. పరీక్షలు రాయడానికి మాత్రమే బడికివెళ్లిందామె.ఎస్.ఎస్సీ పరీక్ష ను ప్రిన్సిపాల్ రూంలో కూర్చుని రాసిందామె.స్పీడ్ గా రాయడం కష్టమై అన్నిప్రశ్నలకు జవాబులు రాయలేకపోయిన ఆమె థర్డ్ డివిజన్ లో పాసైనారు. కాలేజీలో ఇంటర్మీడియేట్ హిందీ మీడియంలో చదవడం ఓకొత్త అనుభవం.అమ్మ రోజూ థర్డ్ ఫ్లోర్ లో క్లాసులో దింపేది.నోట్సులురాసేది తల్లి.సాయంత్రం రిక్షాఅతను ఇంటికి తెచ్చేవాడు.క్లాస్ పిల్లలు టీచర్లు స్పోర్ట్ చేసి ప్రోత్సాహించారు.గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియంలో చేశారు.ఇక్కడ చెల్లెలు ఆమెకు ఇచ్చిన చేయూత మాటల్లో చెప్పలేము. ఉదయం కాలేజీలో దింపి సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేది. విద్యార్థిగా ఎస్సేరైటింగ్ వక్తృత్వ డిబేట్..ఇలా అన్నిపోటీల్లో శ్రద్ధేష్ కి బహుమతులు రావటం ఆమె పట్టుదల కి నిదర్శనం.ఉస్మానియా యూనివర్శిటీలో పి.జి.చేశారామె. పొద్దున 9నుంచి సాయంత్రం 5 దాకా చెల్లి ఉండేది.
శ్రద్దేష్ సాయంత్రం ఫిజియోథెరపీ తర్వాత కె.జి.నుంచి పి.జి.దాకా ఆన్లైన్ క్లాసులు తీసుకుంటారు.ఇంట్లో అమ్మ ఇద్దరు తమ్ముళ్లు మరదలు హెల్ప్ చేస్తారు.ఎక్కడకైనా వెళ్లాలంటే అక్కకొడుకు చేతులపై ఎత్తుకొని తీసుకెల్తాడు. ఆబాబు దుర్గేష్ గారి కొడుకు ఎం.టెక్. చదివాడు.


తండ్రి స్నేహితుడు సయ్యద్ అమీన్ మహ్మద్ ఆర్టీసీ ఉద్యోగి చేసిన సాయం మరువలేనిది అంటారు.
ఈమెకు వచ్చిన రివార్డులు అవార్డులు లెక్క లేనన్ని. సూపర్ ఉమన్_ నారీసమ్మేళన్ గోల్డెన్ నంది; హిందీశిరోమణి అబ్దుల్ కలాం;వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్; శక్తి శక్తిసమ్మాన్ ఇలా ఎన్నో ఎన్నెన్నో! దివ్యాంగుల ధీశక్తికి దర్పణం శ్రద్ధేష్ నందిని.ఆమెను గూర్చి రాసిన నాకలం ధన్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జ్ఞాన దానగుణం sharing of knowledge

మత విశ్వాసాలు – అపశృతులు