జీవితం fairy tale అంటారా?

2025 జనవరి 27 తరుణి సంపాదకీయం

” Life is  the most wonderful fairy tale” అంటారు. కానీ ఇది అర్థసత్యమే. ఫెయిరీ టేల్ అంటే అద్భుతమైన కథ అంటారు. కథలు కూడా జీవితం గురించే చెప్తాయి. కానీ, ఊహకందని విషయాలను కథలో చేర్చి ఆశ్చర్యచకితం అయ్యేలా ఉండే కథలు. నిజ జీవితంలో కనిపించని కొన్ని మంత్ర, తంత్రాల విషయాలు మాంత్రికులు యాంత్రికలు అందరూ పాత్రధారులే ఈ ఫేరీ టైల్స్లో. మనకు తెలియని ఏదో దూరపు కథ. ఓ పొడవైన కథ. అవాస్తవాలను అందంగా చిత్రీకరించి వాస్తవంగా చెప్పడం, పాఠకులను కొత్త ప్రదేశానికి ఎక్కడికో తీసుకుపోయినట్టుగా ఉండేవి.

అర్ధసత్యం అని అనడానికి  రెండు కారణాలు. ఒకటి ఫెరీటేల్స్ లో కూడా జీవితమే ఉంటుంది. రెండు జీవితమే అయినా ఊహ ప్రపంచపు జీవితం ఉంటుంది. అందుకే అర్ధసత్యం అనడం. ఇప్పుడు మొదటి సత్యాన్ని తలచి చూద్దాం. ఈ కథల్లో పాత్రలో ఉనికి మనకు తెలిసిందే ఉంటుంది జీవిత సత్యాలను వ్యక్తపరిచే భావాలతో ఈ పాత్రలు సాగుతూ ఉంటాయి. కానీ మాయలు మంత్రాలు అనే భయభ్రాంతుల విశేషాలు ఏ ఉపయోగం లేనివి. అందుకే అది అర్ధ సత్యం.  కానీ ఇందులో ఉన్న కొంత సత్యం ఏంటి అంటే.. ఫెయిరీ టేల్స్ లోని కథలు సంప్రదాయబద్ధంగా ఉంటూ ఆయా ప్రాంతాన్ని ప్రస్ఫుటిస్తాయి. ఇది ఒక నాలెడ్జ్. తెలియని వాళ్లకు తెలుస్తాయి. పద్ధతులు ఆచారాలు అనేవి అన్ని ప్రాంతాల వారికి ఏదో రూపకంగా ఉంటాయి అని చెప్పడానికి ఈ ఫెయిరీ టైల్స్ ఆధారభూతమవుతాయి. కానీ భూతాలు దయ్యాలు ఉన్నట్టుగా భ్రమను  స్ఫురింపజేసి.. ఏదో లోకంలో విహరింప చేసే పద్ధతి అసలు మంచిది కాదు.

ఇక రెండవ సత్యం ఊహా ప్రపంచపు జీవితాల్ని ప్రస్ఫుటిస్తాయి. మాయ ప్రభావాలను చూపిస్తుంటాయి ఇది ప్రేక్షకుల పాఠకుల subconscious mind, మనిషి సబ్కాన్షియస్ మైండ్ పైన విభిన్న భావంతో ప్రభావితం చేస్తుంది. అందుకే ఎంతవరకు గ్రహించాలో అంతే గ్రహించాలి అనే బుద్ధి జ్ఞానం అందరికీ ఉండదు కాబట్టి ఇటువంటి సినిమాలను ఇటువంటి

కథలను ఎంతవరకు బహిష్కరిస్తే అంత మంచిది.

సిండ్రెల్లా, శాంతా క్లాస్ కథలు, అల్లావుద్దీన్ అద్భుతదీపం వంటి కథలు కొన్ని ఉన్నాయి.

మనుషులు అనుభవించే ముందు వాళ్ళ మనసుల్లో ఉన్నది వాస్తవ ప్రపంచ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఉండే కష్టాలను ఏవో అతీంద్రియ శక్తులు వచ్చి కాపాడతాయి అనుకోవడం తో పొరపాటు. ఒక కల్పన  అనేది జీవితాలకు పరిష్కారాలను కనుక్కునే మార్గంలో కష్టించి విజయం సాధించాలి గాని ఏవో మాయలు మంత్రాలు సమస్యల్ని పరిష్కరించాయి అని చెప్పడం మంచి పద్ధతి కాదు.

కానీ ఎప్పటినుంచో జనాదరణ పొందిన కథలు ఉన్నాయి. బొమ్మల చిత్రాలు ఉన్నాయి సినిమాలు ఉన్నాయి ఎన్నో మాధ్యమాలలో ఇవన్నీ చూస్తూ ఉంటాం వీటిని ఒక బ్రాండ్ ఇమేజ్ లా కూడా చూస్తుంటారు కొందరు.

కథలు జీవితాన్ని ప్రస్ఫుటించాలి. సత్యమైన జీవితాన్ని ప్రస్ఫుటించాలి కష్టనష్టాలు వస్తాయి ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని పొందాలి అని చెప్పేలా ఉండాలి. ఎవరైనా మోసం చేస్తున్నారు అంటే పసిగట్టే తెలివిని నేర్పించే కథలు ఉండాలి. మంచి మానవత్వం వంటి నైతిక విలువలను ప్రేరేపించే కథలు ఉండాలి. జీవితం పూల పాన్పు కాదు, వడ్డించిన విస్తరి అసలే కాదు అని నేర్పించాలి. ముళ్ళబాటలూ ఉంటాయి దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పేలా ఉండాలి. చదువు సంస్కారము భావి జీవితానికి అవసరము అని చెప్తూ పరోక్ష పద్ధతిలో వాటి విలువను చూపించేలా ఉండాలి. కథలు జీవితాలు జీవితాలే కథలు .

***_****

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

C-Section