సూర్యుడు

నీ కిరణాలతో పుృద్విని మేల్కొల్పినావు…
జనుల జీవితంలో వెలుగు నింపినావు…
దేవుళ్ళకే గురువుగా అధికారం వహించినావు…
చీకటి అనే భయం నుండి ప్రజలను రక్షించినావు…
హైడ్రోజన్ హీలియమ్ పరమాణువులు నీతో
జతచేసినావు…
నాలుగున్నర బిలియన్ సంవత్సరాల క్రితం జన్మించినా
ఈ భూమండలంపై చిరంజీవుడిగా వెలుగుతున్నావు ..
చెట్లకు ప్రాణంపోసి, జీవుల ప్రాణలు కాపాడుతూ
భూమి పై ప్రతి అణువుతో సంబంధం వహించినావు…
ప్రతి జీవి జీవనం నీతో నే జతచేశావు.

Written by K. Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మానుష మహి

లాయర్ సలహాలు(కాలమ్)