కల

కవిత

మాధురి, సెంట్రల్ యూనివర్సిటీ

కలం కదిలినంత మాత్రాన
కవిత్వం కాజాలదు
అని తెలిసిన కవి
కవిత్వపు సౌరభాన్ని
స్పృశించగల తుమ్మెదలాగా
కవిత్వమకరందాన్ని స్వీకరించి కూర్చి
కవితతేనెను సాహిత్య బాటసారులకు పంచటానికి
అస్తికల సహాయం తో
నా హస్థకలల్ని కదిలించే
ఈ చిన్న ప్రయత్నం
నా కల…
నా కవిత్వం…
నేను ప్రస్తుతం ఈ రెంటి తో
చేస్తున్న దే సాహిత్య ప్రయాణం
నేను కవిని
కల కవిత్వమైనా
కవిత్వం కల కాదు!!

Written by Madhuri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మ

రమక్కతో ముచ్చట్లు -18