చీకటిని చదువుతూ
చదువుతూ ఉన్నా. వెలుగులతోటమెరిసింది
అందమైన తోట
అందులో నేను
తిరుగుతూ
తిరుగుతూ ఉన్నా..
ఎంత బాగుందో..!
తోటమాలి ఎవరో..!
ఒక్కసారి కనిపిస్తే
బాగుండు.
చేతినిండా పళ్ళు
పూలతో వస్తున్నది ఎవరు?
ఆత్రంగా అందుకున్నానన్ని..
రుచిరుచిగా
అభిరుచిగా.. కొన్నిఅనుభవాలు
కొన్నిఅనుభూతులు.
అవును, తెచ్చివారేరి?
అదిగో నావైపేచూస్తూ.. నవ్వుతూచెయ్యందిస్తూ అప్రయత్నంగాఅందు కున్నా..
అడుగులువేస్తూ తను
అనుసరిస్తూ నేను
‘చూడు ఈ తోట మనది ఏమంటావు నచ్చిందా’ ఉలిక్కి పడ్డాను..
మనసు శాసిస్తుంది
మాట వినమని..
బుద్ధి మాటవినడంలేదు
ఏదో తెలియని మోహం
చుట్టేసింది..
ఏం చెప్పాలి? మౌనమే నేనైతే,
మాటే తానైతే,
నేనే తానుగాశూన్యమైతే
సాహిత్యమైతే…
నిదుర స్వప్నం
మెలకువలో నిజమై,
నాలో కొత్త ప్రకాశాలుగా ఉదయిస్తే ఎంత బాగుండు…