– ఉలూచి :-
– నాగులలో ప్రసిద్ధి చెందిన ఐరావత నాగావంశం ఒకటి ఉంది. ఆ వంశానికి చెందిన రాజు కౌరవల్యుడు. అతని కూతురు ‘ఉలూచి’ . అనంత, వాసుకి నాగ వంశాల తర్వాత అంత గొప్ప వంశం ఐరావత నాగవంశం అని భారతంలో ఉంది. ఈ వంశ నాగులు భూమిమీద దేవలోకంలో కూడా తిరుగగల శక్తివంతులు అందుకే ఉలచి కామరూప ధారణలో అంతటా తిరుగగలుగుతుంది.
– అర్జునుడు ఒకసారి యాత్రలు చేస్తూ గంగానది తీరంలో ఉన్నప్పుడు ఉలూచి అతన్ని చూసి మోహిస్తుంది. అలా ధ్యానంలో ఉన్న అర్జునుడిని కామరూప ధారణ తో తన లోకానికి తీసుకు వెళుతుంది. ఆమె ప్రేమకు పరవశించి అర్జునుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. కొడుకు ఇరావంతుడు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో ఇరావంతుడు పాండవుల పక్షాన పోరాడి వీర మరణం పొందుతాడు. కొడుకును వీరుడిగా పెంచింది ఉలూచి.
– సుధీష్ణ :- సూతరాజు కేకయుని కుమార్తె సుధీష్ణ. ఈమె కొడుకు ఉత్తర కుమారుడు, కూతురు ఉత్తర కుమారి. సుధీష్ణ అసలు పేరు చిత్ర. సుధీష్ణ అని పేరు ఎందుకు వచ్చిందంటే అత్యంత దాన గుణం కలది కాబట్టి.
– అంతేకాకుండా సుధీష్ణ అంటే ఎక్కువ మానసిక ఒత్తిడి అని కూడా అర్థం ఉన్నది. ఈమెలో ఈ రెండు గుణాలు ఉన్నాయి. విరాటపర్వం సమయంలో పాండవులు మారువేషంలో ఉన్నప్పుడు వాళ్లను మొట్టమొదట గుర్తించింది సుధీష్ణ నే కీచకుని సోదరి అయినా కారణంగా ఆమె కీచకునికి ఎదురు చెప్పలేక చాలా మానసిక ఒత్తిడికి గురి అయింది.
– అభిమన్యునికి ఉత్తరను ఇచ్చి వివాహం చేసి ఒక చిన్న రాజ్యానికి రాణిగా ఉన్న సుదీష్ణ ఏకంగా హస్తినాపురానికే వియ్యపురాలైంది. ఇలా విరాటపర్వంలో ప్రధాన పాత్రగా ఉన్నది సుధీష్ణ.
– ఇలా మరికొందరి గురించి తర్వాత తెలుసుకుందాం.