ఎడారి కొలను 

ధారావాహికం -47 వ భాగం

(ఇప్పటివరకు కొత్త ఫ్లాట్ లో ఉండడం మొదలెట్టాక ప్రసాద్ భవ్య ,అపూర్వ ల విషయం ఏమిటో తెలుసుకోవాలని ఒకరోజు డిన్నర్ ఏర్పాటు చేసి , తన కొలీగ్ ఎలీషాను కూడా పిలుస్తాడు. అపూర్వ, భవ్య వాళ్ళ మధ్యన ఉన్న బంధాన్ని ఒప్పుకుంటారు. ప్రసాద్ ని తమకి హెల్ప్ చేయమని అడుగుతారు.)

అక్కమ్మ వచ్చి తలుపు కొట్టింది, “ప్రసాద్ బాబు, బట్టలుం టే ఇవ్వు, ఉతికి పెడతాను, అందరు నీళ్లు పట్టుకోవడమయింది,”  అంటూ చీపురు తో వరండా చిమ్మడం చేస్తున్నది. ప్రసాద్ కి ఇంకా పడుకోవాలనే ఉన్న అప్పటికే ఆలస్యమయింది, అనుకొంటూ ,  “అక్కమ్మ, ఒక పాల పాకెట్ తెచ్చి పెట్టు , కాఫీ తాగాలి, ఈ లోపు నా బట్టలు తీసిపెడతాను ఉతకటానికి,” అన్నాడు. “అట్టాగే బాబు,” అంటూ ప్రసాద్ ఇచ్చిన డబ్బులు సంచి తీసుకొని వెళ్ళిపోయింది.      

 “ బ్రష్ చేసుకున్నారా  ప్రసాద్ గారు , కాఫీ తాగండి అంటూ ,”  అంటూ కాఫీ తో ఎదురుగ వచ్చి నిలబడింది మైత్రేయి. ఆమె ని  అలా చూడడం తన కెంతో హాయిగా అనిపించింది. “ థాంక్స్ అండి , కాఫీ దేవత సుఖీభవ ,” నాటకీయం గా అన్నాడు. 

“ తధాస్తు ,”  అంటూ  పంతులు గారు కూడా వంత పాడారు. 

 “స్నానం చేసి రండి ,ఉప్మా చేస్తాను , టిఫిన్ చేద్దురు గాని. మనం కాంతమ్మ గారింటి కి పోవాలి,” అన్నది మైత్రేయి.

  “అలాగే 10 మినిట్స్ లో మీ ముందుంటాను”  అంటూ 

“అక్కమ్మ, కాఫీ కప్పు కడిగిమైత్రేయి  గారింట్లో పెట్టు. ఇవిగో నా బట్టలు, ఉతికి ఇస్త్రీ కిచ్చేసేయ్,” అన్నాడు అప్పుడే వచ్చిన అక్కమ్మ తోటి.  “అక్కమ్మ నీకు పనయితే ఒక సారి రా,”  అంటూ మైత్రేయి కూడా వెళ్ళిపోయింది.

 అలా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. సరిగ్గా అరగంటకల్లా ప్రసాద్ స్నానం చేసి, రెడీ అయి వచ్చేసాడు. మైత్రేయి కూడా , పసుపురంగు చీరకి ఆరెంజ్  జ రీ బార్డర్ ఉన్న బెంగాలీ కాటన్ చీర కట్టుకొని, అందం గా తయారయింట్లనిపించింది, “ఎన్ని ఇబ్బందులు ఉన్న మనం సక్కం గ తయారయ్యామనుకో, సంతోషం గ ఉంటది, సంతోషమే సగం బలం కదమ్మ,” అంది అక్కమ్మ మైత్రేయి ని చూస్తూ. 

  మైత్రేయి చిన్నగా నవ్వుతూ,  “ను వ్వు వేదాంతం చెప్పడం బాగా నేర్చుకున్నావు అక్కమ్మ,” అంది.  టిఫిన్ తినగానే, గిన్నెలు కడిగేసి తాళం రమాదేవి గారింట్లో పెట్టు, నేను కాంతమ్మ గారింటికెళ్ళేసి వస్తాను ,” అని బయలుదేరింది.  ప్రసాద్  బైక్ తీయబోతుంటే. “ బైక్ వద్దండి నేను ఆటో లో వస్తాను, మీరు బైక్ మీద రండి ,” అంటూ ముందు కెళ్ళి ఆటో మాట్లాడుకొని ఆటో ఏక్కి  వెళ్లి పోయింది. ‘మైత్రేయి కి ఉన్న ఆ క్రమశిక్షణ కి ఎవరయినా దాసోహం అనాల్సిందే,’ అనుకొంటూ ప్రసాద్ బైక్  స్టార్ చేసాడు.  

  పావు గంటలో ఇద్దరు కాంతమ్మ గారి  ఇల్లు  చేరుకున్నారు. హల్లో  నే ఉన్నారు ప్రభాకర్ గారు పేపర్ చదువుతూ. “ రావయ్యా ప్రసాద్, చాలారోజులయింది మన మాట్లాడుకొని ,” అంటూ   “ఎమ్మా మైత్రేయి! బాగున్నావా?” అన్నాడు .

“బాగానే ఉన్నాను సార్, కాంతమ్మ గారు రమ్మని ఫోన్ చేస్తే వచ్చాను,” అన్నది. 

ఇంతలోకే కాంతమ్మ గారు కూడా హాల్లో కొచ్చి ,” మైత్రేయి, నీకు వీలవుతుందా నాతో రావడానికి , ఈ రోజు మనం సత్తెనపల్లి పోవాలి, రాత్రి పెద్దక్కను గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్పించి వచ్చాను ,” అంది.

“ ఏమైంది  ఆమెకు , అందరు బాగానే ఉన్నారా ?”

“ అదే పెద్దక్క కి కొంచం సీరియస్ గా ఉందని ఫోన్ వస్తే, నేను  రాంబాయమ్మగారు నిన్న రాత్రే వెళ్ళాము. ఆమె కు తోడుగా రాంబాయమ్మ గారిని హాస్పిటల్లో వదిలి నేను వెనక్కి వచ్చాను   ఇవాళ మళ్ళి నేను వెళుతున్నాను. నువ్వు కూడా వస్తావేమో నని ఫోన్ చేశాను,” అంది.

“ అయ్యో, వెళదాం, తప్పక వస్తాను,” అంది.

    “అయితే అరగంటలోనే మన ప్రయాణం , జానీని కొన్ని వస్తువులు తెమ్మని పంపాను, వాడు రాగానే బయలు దేరుదాము,” అంది.

“ రమణి , టిఫిన్ లు టేబుల్ మీద పెట్టు  అందరు  వచ్చారు,” అంది పెద్దగా.

“ రండి డైనింగ్ టేబుల్ దగ్గర కి తింటూ మాట్లాడు కుందాము,” అంటూ అందరిని టిఫిన్ చేయడానికి లేవదీసింది.

   ఇడ్లి లు ప్లేట్స్ లో పెడుతున్న రమణి చాల హుందాగా నిండుగా కనిపించింది. ‘పెళ్లయింది కదా ఆ పెద్దరికం వచ్చేసింది’ అనుకోంది  మైత్రేయి.

      వాళ్ళ టిఫిన్స్ పూర్తవుడుతుండగా జానీ వచ్చాడు. రమణి   “ ఇదిగో ఈ  పండ్లు కూరలు లోపల పెట్టు,” అన్నాడు.  కాంతమ్మ గారు , “ రమణి , మేము తినేసాం కదా , మందులేసుకుంటాను, ఈలోపు నువ్వు జానీ కూడా తినేసేయండి,” అన్నది. అలాగే అమ్మ ,” అంటూ రమణి  టేబుల్  సర్ది ,” జానీ , నువ్వుకూడా రా, టిఫిన్ పెడతాను ,” అంది. 

      జానీ రాగానే రమణి, కూడా ప్లేట్ తీసుకుని పక్కనే కూర్చుంది. ఇద్దరు టిఫిన్ తినడం పూర్తి చేస్తే, రమణి చేయి తుడుచు కోవటానికి తన పల్లు  అందించింది జానీ కి. మైత్రేయి కాస్ట వింతగా చూసింది. “వాళ్లిద్దరూ పెళ్లి చేసు కున్నారు, మైత్రేయి” అన్నాడు ప్రభాకర్.  “అవునా అంకు ల్ ఎప్పుడు జరిగింది,” అంది. “ తనపెళ్ళి  ముహార్తానికే ,” అన్నాడాయన. 

    “ బయలుదేరుదామా, “ అన్నది కాంతమ్మ గారు. అలాగే అంటూ తలూపి ఆమె తోటి  కార్లో కూర్చుంది. ప్రసాద్ నీకు ఇష్టమయితే నువ్వు కూడా రావచ్చు. నీ అవసరం కూడా ఉండొచ్చు అక్కడ ,” అన్నది కాంతమ్మ . “అలాగే మేడం,” అంటూ ఫ్రంట్ సీట్లో జానీ పక్క న కూర్చున్నాడు. కారు ముందుకు కదిలింది.  

     “ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి చేరారు ముందు. అక్కడ I C U లో  లైఫ్ సపోర్ట్ మీద ఉంచారు ఆవిడని. రాంబాయమ్మ గారు అక్కడే బెంచ్ మీద కూర్చొని కనిపించింది. 

    “ ఎలా ఉంది పెద్దక్క కి ,” అని అడిగింది కాంతమ్మ ఆమెని. 

  “ఎం చెప్పమంటారు మేడం, ఇపుడా , ఎప్పుడా అన్నట్టు గ ఉన్నది,” అంటూ కళ్ళు తుడుచు కున్నది.  

     పీపింగ్ హోల్ నుండి ఆమెని చూసి, “నేను డాక్టర్ దగ్గరికెళ్లి వస్తాను ,” అని చెప్పి ఆమె మైత్రేయి కలిసి వెళ్లారు. ప్రసాద్ అక్కడే కూర్చున్నాడు.

“డాక్టర్ ! పెద్దక్క  కండిషన్ ఏమిటీ?” 

“ మేము మీరు చెప్పారని లైఫ్ సపోర్ట్ మీదుంచాము. ఆమె ఇప్పటికి కాన్షియస్ లోనే ఉన్నది. చెప్పలేము ఆమె కోమా లోకి జారు  కోవచ్చు,” అన్నాడు.

“ కావాలంటే  ఆమెని మీరు లోపలికెళ్ళి  చూడండి. మాట్లాడండి. ఆమె ఏమి కోరుకుంటున్నాదో  అదే చేయండి,” అన్నాడు.

   ఆయన వెంట రాగ , శానిటైజ్డ్ గౌన్ వేసుకొని, మూతికి మాస్క్ వేసుకొని  కాంతమ్మ గారు  I C U రూమ్ లోకి వెళ్ళింది.

    కాంతమ్మ గారు మీద చేయి వేయగానే , ఆమె కళ్ళు తెరిచింది.  నిర్మలమయిన  సన్నని చిరునవ్వు.  “నాకింకా ఈ మందు లెందుకు, నన్ను మన ఆశ్రమానికి తీసుకెళ్ళు. స్పృహలో ఉన్నప్పుడే నా వాళ్ళందరిని చూసుకుంటాను,” అంది చాలా చిన్నగా. ఆమె కళ్ళలో అర్ధింపు. కాంతమ్మ గారు డాక్టర్ వంక చూసింది.

“ అక్క, నిన్ను ఇవ్వాళే   పంపించేస్తాను. మీకే అనారోగ్యము లేదు,” అంటూ “ రండి మేడం,” అని బయటికి నడిచాడు. కాంతమ్మ గారు బాధని దిగమింగు కుంటున్నట్టుగా, గంభీరంగా కనిపించింది.

   ప్రసాద్ ని తీసుకొని వెళుతూ, “మైత్రేయి నువ్విక్కడే ఉండు,”  అన్నది.

నేరుగా డాక్టర్ రూమ్ లోకి  వెళ్ళాక , “కాంతమ్మ గారి నుండి  నుండి హామీ పత్రం తీసుకోండి, మనం పెద్దక్కని  ఆశ్రమానికి పంపిస్తున్నాము,”  అన్నాడు. 

   వెంటనే నర్స్ ఒక ప్రింటెడ్ కాగితం ఆమె చేతిలో పెట్టి “ఇది ఫిల్ చేసి ఇసివ్వండి మేడం,” అంది.

 ఆ ఫార్మ్ ఫిల్ చేస్తున్నంత సేపు కాంతమ్మ గారి కి కళ్ళ నీళ్లు ఆగడం లేదు. అందుకనే ప్రసాద్ ఆ ఫార్మ్ తీసు కొని  ఆమె బంధువులు, దగ్గరివాళ్ళు అన్న బ్లాంక్ దగ్గర, ఆమె అభిమాన పుత్రుడు అని తన పేరు రాసాడు, కాంతమ్మ గారు, చేయూత  ఆశ్రమ ఫౌండర్  అని రాసాడు. ఫార్మ్ ఇచ్చేసాక , అంబులెన్స్ కి డబ్బు కట్టి  బుక్ చేసాడు. మధ్యాన్నానికల్లా ఫార్మాలిటీస్ పూర్తి చేసి పెద్దక్క ని ఆశ్రమానికి తీసుకెళ్లారు. 

    అప్పటికే  కమలమ్మ, రమణమ్మ , జ్యోతి, వసంత పెద్దక్క గదిని శుభ్రం చేసి, పక్క సర్ది ఎదురు చూస్తున్నారు. అంబులెన్స్ చేయూత  బిల్డింగ్ ముందర ఆగింది. అందరి ముఖాలోను ఆదుర్దా కనిపించింది. ముందు గా ప్రసాద్ దిగాడు. ఆ వెనకాత లే అంబులెన్స్ డ్రైవర్ దిగి, వెనక డోర్ తెరిచాడు. రాంబాయమ్మ గారు దిగింది. ఆ వెనకాలే స్ట్రెచర్ ని కిందకి జాగర్తగా  దింపి , పెద్దక్క ని ఆమె రూమ్ లోకి చేర్చారు. 

        ఆకాస్త ప్రయాణానికి పెద్దక్క బాగా అలిసి పోయి ఆయాస పడ  సాగింది, ఆమె కు డాక్టర్ చెప్పిన విధం గ వేడి నీళ్ల తో ఒక టాబ్లెట్ వేసి పడుకోబెట్టారు. ఆమె వెంటనే నిద్దర లోకి జారీ పోయింది. అలా  ఆ రోజంతా ఆమె మత్తు  లోనే ఉన్నది. మైత్రేయి, ప్రసాద్ , కాంతమ్మ , మిగిలిన ఇన్ మేట్స్ ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వంతుల వారీగా ఆమె మంచం దగ్గరే కూర్చుని ఆమెని చూసుకుంటున్నారు.

       మిడ్ నైట్ కి ఆమె కి మేలుకు వచ్చింది. ఆమె కళ్ళు తెరిచింది. ఆ సమయంలో ఆమె బెడ్ దగ్గర మైత్రేయి కూర్చుని ఉంది, కొద్దీ దూరం లో ప్రసాద్ ఉన్నాడు. ఆమె కళ్ళు తెరిచి సైగ ద్వారా మంచి నీళ్లు అడిగింది. తనని కూర్చోబెట్టమని అందరిని పిలవ మని చేతి సైగతోనే మైత్రేయి కి చెప్పింది. ప్రసాద్ సాయం తో ఆమె ను కూర్చో బెట్టి, మైత్రేయి బయటికెళ్లింది కాంతమ్మ గారిని పిలవడానికి.

      పావు గంటలో, మైత్రేయి కాంతమ్మ గారు, వసంత, రమణమ్మ కమలమ్మలతో ఆ గదిలోకి వచ్చింది. పెద్దక్క అందరిని ఏంతో  ఆప్యాయం గ చూడసాగింది. కాంతమ్మ రాంబాయమ్మ, రమణమ్మ, కమలమ్మ ఆమె మంచానికి ఇరువైపుల కింద కూర్చుని ఆమె  మీద చేయి వేశారు. ఆమె వాళ్ళందరిని అలా చూస్తూ కళ్ళు మూసుకుంది, 

    రమణమ్మ ,”రఘుపతి  రాఘవ రాజా రామ్ ,” అంటూ గద్గద స్వరం తో పాడసాగింది. కొద్దీ సేపటికల్లా ఆమె అచేతనురాలయింది. కాంతమ్మ గారికి అర్ధమయింది ఆమె   వాయువులు అనంత వాయువులలో కలిసి పోయాయని. ఎవ్వరికి పెద్దగా ఏడుపు రావడం లేదు, అంత నీరవ నిశ్శబ్దం. ఆమె ను ఆసుపత్రి లో చేర్చేముందు ఆమె చెప్పిన మాటలే వాళ్ళ మనసుల్లో కదిలాడు తున్నాయి.

“ అందరు శ్రద్దగా వినండి. నాకున్న ఈ కొద్దిపాటి జీవితం నాకెన్నో పాఠా లను నేర్పింది. ఆ అనుభవంతోనే చెబుతున్నాను. నా మరణం నా శరీరానికి గాని నా కు కాదు. నన్ను తలుచుకున్నప్పుడల్లా నేను మీకు గుర్తుకొస్తాను. నా మాటలు గుర్తుకొ స్తొయ. నా ఆశయాలను మరిచిపోకండి.  స్త్రీ మూర్తి ప్రేమ మయి, త్యాగ మయి. మోసం చేసిన, హింసించిన కూడా తన అమాయకత్వంతో, పిచ్చి ప్రేమ తో ప్రేమిస్తూనే ఉంటుంది. ఆ అమాయకత్వమే ఆమె కి శాపంగా  మారుతుంది. అప్పుడే మనలాంటి వాళ్ళు తయారవుతుంటారు. అలాటి  ఏ  అమ్మయి మన దగ్గరికొచ్చిన మనం  ఆసరా కావలి. ఈ ఆశ్రమ వాళ్ళకోసం. వాళ్ళకు  బతుకు మార్గం చూపించాలి కానీ ఆశ్రమం లో తిండి గడిచిపోతుంది లే అన్న ఆలోచన పెంచకూడదు. అలా ప్రతి  అభాగిని  మంచి యోధురాలి గా మారాలి. మరొక స్త్రీ కి ఎలాటి అన్యాయం జరగకుండా చూడాలి. అదే మన ఆశ్రమం నియమం కావలి.”

    పెద్దక్క ఇంక లేదు కానీ ఈ ఆ శ్రమ మాత్రం ఆమె ఆశయాల మీదనే నడుస్తుంది అని ప్రతి ఒక్కరు మనసులో నే  ఆమెకి నివాళులు అర్పించారు. తెల్లవారగానే ఆమెకి దహన సంస్కారం ఏర్పాట్లు జరిగాయి. ప్రసాద్ స్వయం గ ముందుకొచ్చాడు నేను చేస్తాను అని. బాధాతప్త హృదయం తో అందరు ఆమెకి వీడ్కోలు పలికారు.

     పురోహితుడన్నాడు ఆడవాళ్లు స్మశానికి రాకుడదు  అని. కానీ రమణమ్మ ,కమలమ్మ రాంబాయమ్మ , కాంతమ్మ గారు, మైత్రేయి ,వసంత అందరు మరొక వా న్ లో స్మశానా నికి కి చేరుకొని అంత్యక్రియలలో భాగంగా అందరు కలిసి ఆమె చితిమీద గంధపు చెక్కలు అమర్చారు, ప్రసాద్ చితి రగిలించాడు. ఒక అద్భుతమయిన స్త్రీ అస్తమించింది. కానీ ఆమె ఆశయం మాత్రం సజీవంగా అందరి మనస్సులో ఉండి.  పోయింది. 

     మైత్రేయి మనసం తా  శూన్యం గ అయిపొయింది. ఈ పోరాటం ఏ  ఒక్క స్త్రీ తోటి ఆగదు. నిరంతరం సాగుతూనే ఉంటుంది. పెద్దక్క లాంటి వాళ్ళేం దరో ఈ పోరాటానికి తాము కూడా సమిధలమే అనుకుంటూ తనువు  చాలిస్తుంటారు. శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం !!! ఆశాజనకం!! ఆమె మనసులో సుళ్ళు తిరుగుతున్నది.  

ఆశ్రమానికి చేరగానే పెద్దక్క రూమ్ లోకెళ్ళి అందరు కాసేపు మౌనం గ కూర్చును ధ్యానం చేశారు. “ ఐదో రోజున పూజారి గారు చెప్పినట్లు మనం గుడి లో అన్న సంత ర్పణ  కి ఏర్పా టు చేద్దాము. అవసరమయిన డబ్బు ని  మన ఆశ్రమ ఫండ్ నుండి ఖర్చు చేద్దాము,” అంటూ వసంత కి చెప్పి ,” నేను మళ్ళి ఈ రోజుకి మూ డో రోజు సాయంత్రానికల్లా  వచ్చేస్తాను,” అన్నది కాంతమ్మ గారు. 

అందరి దగ్గర సెలవు తీసుకొని బయలు దేరింది. “రాంబాయమ్మ గారు, మీరు కూడా ఇక్కడే ఉండి  కావాల్సిన ఏర్పాట్లు చూడడండి, ఐదో రో జు తరువాత మిమ్మల్ని తీసుకెళ్తాను.” అలా గేట్  దగ్గరికి వెళ్ళగానే జ్యోతి వచ్చింది వసంత వెనకాలే. “ ఎం జ్యోతి ఇప్పుడు అందరితో బాగాఉన్నావు కదా? అందరు నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా?” అడిగింది కాంతమ్మ గారు.

    “అవునమ్మా , నాకే ఇబ్బంది లేదు. రమణమ్మ గారయితే దగ్గరుండి తినిపిస్తారు. కమలమ్మ గారు నన్ను రోజు గమనిస్తూ నాకు జాగర్తలు చెబుతూ చాలా జాగర్తగా చూసుకుంటున్నారు. వసంతక్క ఎప్పటి కప్పుడు నాకు కావాల్సినవి అడిగి తెలుసుకుంటూ తెప్పించి ఇస్తుంది. అంత బాగానే ఉన్నది కానీ ,నాకు నా స్థితే అర్ధం  కావడం లేదు. నాకేమయింది? నాకే గత   విషయాలు ఎందుకు గుర్తుకు రావడం లేదో తెలియడం లేదు,” అంది కొంచం ఆందోళనగా. 

    “ జ్యోతి! ఇప్పుడంతా ఆందోళన పడతావేంటి , అన్ని నేను చూసుకుంటానన్నాను కదా! ఇలాటి సమయం లో నువ్వెక్కువ ఆందోళన పడొద్దు.,” అంటూ ధైర్యం చెప్పి మైత్రేయి తో సహా కాంతమ్మ గారు  కారెక్కారు, ప్రసాద్ వచ్చి ముందు సీట్ లో కూర్చున్నాడు.  కార్ బయలు దేరింది.  మైత్రేయి తనని ఇంటి దగ్గరే దింపమని చెప్పింది. ప్రసాద్,” మేడం, నేను మీ ఇంటి దాకా వస్తాను అక్కడి నుండి నా బైక్ మీద ఇంటికి వెళతాను,” అన్నాడు. అలానే అని చెప్పింది కాంతమ్మ గారు. ప్రయాణమంతా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

రెండు రోజులు గడిచిన తరువాత వసుంధర మైత్రేయి ని రమ్మ ని ఫోన్ చేసింది. ఈసారి  మైత్రేయి  ఒక్కతే వెళ్ళింది ఆమెని కలవడానికి. 

“ మైత్రి ! వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకో విషయం చెప్పాలి.” 

“ ఏంటి వసు చెప్పు. ఏదయినా తట్టుకోగలను,” అంది నవ్వుతు.

“ అలాగా , అయితే విను, మహారాజశ్రీ సుబ్బా రావు గారు వచ్చారు నన్ను కలవ డానికి,” అంది కళ్ళు ఎగరేస్తూ.

“ నిజమా ! ఎందుకు!”

“ నిజంగా నిజం! ఎందుకు అంటే ఏముంది, నువ్వంటే తనకెంతో రెస్పెక్టని, నువ్వు ఒప్పుకుంటే రాజి చేసుకుంటానని కి, నిన్ను ఏ  కష్టం లేకుండా చూసుకుంటానని చెప్పాడు. పైగా తనని తాను తిట్టు కుంటూ, నువెక్కువ గ ప్రసాద్ వెంటే తిరుగుతున్నావని, అతని మాటలే వింటున్నావని, అయినా తాను నిన్ను తప్పు పట్టటం లేదట. ఎందుకంటే ఒంటరి ఆడదానివి ఏ దొక రంకంగా ఒక మగా తోడు ఉండాల్సిందే కదా , అందుకే నువ్వు ప్రసాద్ తోటి స్నేహం చేసావని, అందుకు తనకేమి తప్పుగా అనిపించటం లేదని, ఇప్పటికయినా నిన్ను ఆదరించటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.” అంది చాలా నాటకీయంగా.

“ ఇంకేం చెప్పాడు.”  

“ ఇంకా అంటే! నీకు ఆయనకి మధ్యన రాజి చేసి కేసు కొట్టివెయ్యిస్తే , నాకు ఫీజ్ ఇస్తాన్నడు. ఏంటి  ఒప్పేసుకోమంటావా?” అంది ఈ సారి కన్ను గీటుతూ.

“ వసు! ఏడుస్తున్నవాళ్ళని మరింత గ ఏడిపించ కూడదే. నీకు వాడేంత ఇస్తానన్నాడో  చెప్పు, తలతాకట్టు పెట్టయినా నీకు అంతకు రెండింతలిచ్చుకుంటాను, నన్ను వాడి బారి న పడనీయకే తల్లి,” అంటూ అంతే నాటకీయంగా మైత్రేయి చేతులు జోడించింది. 

“ ఛాఛ్ఛ ! నేను నిన్ను  ఉడికించానంతే. అంత బెంబేలు పడమాకు. నీ కేసు లో వచ్చే తీర్పు పదిమంది ఆడవాళ్ళకి స్ఫూర్తి  నివ్వాలి , ఇలాంటి మగవాళ్ళకి కనువిప్పు కావలి, అదే నా ప్రయత్నం,” అంది మనఃస్ఫూర్తిగా.

“వసు, నీకు తెలుసా, పెద్దక్క చనిపోయింది. ఈ శనివారమే గుడిలో సంతర్పణ చేస్తున్నారు. నువ్వు కూడా వస్తావా,” అడిగింది మైత్రేయి.

“ అయ్యో నేను రా క పోతే ఎలాగా. పెద్దక్క మొదటి ఫ్యాన్ ని నేనే. ఆమె ఆ శ్రమ కోసం పోరాడుతున్నప్పుడు నేను లా స్టూడెంట్ ని. మేమందరం ఆమె కీ సపోర్ట్ గా నిలబడి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసాము. అప్పటి కలెక్టర్ , రాణి కుముదిని మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అప్పుడే కాంతమ్మ గారితో కూడా పరిచయ మయింది. అప్పటి నుండి నేను కాంతమ్మ గారితో పెద్దక్క తో కలిసి చాల సమావేశాలలో పాల్గొన్నాను. పెద్దక్క పెద్దగా చదువుకోలేదు. కానీ ఆమె మాటలో మహా మేధావి కనిపిస్తుంది. ఆమె ఆశయాలు  వింటే ఎవరమయిన ఆమె బాట లో నడవాల్సిందే. అది ఆమె వ్యక్తిత్వం. కాంతమ్మ గారు పెద్దక్క యొక్క మినియేచర్ అని చెప్పాలి. ఆరోజు అయ్యే ఖర్చంతా నేను వెంకటేశ్వర్లు గారు పెట్టు కుంటామని చెప్పాము.” అంది. 

“ గ్రేట్ గ్రేట్! వసు! ఆ రోజు అందరం అక్కడే కలిసుకుందాము, నేను కాలేజ్ లో పర్మిషన్ తీసుకొని వచ్చాను, ఇక వెళతాను,” అంటూ మైత్రేయి వెళ్లి పోయింది. 

(ఇంకా ఉన్నది )

 

 

      

           

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

మార్గశీర్షం