కిందటి వారం 20వ తేదీన, ఉదయం రాయల్ ఆల్బర్ట్ మెమోరియల్ చూసాక, బకింగ్హమ్ పాలెస్ బయలు దేరాము. ఈసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
దారిలో హైడ్ పార్క్ ను చూపిస్తూ గైడ్ దాని విశేషాలను చెబుతుంది. ఆమె తరువాత వైదేహి మైక్ తీసుకుని ఎక్స్ ప్లేన్ చేస్తూంది. బస్‌లో ట్రూప్ మేనేజర్స్ మాట్లాడటానికి అనువుగా మైక్ అరేంజ్ మెంట్ ఉంది. అందువల్ల బస్సులో చివరవరకూ స్పష్టంగా వినపడుతుంది. వాళ్ళు మమ్మల్ని ఆ పార్క్ లోపలికి తీసుకెళ్ళలేదు కాని బస్ ని స్లోగా పోనిస్తూ ఆ పార్క్ పుట్టు పూర్వోత్తరాలు, దాని ప్రాముఖ్యత గురించి చాలా విపులంగా వివరించింది.
హైడ్ పార్క్ గ్రేటర్ లండన్‌లోని వెస్ట్మిన్స్టర్లో 350-acre (140 ha), చారిత్రాత్మక గ్రేడ్ I-జాబితాలో ఉన్న అర్బన్, ఒక రాయల్ పార్క్, ఇది కెన్సింగ్టన్ ప్యాలెస్ నుండి కెన్సింగ్టన్ గార్డెన్స్, హైడ్ పార్క్ మీదుగా హైడ్ పార్క్ కార్నర్, గ్రీన్ పార్క్ మీదుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ నుండి సెయింట్ జేమ్స్ పార్క్ వరకు గొలుసుగా ఏర్పడే ఉద్యానవనాలలో అతిపెద్దదట. హైడ్ పార్క్ సర్పెంటైన్ మరియు లాంగ్ వాటర్ సరస్సులచే విభజించబడింది.
ఈ ఉద్యానవనం 1536లో హెన్రీ VIII చే స్థాపించబడింది, అతను వెస్ట్‌మినిస్టర్ అబ్బే నుండి భూమిని తీసుకొని దానిని వేటకోసం ఉపయోగించాడు. ఇది 1637లో ప్రజలకు తెరవబడింది, ముఖ్యంగా మే డే పరేడ్ల కోసం ప్రజాదరణ పొందింది. ఆ సమయంలో ఈ ఉద్యానవనం ద్వంద్వ పోరాటాల కోసం ఒక ప్రదేశంగా మారి ప్రభువుల సభ్యులు పాల్గొనేవారు. 19వ శతాబ్దంలో, ది గ్రేట్ ఎగ్జిబిషన్ ఆఫ్ 1851 పార్క్‌లో జరిగింది.
ఈ ఉద్యానవనం యొక్క పేరు ‘మనోర్ ఆఫ్ హైడ్‘ నుండి వచ్చింది. ఈ పేరు సాక్సన్ మూలానికి చెందినదని నమ్ముతారు. దీని అర్థం ‘ఒకే కుటుంబం ఆధారపడిన వ్యక్తుల మద్దతు కోసం తగిన భూమి‘ అని అర్థంమట. మధ్య యుగాలలో, ఇది వెస్ట్మిన్స్టర్ అబ్బే యొక్క ఆస్తి. హైడ్ పార్క్‌ను వేట కోసం హెన్రీ Vlll 1536లో అబ్బే నుండి తీసుకుని, ఒక జింకల పార్క్‌గా ఏర్పాటు చేసుకున్నాడట. మొదటి జేమ్స్ అందరికి ప్రవేశాన్ని అనుమతించక ఒక ప్రైవేట్ హంటింగ్ గ్రౌండ్‌గా ఉంచురున్నాడట.
మొదటి చార్లెస్ 1637లో పార్కును సాధారణ ప్రజల కోసం తెరిచాడు. ఇది త్వరితంగా మే డే వేడుకల కోసం ఒక ప్రసిద్ధ సమావేశ స్థలంగా మారింది. 1727లో హైడ్ పార్క్‌ను విభజించి, కెన్సింగ్టన్ గార్డెన్స్‌ను సృష్టించారు. 6 సంవత్సరాలకు అంటే 1733లో పూర్తయింది. హైడ్ పార్క్ అనేక రాయల్ జూబ్లీలు, వేడుకలకు ప్రధాన వేదికగా ఉంది. 1887లో క్వీన్ విక్టోరియా స్వర్ణోత్సవం కోసం, 1977లో క్వీన్ ఎలిజబెత్ II సిల్వర్ జూబ్లీ ఈ పార్క్ లోనే జరిపారు. 2012లో, క్వీన్స్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పార్క్‌లో ఒక పెద్ద పండుగ జరిగింది.
19వ శతాబ్దం నుండి హైడ్ పార్క్‌లో స్వేచ్ఛా ప్రసంగాలకు, ప్రదర్శనలకు ఒక ముఖ్య నిలయమైంది. స్పీకర్స్ కార్నర్ 1872 నుండి స్వేచ్చా ప్రసంగం, చర్చా కేంద్రంగా స్థాపించబడింది, అయితే అక్కడ కొన్ని నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి. 20వ శతాబ్దం చివరలో, పింక్ ఫ్లాయిడ్, ది రోలింగ్ స్టోన్స్, క్వీన్ వంటి సమూహాలను కలిగి ఉన్న పెద్ద-స్థాయి ఉచిత రాక్ సంగీత కచేరీలను నిర్వహించడానికి పార్క్ ప్రసిద్ధి చెందింది. పార్క్‌లోని ప్రధాన సంఘటనలు 2005లోను, 2007 నుండి వార్షిక హైడ్ పార్క్ వింటర్ వండర్ల్యాండ్ వంటివి 21వ శతాబ్దం వరకు కొనసాగాయి. ఇందులో బాటిల్ ఆఫ్ వాటర్లూ లో చనిపోయిన ఎంతో మంది స్మారక చిహ్నాలు ఉన్నాయని చెప్పింది.
హైడ్ పార్క్ అనేది సెంట్రల్ లండన్‌లోని ఒక రాయల్ పార్క్, ఉత్తరాన బేస్వాటర్ రోడ్, తూర్పున పార్క్ లేన్, దక్షిణాన నైట్స్‌బ్రిడ్జ్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇంకా కొద్ది దూరంలో ఉత్తరాన పాడింగ్టన్, తూర్పున మేఫెయిర్, దక్షిణాన బెల్గ్రేవియా ఉంది. ఆగ్నేయంలో, పార్క్ వెలుపల, హైడ్ పార్క్ కార్నర్ ఉంది, దాని దాటి గ్రీన్ పార్క్, సెయింట్ జేమ్స్ పార్క్, బకింగ్‌హామ్ ప్యాలెస్ గార్డెన్స్ ఉన్నాయి. ఈ పార్క్ 1987 నుండి హిస్టారిక్ పార్క్స్ మరియు గార్డెన్స్ రిజిస్టర్లో గ్రేడ్ I గా జాబితా చేయబడిందిట. హైడ్ పార్క్ సంవత్సరం పొడవునా ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది.
ఆ పార్క్ గురించి లండన్ గైడ్ వివరణలు, ఆ తరువాత వైదేహి అనువాదాల ఉదంతం జరుగుతుండగానే నెక్స్ట్ స్పాట్ లండన్ నంబర్ వన్ రోడ్ బిల్డింగ్స్, స్టాచూ ఆఫ్ డ్యూక్ వెల్లింగ్టన్ కనబడింది. 1815 వాటర్లూ యుద్దంలో నెపోలియన్ తో పోరాడిన బ్రిటిష్ లీడరు అతను. ఆయన కట్టించిన హార్సిలి హౌజ్ బిల్డిండ్ రెండో వేపున ఉంది.
బకింగ్హమ్ ప్యాలెస్ వచ్చేసింది. గార్డన్ ఆఫ్ బకింగ్హమ్ ప్యాలెస్ ఎన్నో రకాలైన వృక్షసంపదతో ఎంతో అందగా ఏర్పరచబడిందని, దాదాపుగా సంవత్సరానికి 15000 మంది గెస్టుల దాకా రాజు ఆ గార్డెన్ కి ఆహ్వానిస్తాడని, జూలై నుండి సెప్టెంబర్ వరకు ప్రజలకు ప్రవేశం ఉంటుదని చెప్పింది. ముందుగా ఆ పాలెస్ లో సర్వెంట్ క్వార్టర్స్ కనబడ్డాయి. 250 మంది వరకు పనివారు వారి ఫామిలీస్ తో నివసిస్తున్నారు. వారంతా ఆ ప్యాలెస్ మెయింటెనెన్స్, నిర్వహణ కోసం నియమించబడ్డారు.
అంతసేపు బస్సు స్లోగా నడుస్తూనే ఉంది. కొంత దూరంలో బస్ ఆపేసి ప్యాలెస్ దగ్గరికి మా ట్రూప్ అంతా వెళ్ళాము. మూసిఉన్న ప్రధాన ద్వారం నుండి చాలా దూరంగా విశాలమైన భవనం, దాని మీద బ్రిటిష్ ఫ్లాగ్ చూసాము. ఇన్నాళ్ళు పేపర్లలో ఫొటోలు చూసాము. నిజంగా చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా కనబడింది. డయానా, కింగ్ ఫిలిప్స్, ఎలిజబెత్ మరణానంతరం ఆ గేటు దగ్గరే పూల బుకేలు ఉంచటం టీవీల్లో చూసాము.
బకింగ్‌హామ్ ప్యాలెస్ అనేది లండన్‌లోని ఒక ప్యాలెస్. ఇది సెంట్రల్ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ నగరంలో ఉంది. ఇది బ్రిటిష్ చక్రవర్తి ప్రధాన అధికారిక రాజ నివాసం, చక్రవర్తి నివసించే, పనిచేసే పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఈ ప్యాలెస్ తరచుగా రాష్ట్ర సందర్భాలు, రాచరిక ఆతిథ్యానికి కేంద్రంగా ఉంటుంది. జాతీయ సంతోషం, సంతాప సమయాల్లో బ్రిటిష్ ప్రజలకు ఇది కేంద్ర బిందువు.
ఈ రాజభవనం రాచరికం పరిపాలనా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది, ఇక్కడ నుండి చక్రవర్తి విదేశీ ప్రముఖులు, రాయబారులతో సమావేశం, రాష్ట్ర పత్రాలపై సంతకం చేయడం, అధికారిక సంక్షిప్త వివరణలు స్వీకరించడం వంటి అనేక అధికారిక విధులను నిర్వహిస్తారు. అదనంగా, రాజభవనం తరచుగా రాష్ట్ర విందులు, పెట్టుబడులు, ఇతర అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను 1703లో బకింగ్‌హామ్, నార్మాండీ 1వ డ్యూక్ జాన్ షెఫీల్డ్ నిర్మించారు. ఇది లండన్‌లోని టౌన్హౌస్ నివాసంగా నిర్మించబడింది. బ్రిటిష్ రాజకుటుంబం 1761లో ప్యాలెస్‌ని కొనుగోలు చేసింది. ఇది 1837లో కుటుంబానికి అధికారిక లండన్ నివాసంగా మారింది. 19వ శతాబ్దంలో రాజభవనం బాగా విస్తరించింది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 775 గదులు, 19 స్టేటురూమ్‌లు, 78 బాత్రూమ్లు ఉన్నాయి. ప్యాలెస్‌కి దారిలో ది మాల్ అని పిలువబడే ఒక ఉత్సవ రహదారి ఉంది. దాంలో ఇండియన్ స్టైల్ లో నిర్మించిన దర్బార్ హాల్ అనే ఒక ప్రత్యేకమైన మీటింగ్ హాల్ ఉందట.
ప్రతిరోజు ఉదయం 11:01 గంటలకు, బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో గార్డును మార్చే వేడుక జరుగుతుంది, ఈ సమయంలో పాత గార్డు నుండి కొత్త గార్డు బాధ్యతలు స్వీకరిస్తాడు. బ్యాండ్‌తో జరిగే తంతు ఉంటుంది. గార్డు మార్చడం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ ప్యాలెస్ వేసవి నెలల్లో పర్యటనల కోసం ప్రజలకు తెరిచి ఉంటుంది. సందర్శకులు ప్యాలెస్ యొక్క అనేక గదులు, తోటలను చూడవచ్చు. బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటిష్ చరిత్ర, సంస్కృతికి ఒక ముఖ్యమైన చిహ్నం.
ప్రస్తుతం కింగ్ చార్లెస్ లండన్ లో లేరు. గేటు ముందు నుంచే చూస్తూ థామస్ కుక్ వారు ఏర్పాటు చేసిన పేయిడ్ గైడ్ ద్వారా ఆ ప్యాలెస్ గురించి తెలుసుకున్నాము. వైదేహి మాకు మన ఇండియన్ ఇంగ్లీషు లోనూ, హిందీ, తమిళం లో ఎక్స్ ప్లెయిన్ చేసింది మా గ్రూపుకి. ఆ ప్యాలెస్ కి ఎదురుగా క్వీన్ విక్టోరియా మెమోరియల్ ఉంది. దాని గురించి ఆ గైడ్ వివరించింది.
విక్టోరియా మెమోరియల్, సెంట్రల్ లండన్‌లో ఉంది. విక్టోరియా మెమోరియల్ అనేది క్వీన్ విక్టోరియా స్మారక చిహ్నం, ఇది శిల్పి సర్ థామస్ బ్రాక్ చేత లండన్‌లోని దిమాల్ చివరిలో ఉంది. 1901లో రూపకల్పన చేయబడి, 16 మే 1911న ఆవిష్కరించారు. కెన్సింగ్టన్ గార్డెన్స్‌లోని ఇంతకుముందు వివరించిన ఆల్బర్ట్ మెమోరియల్ లాగా, ఆయన భార్య జ్ఞాపకార్థం, విక్టోరియా మెమోరియల్ కూడా ఐకానోగ్రాఫిక్ శిల్పాలు చేసారట. ఈ స్మారక చిహ్నం కేంద్ర స్తంభం పెంటెలిక్ పాలరాయితో చేయబడి, ఒక్కో విగ్రహం లాసా పాలరాయి గిల్ట్ కాంస్యంతో ఉన్నాయి. స్మారకం బరువు 2,300 టన్నులు (సుమారు 2535 చిన్న టన్నులు), 32 మీ (104 అడుగులు) వ్యాసంతో ఉంది. 1970లో ఇది గ్రేడ్ Iలో జాబితా చేయబడింది.
క్వీన్ విక్టోరియా మరణం తర్వాత ఆమె స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రాజు ఎడ్వర్డ్ VII సూచించారు. విక్టోరియా మెమోరియల్ యొక్క తుది రూపకల్పనలో థామస్ బ్రాక్ రూపొందించిన అసలు స్కెచ్ మోడల్.
మార్చి 26న స్మారక చిహ్నాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ వెలుపల ఉంచాలని మరియు మాల్‌ను కొద్దిగా కుదించాలని నిర్ణయం ప్రకటించబడింది. ఈ పనికి £250,000 ఖర్చవుతుందని అంచనా వేయబడిందిట. నిర్మాణానికి ప్రభుత్వం ఎటువంటి గ్రాంట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. స్మారక చిహ్నం కోసం బ్రిటీష్ సామ్రాజ్యం తో పాటు ప్రజల నుండి కూడా నిధులు సేకరించబడ్డాయి. ఆస్ట్రేలియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, న్యూజిలాండ్ ప్రభుత్వం నిధికి విరాళాలు ఇచ్చారట. ప్రిన్స్ ఆర్థర్, డ్యూక్ ఆఫ్ కన్నాట్, స్ట్రాథెర్న్, దీనికి కింగ్ జార్జ్ V, విక్టోరియా యొక్క సీనియర్ మనవళ్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి రాచరిక ఊరేగింపుతో ఆ మెమోరియల్ ని ఆవిష్కరించారట. హోమ్ సెక్రటరీ పాత్రలో, విన్స్టన్ చర్చిల్, లార్డ్ ఎషర్ స్మారక చరిత్రను వివరిస్తూ రాజు ప్రసంగించారు. దీని తరువాత, స్మారక చిహ్నం యొక్క శిల్పి అయిన థామస్ బ్రాక్‌కు నైట్ బిరుదు ఇవ్వాలని రాజు నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఆల్బర్ట్ మెమోరియల్ లాగానే వికేటోరియా మహారాణి మెమోరియల్ కూడా ఎంతో కళాత్మకంగా రూపొందించారు. ఫోటోలు తీసుకోవటం ఆపలేక పోతున్నాను. ఒక్కోటి ఒక్కో కళాకండాలుగా శిల్పులనైపుణ్యం కనబడుతుంది.
అప్పటికి మా ట్రూప్ మెంబర్స్ కి ఒకరంటే ఒకరికి వివరాలు తెలియవు. అందుకే మా ఇద్దరిని ఫోటో తీయమని అడగలేక మాకు మేమే సెల్ఫీలు తీసుకున్నాము. వైదేహి మా ట్రూప్ అందరిని ఆ బ్రిటిష్ గైడ్ తో కలిపి ఫోటోలు తీసింది. కాని దేవానంద్ ఫామిలీ మాత్రం ప్రత్యేకంగా కనబడింది. ఇద్దరూ తెగ ఫోటోలు తీసుకుంటుంన్నారు. అయినా తృప్తిపడక, ఎలా తెలుసుకున్నాడో మా ప్రణయ్ పేరు పెట్టి పిలిచాడు. ‘ఏ పుతర్ పర్ణయ్, మేరా, ఆంటీకా ఫొటోస్ నికాలో‘ నార్త్ ఇండియన్ స్టైల్ హిందీలో అంటూ వాణ్ణి తమ ఫోటోలు తీయమని పిలిచాడు. మా ఫోటోలను ఆపి వాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అందరూ బస్ లోకి వెళ్ళడానికి రమ్మని వైదేహి పిలుస్తున్నావాళ్ళిద్దరూ ప్రణయ్‌ని వదలటం లేదు. నేను వాడ్ని రమ్మని తొందర చేస్తూ అందరితో బస్‌లోకి వెళ్ళిపోయాను. మరోసారి వైదేహి పిలవటంతో ఆయన విసుక్కుంటూ బస్ ఎక్కాడు. ‘వైదేహీజీ, హమారా చాయ్ కా టైమ్ హోగయా. కహా మిలేగా‘ అంటూ అడిగాడు. ‘అభీ సే?‘ అంటూ ఆశ్చర్య పోయిందామె. ఎందుకంటే అప్పుడే కదా బ్రేక్‌ఫాస్ట్ తో కాఫీ టీలు తాగింది. అయినా త్వరలో దారిలో తాగొచ్చని చెప్పి బస్ బయలు దేరదీసింది. బిగ్‌బెన్ పార్లమెంట్ హౌజ్ కొహినూర్ వజ్రమున్న భవనం చూసాము. ఆ వీధి వీధంతా గవర్నమెంట్ బిల్డింగ్సే. ఆ వజ్రాన్ని చూసే అవకాశ ముంటే బాగుండేది. కాని వీలు పడదట.
బిగ్‌బెన్ పెద్ద గడియారపు చతురస్రాకారపు స్తూపం. ప్రపంచంలోని ప్రసిద్ది గాంచింది. దాని గురించి వచ్చే వారం తెలుసుకుందాం.