మన మహిళా మణులు – శేర్ భారతీ మూర్తి

కరీంనగర్ జిల్లాలోని ఖాజీపురం అనే గ్రామం వాస్తవ్యులు శ్రీ నమిలకొండ మాధవయ్య, మధురమ్మల ఏకైక పుత్రికగా 1957లో జననం.
తండ్రి ఉద్యోగరీత్యా కరీంనగర్ లో స్థిరపడడం దృష్ట్యా బాల్యం నుండి వివాహం వరకు.
విద్యాభ్యాసం : పాఠశాల చదువునుండి డిగ్రీవరకు తెలుగు మీడియం కరీంనగర్ పట్టణంలో.
1977 వ సంవత్సరంలో మంచిర్యాల వాస్తవ్యులు శ్రీ శేర్ లింగమూర్తి గారితో వివాహం,భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ పట్నం లో స్థిరనివాసం.
1977 నుండి గృహిణిగా కుటుంబ బాధ్యతలతో పాటు భర్తతో కలిసి 1980 నుండి 2000 వరకు మంచిర్యాల మరియు హైదరాబాద్ లలో 6 విద్యాసంస్థలు నెలకొల్పి సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది.

1994 లో మేనేజంగ్ డైరెక్టర్ గా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్థాపించి “యార్లగడ్డ ఝాన్సీ ” టీవీ anchor, actress, లాంటి ఉత్తమ విద్యార్థులను ఈ సంస్థ ద్వారా సమాజానికి అందియ్యడం జరిగింది.
1997 లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో “జ్యూట్ సర్వీస్ సెంటర్ ” కి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా జనపనార ఉత్పత్తుల కొరకు మహిళల కు శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అవగాహన మరియు శిక్షణ తరగతులు నిర్వహించడం లో చూపిన ప్రతిభకు, సేవకు పేరేన్నిక గన్న వివిధ సంస్థల నుండి ఎన్నో అవార్డ్ లను పొందడం జరిగింది.
వ్యాపారంలో 35 yrs అనుభవం గడించి 1999 లో భర్తను కోల్పోయిన తర్వాత 2015 వరకు వ్యాపార మరియు విద్యా రంగాలలో సేవ లందించి,వ్యక్తిగత కారణాల వల్ల ఆ రంగాలనుండి నిష్క్రమించడం జరిగింది.
సాహితి ప్రస్థానం : బాల్యం నుండి సమాజం లోని సమస్యలకు స్పందించి, వాటికి స్ఫూర్తి దాయకంగా ఒక సందేశం సమాజానికి అందించాలానే ఆశయంతో మనుషుల మనసులను ఆలోచింపచేసే విధంగా పాటలు, చిన్న చిన్న కవితలు రాయడం, పాడుకోవడం అభిరుచిగా కలిగిన సాహితీ ప్రయాణం 1918 లో ” “అంతర్మథనం “అనే వచన కవిత సాహిత్యంతో పుస్తకంగా రూపుదిద్దుకుని రవీంద్ర భారతిలో ఆవిష్కరంపబడి పదుగురి ప్రశంసలు పొందింది.

నిరంతరం సామాజిక మాధ్యమాల్లో ” శుభోదయం, “స్ఫూర్తి కిరణాలు, “ఒక మంచిమాట” గా వెలువడిన, వచన కవితలు పుస్తకాలుగా తుదిరూపు దిద్దుకుంటూ ఆవిష్కరణకు సిద్దమౌతున్నాయి.

కొన్ని మాస పత్రికల్లో రాసిన వ్యాసాలు సంకలనం దశలో ఉన్నాయి.
సామాజిక సమస్యలను తనదైన శైలిలో సున్నితంగా, భావయుక్తంగా, సరళ పదబంధాలతో రాయడం వెనక ప్రస్తుత సమాజంలో మనుషుల పై ఆంగ్ల భాష ప్రభావం ఎక్కువగా ఉండి ముఖ్యంగా ఈ తరం తెలుగు భాషను అభ్యసించడం, మాట్లాడడం తగ్గిస్తున్న తరుణంలో ఒక రచయిత్రిగా తన సరళ వచన సాహిత్యం సమాజంలో అందరికి చేరుతుందనే ఉద్దేశ్యం తో రాయడం తద్వారా సమాజం లోని సమస్యలను మనుషులు అర్ధం చేసుకుని ఆలోచించి ఆ సమస్య పట్ల తమదైన రీతిలో స్పందించి ఆ సమస్యకు పరిష్కారం వెదికే దిశగా కొందరైనా అడుగులు వేస్థారని, ఇదే ఒక మంచి మార్పుకు దారితీస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
అవార్డ్ లు : హైదరాబాద్ ఆణిముత్యాలు, ఉత్తమ పారిశ్రామిక వేత్త, ఉత్తమ పరిపాలనా దక్షురాలు (బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ), విశిష్ట మహిళ, మహిళా శిరోమణి, 2020 ఉత్తమ మహిళ,పొందడం రచయిత్రి గా సమాజం పట్ల మరింత బాధ్యతను పెంచాయి అని భావిస్తాను.
న్యాయవాది ప్రస్థానం : 1977 వివాహాము వరకు నా చదువు కేవలం డిగ్రీ మాత్రమే. కానీ వివాహనంతరం ఇద్దరు పిల్లల తల్లిగా మరల చదువును 1986 నుండి మొదలు పెట్టి ఉన్నత చదువులైన M A తెలుగు, L L. B పట్టాలు పుచ్చుకుని, 1992 న్యాయవాద వృత్తి లో చేరడం జరిగింది.కొంత కాలం వృత్తిలో అనుభవం గడించి, కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా,వృత్తిని ఆపివేసి, కుటుంబ కార్యక్రమాలు చక్కబెట్టుకుంటున్న సమయంలో మరల 56 వయసు నుండి 58 సంవత్సరాలవయసు వరకు MBA పూర్తి చేసుకుని, కుటుంబ బాధ్యతలన్ని పూర్తి చేసుకుని మరల 65ఏళ్ల వయసు లో 2022 లో హైకోర్టులో వ్యాయవాద వృత్తి లో చేరడం జరిగింది.
ఎన్ని అడ్డంకులు వచ్చినా, నాకు చాలా ఇష్టమైన సాహితీ ప్రయాణం కొనసాగిస్తున్నాను.
సమాజం లో జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలను ప్రశ్నిస్తూ, నాదైన శైలిలో కవితలు, గేయాలు రాస్తూ సామాజిక మాధ్యమాల్లో విలువరించడం చేస్తున్నాను.

ప్రస్తుతం న్యాయవాద విద్య ను అభ్యసిస్తున్న తెలుగు మాద్యమం విద్యార్థుల సౌలభ్యం కోసం వారి చదువుకు ఉపయోగపడే విధంగా నాయశాస్త్రం లోని వివిధ అంశాలను తెలుగు భాష ప్రామాణికంగా న్యాయ పరమైన అంశంతో ఒక పుస్తకం రాయడం ప్రారంభించాను.
రాబోయే కాలంలో ప్రాంతీయ భాషల ప్రాధాన్యత పెరుగుతున్న కారణంగా, కొందరు న్యాయమూర్థులు తీర్పులు కూడా ప్రాంతీయ భాషలో వెలువరించడం దృష్టిలో పెట్టుకుని న్యాయ పరమైన అంశాలు అందరికి అర్థమయ్యే విధంగా సరళ మైన భాషలో రాయాలని ఈ పుస్తకానికి శ్రీ కారం చుట్టడం జరిగింది.
శ్రీమతి శేర్ భారతిమూర్తి.
హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మ లానే పరమాత్మ సర్వాంతర్యామి

యూరోప్ ట్రిప్ – 7