11.వ్యాస మహర్షి :-” అర్థశాస్త్రం”
వ్యాసమహర్షి వేదాలను విభజించాడు కాబట్టి, వ్యాసుణ్ఢి ‘ వేద వ్యాసుడు’ అని అంటారు. వ్యాసుల వారు మహాభారతమే కాకుండా అర్థశాస్త్రాన్ని కూడా రచించాడు దీన్ని 3 భాగాలుగా విభజించి, వాటిని 82 విధానాలుగా ధనం ఎలా సంపాదించాలో వివరించాడు. దీని ఆధారంగానే కౌటిల్యుడు (చాణిక్యుడు)అర్థశాస్త్రాన్ని మరింత విపులంగా వివరించి దాన్ని గ్రంథస్థం చేశాడు అని ఒక వాదన ఉన్నది.అయితే ఇప్పటికీ చాణిక్యని అర్థశాస్త్రమే ప్రాచుర్యంలో ఉన్నది.
12.అగస్త్య మహాముని :- ” శక్తి తంత్రం”
అగస్త్య మహాముని ని అపార విద్యాపారంగతునిగా మన వేదాలలో చెప్పబడింది. ఈయన రచించిన శక్తి తంత్రం అనే గ్రంథం లో సూర్యుడు చంద్రుడు భూమి గాలి అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు వాటి వినియోగాలు వివరించి ఉన్నది అంతేకాకుండా ఇందులో అత్యంత ప్రమాదకరమైన ‘అణ్వస్త్ర’ తయారీ వాటి విచ్చేదన గురించి కూడా ఉన్నది.
13. మతంగ కృషి :- ” సౌదామినీ కళ ”
నీడల ద్వారా ఆలోచనల ద్వారా మనిషి మానసిక ప్రవర్తన చెప్పబడింది. ఇంకా భూమి,పర్వతాల లోపల భాగాలు ఛాయాచిత్రాలు తీసే ప్రక్రియ చెప్పబడింది. ఔరా!!
14. అత్రిముని :- “మేఘశాస్త్రం”
అత్రిముని 12 రకాల మేఘాలు 12 రకాల వర్షాలు 24 రకాల మెరుపులు 33 రకాల పిడుగుల గురించి ఈ గ్రంథంలో వివరించారు.
ఇంకా….కుమారస్వామి అనే ఋషి “గజ శాస్త్రాన్ని” రచిస్తే,
అగ్ని వర్మ అనే ఋషి “అశ్వ శాస్త్రాన్ని” రచించాడు.
ఇక భరద్వాజముని చాలా పేరుగాంచిన ముని. వీరు ” యంత్ర శాస్త్రం” “ఆయుర్వేదం” “ధనుర్వేదం” రచించి మనకు అందించిన ఋషి