ఆ పాదం

కవిత

ఆ పాదం ఎన్ని చరితలకు అడుగుల ముద్రలేసి

తన జాడలతో జాతినిర్మాణం చేసిందో…

ఎన్ని ప్రాణాలకు ఆశలదీపాలను వెలిగించి

బతుకుబాటకు నడకనేర్పిందో….

ఎన్ని తరాలకు వారధై అలుపులేని అభివృద్ధికి మేలైన

నడతలు నేర్పి అలసిసొలసి వాలిందో…

ఏ అపురూప శిల్పి చేతిలో అద్భుతంగా మలచబడి

ఆణువణువూ ఊపిరితో కదలాడుతోందో….

అవి అచేతనమైన మనసులలో ఆశ్చర్య ఆయువులు

పోసేందుకు మ్రోగిన మువ్వల గలగలలు…

ఆ కాలి కంకణధ్వనులలో సజీవుడైన శిల్పి

ఊపిరి రవళులతో దిగంతాల చాటే

అలసిన అతివ అనంత భావోద్వేగ అంతరంగ విలవిలలు…

ఆ మట్టెలు మట్టిలో కూరుకుపోయిన సమానత్వ వేర్లను వేల్లకు చుట్టుకొని

పోరాడే మౌన సంఘర్షణలకు సాక్ష్యాలు..

Written by vakula vasu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అడవిలో చెట్ల

కొంతమంది కుర్రవాళ్ళు…. Laziness of Youth