మన మహిళామణులు

ఆల్ రౌండర్ సమాజసేవతో పాటు లలిత కళల్లో ఆరితేరిన శ్రీమతి బండ్లమూడి ధనలక్ష్మి…

తల్లిదండ్రులు సేనావల్లి నోరి లక్ష్మి నర్సింహమూర్తి గార్లు.ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి వీరి సంతానం.ధనలక్ష్మి రెండవ సంతానం.తండ్రి హైదరాబాద్ బిహెచ్ఇల్ రామచంద్రాపురం లో 45ఏళ్లు అర్చకులు గా పనిచేశారు.ధనలక్ష్మి 1973 లో అక్కడే పుట్టి పెరిగి ఇంటర్ దాకా చదివారు.తండ్రిశ్రీవేంకటేశ్వరయోగీశ్వరాలయంలో అర్చకులు గా ఉన్నా సంగీత సాహిత్య నాటక సినిమా లపైఅభిమానం ఆసక్తి.జడ్.పి.స్కూల్లో చదివే కూతురు ని బాగా ప్రోత్సహించారు.అలా ధనలక్ష్మి వ్యాసరచన డిబేట్ నాటకాలు డాన్స్ ఏకపాత్రాభినయం లో టీచర్ల ప్రోత్సాహం తో ఎన్నో బహుమతులు పొందారు.తండ్రికి అలనాటి ఎన్.టి.ఆర్ అంటే వీరాభిమానం.పౌరాణిక నాటకాలు సినిమాలు చూస్తూ ఈమె చేత మగవేషాలు వేయించారు.ఇంటర్ కాగానే పెళ్లి శ్రీయగ్న నారాయణ గారి తో జరగటం ఇద్దరు పిల్లలు సంసారం ఈదుతూఎం.ఎ.తెలుగు రాజనీతి శాస్త్రం ఎం.ఎ.జర్నలిజం చేయడం నిజంగా అపూర్వం.BHELలో మానసిక వికలాంగుల స్పెషల్ కేర్ పాఠశాలలో ఈమె టీచర్ గా చేరటం ఇంకో మలుపు.మానసిక శారీరక దివ్యాంగులసేవలో తరించాలని స్పెషల్ బి.ఇడి.చేశారు.నే‌నల్ కోచ్ గా క్రికెట్ బోస్సీbossee ప్రత్యేక ఆటలో శిక్షణ పొందారు.దివ్యాంగ పిల్లలు రెండు జట్లు గా అటు ఇటు 4 గురు ఉంటారు.ఒక జుట్టు ఎర్రబంతులు ఇంకో జుట్టు ఆకుపచ్చ బంతులు పట్టుకుని మధ్యలో ఉన్న తెల్ల బంతిని గురిచూసి తాకేలా కొట్టాలి.ఇది బోసీ క్రీడా ప్రత్యేకత.పిల్లలకి ఈమె తర్ఫీదు ఇచ్చారు.

స్పెషల్ పిల్లలతోభారత్ నిర్వహించే స్పెషల్ కోచింగ్ లకు క్రీడా పోటీలకు గోవా ఢిల్లీ పాండిచ్చేరి కర్ణాటక మొదలైన ప్రాంతాలకు వెళ్లటం మరపురాని అనుభవాలు.ఎన్నోమెడల్స్ పొందారు పిల్లలు.సౌత్ జోన్ కల్చరల్ దాంట్లో కర్ణాటక వెళ్లి శిక్షణ పొందారు.అలా డ్రామా డాన్స్ లో కూడా దివ్యాంగులకు శిక్షణ ఇచ్చిన ప్రతిభాశాలి.ఇక బి.హెచ్.ఇ లో స్త్రీ సంక్షేమ కేంద్రం లో ఈమె పొందిన బహుమతులకు అంతే లేదు.3సార్లు ఆల్ రౌండర్ అవార్డులు పరిషత్తు పోటీల్లో ఏకపాత్రాభినయం లో దుర్యోధనుని మయసభకి ఫస్ట్ ప్రైజ్ పొందారు.డాక్టర్ కోటయ్య గారు గురువు గా పద్యాలు డైలాగులు నేర్పి దుర్యోధనుని గా తీర్చి దిద్దారు.తన నట జీవితం గూర్చి ఇలా చెప్పారు “నా మొదటి సాంఘిక నాటకం ముగింపు లేని కథ.ఢిల్లీ ఎ.పి.భవన్ లో తొలి సారి ఉత్తమ నటి అవార్డు అందుకున్నాను.500పైగా నాటకాలు నాజీవితం లో మైలురాళ్ళు.ఈటివి స్మైల్ రాజా స్మైల్ ఫైనలిస్ట్ ని.Z కామెడీ క్లబ్ జెమినీ నవ్వులసవాల్ ఎన్నో!ఇక మేంఫేమస్ టక్ జగదీష్ మసూద్ రంగ్ధే సినిమాల్లో నటించాను.మెహిదీపట్నం సెయింట్ జాన్స్ కాలేజీ లో COCక్లాసులు తీసుకున్నాను.న్యూస్ రీడింగ్ యాంకరింగ్ లో డిగ్రీ పిల్లల కి శిక్షణ ఇచ్చాను.నటి యాంకర్ టీచర్ కోచ్ గా భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.

గీతాప్రెస్ వారు నిర్వహించిన భగవద్గీత శ్లోకాలపోటీల్లో గోల్డ్ మెడల్ పొందాను.సినారె గారి ప్రోగ్రాంలకువ్యాఖ్యాతగా పనిచేయడం నా అదృష్టం.మాబాబు తెలుగు ఎం.ఎ.చేశాడు.తిరుపతిలో స్మార్తం పూర్తి చేసి ఇక్కడే గణపతి సచ్చిదానంద ఆశ్రమం లో ఉన్న ఆలయాలలో ప్రధానార్చకుడు.అమ్మాయి ఎం.ఎస్సీ మైక్రొబయాలజీ చేసింది.కూచిపూడి డిప్లొమా చేసింది.ఇద్దరికీ పెళ్లి ఐంది.” నిజంగా ఇలాంటి మహిళా మణులు మనకు స్ఫూర్తి దాతలు కదూ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లండన్ టూర్- రాయల్ ఆల్బర్ట్ హాల్

సహనమా!! Patient of patience