నేనెవరో తెలుసా?

కవిత

యలమర్తి అనూరాధ 9247260206

ఎక్కడో నేను
ఆహ్వానించబడి వచ్చా
చీదరింపుల చివాట్ల మధ్య
బ్రతకలేక బ్రతుకీడుస్తూ
చావలేక అనుక్షణం చస్తూ
బ్రతికున్న శవంలా
కాలం వెళ్ళబుస్తూ
మృత్యువుకై నిరీక్షిస్తున్నా
వెళుతూ వెళుతూ
జాగ్రత్తపడమని హెచ్చరిస్తున్నా
నువ్వు నువ్వుగా నిలబడాలని
బానిసత్వానికి బందీ కాబోకని
మనసున్న మనిషిగా
జీవనం సాగించమని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు

దొరసాని