ఆమె ప్రేమకు విలువ లేదక్కడ
ఆమె పనికి వెలకట్టలేరెక్కడ
ఆమెకు గౌరవం ఇవ్వలేదక్కడ
ఆమెను నిలువ నివ్వలేదెక్కడ
వంటింటి సామ్రాజ్యానికి ఆవిడను మహారాణిని చేశారు
క్షణమో యుగంలా గడిపిందక్కడ
అతగాడికి ఆకలేస్తే కేకలేస్తాడు
అధికార విధ్వంసం సృష్టిస్తాడు
అతగాడి గావు కేకలకు భయపడి
బొంగరంలా తిరుగుతుంది ఇల్లంతా
అతగాడికి జీతం ఇవ్వని నిత్య పనిమనిషి ఆవిడ..
జాతీయ గృహిణిల దినోత్సవ శుభాకాంక్షలు
అభినందనలు చూసామో ఇలా…
గుర్తుకు రావాల్సిన నాలుగు మాటలు ఇవి-
అలక తెలియని ఇంటి మనిషి
అలు పెరగని నిత్య పనిమనిషి
అనుక్షణం ప్రాకులాడే ఒంటరి మనిషి
అన్నింట తానై ఉండే ఆడ మనిషి
ఆడు మనిషి ఆడ మనిషి