కమలా దేవి హారిస్ – పోరాట యోధురాలు – strong lady

తరుణి పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి పత్రిక ఎడిటర్

జీవితమంటేనే పోరాటం. సంక్లిష్టతలూ పెనవేసుకున్న బ్రతుకు బంధం. ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఏ సంఘర్షణలను ఎదుర్కోకుండా విజయాలను సాధించలేరు.
కష్టనష్టాలను చిటికెన వేలుతో తీసేస్తూ సాధించిన విజయం గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ఈ సమాజంలో ఉన్న వివక్షలు కొన్ని వర్గాల వాళ్ళు కొన్ని జాతుల వాళ్ళని ఎట్లా అణిచివేస్తుందో తెలిసిన ప్రపంచం ఇది. తనదైన గొంతుకతో తనదైన స్థానంతో నిలిచి గెలిచిన కమలాహారిస్ తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్నది.
కావచ్చు, మొన్న అమెరికా ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే విజయం ట్రంప్ పక్షాన ఉంది కావచ్చు! కానీ, దాదాపు 15 రాష్ట్రాల్లో తన దైన విజయాన్నైతే చూపించారు కమలాహారిస్ .
అప్పుడు 2019 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్ సందోహంలో జాతీయ దృష్టిని ఆకర్షించిన కమలాహారిస్
2020లో డెమొక్రటిక్ ప్రెసిడెంట్ గా నామినేషన్ కోసం పోటీపడేలా అందరి హృదయాన్ని గెలుచుకున్నారు. జో బైడెన్ తో పాటు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఒక మహిళ నిలబడే స్థాయికి ఎదిగారు.
సాన్ ఫ్రాన్సిస్కో లో డిస్ట్రిక్ట్ లాయర్ గా ఎన్నికైనప్పుడు ఇది 2003లో కౌంటి డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో తన జెండా ఎగురవేసిన ఆనాటి నుండి ఆ తర్వాత వచ్చిన 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఎన్నికైనప్పటినుండి కమలహారిస్ అంటే నిబద్ధత కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 2014లో కూడా అటార్నీ జనరల్ గా గెలుపును సాధించుకోవడం అనేది మామూలు మాటలు కాదు.
2016 లోనూ ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆఫ్రికన్ అమెరికన్ మహిళ గా యునైటెడ్ స్టేట్స్ సెనెట్ లో అడుగు పెట్టగలగడం అనేది ఎంతో గొప్ప విషయం. పురుషాధిక్య ప్రపంచం లో స్త్రీ నిలవడం …గెలవడం …గెలిచి నిలవడం …అనేవి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన విషయం.
ఆనాడు రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ పరిపాలనను సునిశితంగా పరిశీలించి సెనెట్ విచారణ సందర్భంలో సూటిగా ప్రశ్నలను సంధించినందుకు కమలహారిస్ కి నేషనల్ ప్రొఫైల్ అనేది సాధించుకున్నారు. అయితే,పౌరులు ఎక్కడైనా తెలివిగా ఆలోచిస్తారు. ఏది న్యాయం ఏది అన్యాయం ? ఎక్కడ ఎవరిని ఎలా నమ్మాలి ? అనేది ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. గంజాయి వాడకమూ,వ్యాపారం వంటి విషయాల పైన ఫెడరల్ డి షెడ్యూలింగ్ చేయడం విషయం పైన కానీ …వలసదారులకు పౌరసత్వ మార్గం ఏర్పాటు చేయడంలో గాని …అమెరికన్ ప్రజల ఆరోగ్య సంరక్షణ సంస్కరణ విషయాలనే కానీ నిశితంగా పరిశీలించి , చక్కని వివరణాత్మకమైన ప్రశ్నలను సంధించిన వారిచ్చిన జవాబులను మరి మరి తవ్వి న్యాయాన్ని విచక్షణతో మాట్లాడిన విధానం ఏదయితే ఉందో అది ఆమెకు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బలాన్ని ఇచ్చింది. గొప్ప రాజకీయవేత్తగా మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న కమలహారిస్
మహిళా గొంతుకకు ఒక ఎజెండాగా మారిపోయారు. అందరూ యువతులకు ఆదర్శంగా నిలిచారు. గెలుపు ఓటములు సహజం ! ఎంతవరకు ప్రజల పక్షాన నిలబడ్డారు అన్నదే ముఖ్యం.
1964 అక్టోబర్ 20న జన్మించిన కమలాదేవి హరిస్ పుట్టుక మూలాలు భారతదేశానికి సంబంధించినవి అని చెప్పుకోవడం కూడా గర్వకారణమే. కమల తల్లి శ్యామల గోపాలన్. ఈ పేరులోనే భారతీయత స్పష్టంగా కనిపిస్తుంది.
తల్లి నుంచి సంక్రమించిన విలువలు, తనదైన మంచితనం, ఆలోచన, ఆచరణ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ పోటీ లో నిలబడే ఆత్మ స్థైర్యం ఇచ్చినవి.

కమలాహారిస్ రాజకీయ వేత్తగా ఎదిగిన మహిళ! రాజకీయాల్లో పుట్టిపెరిగలేదు. దీనివలన సమాజ పరిశీలన ను పెంచుకున్నరని చెప్పకతప్పదు.

నిత్యావసర ధరల పెరుగుదల, ధర ల పరుగులు, చాలామంది అమెరికన్ కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారి పోవడానికి, వలసల ధాటి ఎక్కువైపోవడం వంటి కొన్ని మౌలికమైన సమస్యలపై మాట్లాడినప్పుడు బీబీసీ లో జరిగిన చర్చల్లో కమలహారిస్ సంపూర్ణమైన సమాధానాలు ఇవ్వలేకపోయారు.బైడెన్ పైన ఉన్న కొంత వ్యతిరేకతను ఓటర్లు ప్రయోగించారా? ఈ కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది
మహిళల సాధికారత విషయంపై న్యాయస్థానంలో ఎన్నో రకాల చర్చలు జరిగిన ఆ సందర్భాలను ఒకసారి తలుచుకుంటే .. అబార్షన్ అనేది మహిళల చట్టబద్ధత హక్కు కాదు అని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అంతటి ఒక తీర్పు వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి సంతానోత్పత్తి అనే విషయంలో హక్కును గురించి కమలహారిస్ తీవ్రమైన పోరాటాలను చేశారు. దాదాపు 54 శాతం మహిళల ఓట్లను సాధించుకున్నారు కమల హారిస్.
Vice President of United States గా కమలా హారిస్ ప్రజల మనసును చూరగొన్న నాయకురాలు. ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అంటే పర్యావరణ న్యాయ పరిరక్షణ లో అందరికన్నా ఓ ముందు చూపుతో పయనించారు కమలహరిస్! ఇది ఆమె తల్లిదండ్రుల నుండి సంతరించుకున్న మంచి గుణం .సివిల్ రైట్స్ మూవ్మెంట్ పాల్గొన్న ఆమె తల్లిదండ్రులు చిన్ననాటి నుండి కమల హారిస్ ను క్రమశిక్షణతోను సామాన్య పౌరుల దేశ రక్షణ విధానం ఎలా ఉంటుందో చెప్పడంలోనూ పేదల పట్ల కరుణ జాలి వంటి వి నేర్పడం చేశారు. ” Kamala you may be the first to do many things,but make sure you are not the last” అని మా అమ్మ అన్నారు అని కమలహారిస్ ఓ సందర్భంలో చెప్పడం చూస్తే ….చిన్ననాటి నుంచి చదువులో పట్టుదలగా మంచి మార్కులు సాధిస్తూ వచ్చిన కమలహారిస్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు అంతేకాదు California Hastings college of law లో చదువును పూర్తి చేసుకోవడం ఆమె ఆలోచన సరళికి విశ్వవిద్యాలయం లోనే బంగారు బాటలు పడ్డాయి.
2014లో Douglas Emphoff అనే లాయర్ ని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని కన్నారు. Ella, Cole కమలహరిస్ పిల్లల పేర్లు.
తల్లిగా ,ఇల్లాలుగా ,కూతురుగా , లాయర్ గా ,నాయకురాలుగా కమలా హారిస్ ఎదిగిన క్రమం జీవిస్తున్న విధానం ఎంతోమందికి ప్రేరణగా ఉంటుంది.
‘A Career Prosecutor’s Plan to Make Us Safer – “Smart On Crime ” కమల హారిస్ రాసిన పుస్తకం 2009 లో క్రానికల్ బుక్స్ ద్వారా మొదటిసారి ప్రచురింపబడింది. రచయిత్రి గా తమన్నాను భావాలకు అలా రూపమిచ్చారు .

అమెరికాలో విద్యార్థులు సమ్మర్ వెకేషన్ టైం లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. 1986లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అందుకున్న కమల హరిస్ కూడా చదువుకుంటున్నప్పుడు సమ్మర్ జాబ్ చేశారు. కమలాహరిస్ తల్లి డాక్టర్ శ్యామల గోపాల్ హరిస్ ఉద్యోగం చేసే హాస్పిటల్ కు వెళ్తూ అన్ని వివరించేవారుట. దీనితో నిజజీవితంలో సాంఘిక హింసాత్మక త ఎలా ఉంటుందో నిశితంగా పరిశీలించారు.
డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికైన తర్వాత , డొమెస్టిక్ వైలెన్స్ పైన గన్ వయోలెన్స్ పైన చర్యలు తీసుకునేలా కృషి చేశారు కమలహరిస్.
యునైటెడ్ స్టేట్స్ సినేటర్ గా చైల్డ్ కేర్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ కేర్ వంటి కొత్త కార్యక్రమాలను తీసుకొని ఎంతో మందికి మంచి జీవితాన్ని అందించేందుకు ప్రయత్నించారు. సెనేట్ సెలెక్ట్ కమిటీ లో ఇంటిలిజెంట్స్ విభాగాన్ని వర్కింగ్ నేషనల్ సెక్యూరిటీ విధానాన్ని కూడా నిర్వహించారు. గన్ వాయిలెన్స్ ప్రివెన్షన్ అనే విషయం పైన అద్భుతమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు.
ఇలా కమలహారిస్ గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి .పట్టుదల శ్రమ తత్వము ఉన్నప్పుడే తెలివికి పదును పెట్టినట్టు అవుతుంది .ఇది ఒక సగటు కుటుంబం నుంచి ఎదిగిన కమలహారిస్ జీవితం ద్వారా నేర్చుకోవచ్చు. చదువు సంస్కారాన్ని ఇవ్వాలి, సంస్కారం సమాజ సేవను చేసేలా .. తద్వారా ప్రశంసలు అందుకునేలా చేయగలగాలి . అప్పుడే చరిత్రలో నీకు ఒక పేజీ మిగులుతుంది ! ఇది కమలహరిస్ జీవితం చెప్తుంది. ఒక ఓటమి చవిచూసినంతమాత్రాన ప్రయాణం ఆగదు . కమలహారిస్ ఉజ్వల భవిష్యత్తుతో ప్రపంచ స్త్రీల పక్షాన ఎలుగెత్తే అద్వితీయ తేజవంతురాలవుతుంది అని ఆశిద్దాం. ద స్ట్రాంగ్ లేడీ కమలా దేవి హారిస్ ఒక పోరాట యోధురాలు అని ప్రపంచమంతా ఆమె వైపే చూస్తున్నది.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విధి నిర్వహణలో నా అనుభవాలు-3

ఎల్లమ్మ జాతర