భక్తుడికి దేవుడి పై నమ్మకం,
కష్టకాలమందు తోడుగ ఉంటాడని….
భార్యకి భర్త పై నమ్మకం,
జీవితాంతం తోడునీడగా ఉంటాడని….
తల్లిదండ్రులకు పిల్లల పై నమ్మకం,
జీవితంలో వారి కాళ్ళ పై వారు నిలబడుతారాని….
ఉపాధ్యాయులకు విద్యార్థుల పై నమ్మకం,
జీవితంలో ఎదో ఒకటి సాదిస్తారాని….
కవికి కలం పై నమ్మకం,
తాన ఆలోచనలను ఎంతో అందంగా సృష్టిస్తుందని….
రోగికి వైద్యుడి పై నమ్మకం,
తాన రోగన్ని నయం చేస్తాడని….
ప్రజలకి నాయకుల పై నమ్మకం,
తామకి న్యాయం చేస్తారని….
విద్యార్థులకి చదువుల తల్లి పై నమ్మకం,
తాను ఇచ్చే జ్ఞానంతో జీవితంలో ఎదుగవచ్చని….
ఆకుకి వెలుతురు పైన, చెట్టుకి మన్ను పైన, మన్నుకి నీరు పైన,
ఇలా భూమిలోతునుండి భూగోళంపై ఉన్న ప్రతి అణువు మరోక అణువుతో ….
నమ్మకం అనే బంధన్ని ఏర్పడుచుకోని జీవితన్ని కొనసాగిస్తున్నాయి……