ఇది నడుస్తున్న చరిత్ర. ప్రతి క్షణం ప్రతి సంఘటన కొత్త తరాలకు తన స్థానం ఏమిటి తెలుసుకుంటూ తన శక్తి యుక్తి తరచి చూసుకోవాలి. అదిగో అలాంటప్పుడే గొప్ప వాళ్ళ జీవితాలు వేలు పట్టుకొని నడిపిస్తాయి!
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు ఇందిరాగాంధి. భారతదేశ పూర్వ ప్రధాని. అపూర్వ మహిళా మణి. పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని. అద్వితీయమైన మేధాసంపత్తితో, అనిర్వచనీయమైన ధైర్య సాహసాలతో భారతదేశానికి మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా సేవలందించిన త్యాగమూర్తి.అని సరిపెట్టుకుందామా? కుట్రలకు కుతంత్రాలకు బలైన నాయకురాలు అందామా? ఆమె అద్వితీయమైన మేధాసంపత్తిని దేశం ఉపయోగించుకున్నది ఆమె నిర్వచనం ఏమైన ధైర్య సాహసాలను దేశం ఉపయోగించుకున్నది .
ఏ దేశ ప్రధాని అయినా ఎవరైనా ఇలాగే చేస్తారు కదా అని సరిపుచ్చుకోవచ్చు. అని ఆమె పాలించిన సమయంలో అప్పుడప్పుడే విజ్ఞాన వికాసాలను ఒడిసి పట్టుకొని అంతగా ఈ తెలివితేటలు లేని దేశ ప్రజలకు మంచి పాలన అందించాలని ఎంతో కృషి చేసింది. దురాక్రమణలు జరగకుండా యుద్ధం రాకుండా వచ్చిన యుద్ధాన్ని తనదైన గుడ్ స్టెప్స్ తో ఎదుర్కొని దేశాన్ని కాపాడింది. పొరుగు దేశాల ఆక్రమణ లు జరగకుండా అడ్డుకున్న రాజకీయ చాతుర్యం ఆమెది.
రాజనీతిజ్ఞత అనేది స్త్రీలకైనా పురుషులకైనా సమసంపత్తితో ఉంటుందని చెప్పడానికి రుజువు ఇందిరాగాంధీ. కుటుంబ నేపథ్యం కొంత ప్రభావం చూపి ఉండవచ్చు కానీ బాగా చదువుకున్న వ్యక్తిగా పరిశీలన అనుభవం ఎక్కువగా ఉన్న వ్యక్తిగా తనదైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న నేత . తండ్రి జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా ఉన్న ధైర్యాన్ని పక్కతోవ పట్టనివ్వలేదు. గర్వము నిర్లక్ష్య భావం అలవర్చుకుని పక్కకు తొలగలేదు. చెడు దారిలో వెళ్లలేదు.నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు రాసిన ఉత్తరాలను ప్రధమ పాఠంగా స్వీకరించింది అంత ఓపిక శ్రద్ధ నమ్మకం పెట్టడం అనేదానికి సాధ్యమయ్యే పని కాదు. Political analyzation అలవర్చుకోవడానికి దేశ చరిత్రను విదేశీయుల చరిత్రను కూడా చదివింది.
ఇంటర్నేషనల్ ఫేమస్ ఫార్ములా అంటే దేశానికి అనుగుణంగా 20 సూత్రాల పథకాన్ని అమలు చేసిన రాజనీతిజ్ఞురాలు . 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని సాధించడానికి కీలక పాత్ర పోషించిన ఇండోపాక్ వార్ విషయంలో ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిన నాయకురాలు. గరీబీ హటావో నినాదాన్ని తీసుకువచ్చి పేదల పక్షాన నిలుచున్న స్త్రీ శక్తి. దేశం ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులను జాతీయీకరణం అంటే nationalization of banks అనేది తీసుకువచ్చి తాము నిర్ణయం తీసుకున్న eradication of poverty కార్యక్రమాన్ని సాధించడానికి ఆమె చేసిన కృషి ఎంతో విలువైనది. ఆర్థిక అసమానతలు తగ్గాలని సంస్కరణలను తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కొత్త కార్యక్రమాన్ని చేపట్టిన విదుషి.
రైతుల పట్ల సానుభూతితో సంక్షేమ కార్యక్రమాలను తీసుకున్న మహిళల సాధికారత కోసం ప్రోత్సాహపరిచిన ఇందిరా గాంధీ అంటేనే ఒక శక్తి ఒక యుక్తి.
1975- 77 ఎమర్జెన్సీ కాలం మరిచిపోతారా ఎవరైనా? ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకొని వివాదాలలో తలదూర్చడం కూడా ఇందిరా గాంధీకి ఎదురైన చేదు అనుభవాలు. కానీ అవి ఎప్పటి రాజకీయ పరిస్థితులు అలా ఉండేవి.
ఆపరేషన్ బ్లూ స్టార్ అనే అతిపెద్ద కీలకమైన చర్య ఇందిరా గాంధీ జీవితంలో పెద్ద మలుపు. 1984 లో ఒక వారం రోజులు సైనిక చర్యకు అనుమతి ఇచ్చి స్వర్ణ మందిరం అంటే Golden Temple అటాక్ లో చాలామంది పౌరులు చనిపోయారు అట్లాగే సిక్కులు చనిపోయారు. సిక్కులు నిర్వహించిన ఖలిస్తాన్ మూమెంట్, ఏర్పాటు వాదాన్ని అణగదొక్కడానికి తీసుకున్న నిర్ణయం అది. ఇదే ఆమెకి ప్రాణాంతకం అయింది. ఆమె ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న సిక్కులను ఉద్యోగంలో నుంచి తీసివేయడం మంచిదేమో అని కార్యదర్శులు సలహా ఇచ్చినా కూడా ,వ్యక్తులు కాదు సంస్థల వల్ల చిక్కులు వస్తాయి అని నమ్మి ఆమె దగ్గర ఉన్న సిబ్బంది మంచి వాళ్లే అని భ్రమించి వాళ్లను తొలగించలేదు. ఈ ఆపరేషన్ విజయవంతమే విజయవంతమైంది కానీ సిక్కుల తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. శాంతి భద్రతలు నియంత్రించడం రాజకీయ నాయకులకు ఎంత కష్టమైన పనో దేశంలోనే ఈ అంశం ఉదాహరణగా నిలిచిపోయింది.
భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి , అంతేకాదు ఏకైక మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధి. 1984 అక్టోబర్ 31 నాడు ఢిల్లీలో హత్య కావించబడిన ఇందిరా గాంధీ జీవితం ఎన్నో కష్టసుఖాల జీవిత గాధ.
భారతదేశ ప్రధాని కాకముందు 1964లో ఇందిరాగాంధీ Minister of information and broadcasting పదవిని చేపట్టారు. అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ చనిపోవడం తో దేశంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్ లో ఇందిరాగాంధీకి ఈ పదవిని చేపట్టారు. విదేశాలలోపర్యటించిన అనుభవాలను మన దేశానికి అనుగుణంగా మలిచి ఏ విధంగా ఉపయోగిస్తే సమాజానికి శ్రేయస్సు ను ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ ఇప్పటికీ మార్గదర్శకురాలు.
Indian national Congress కు నాయకత్వం వహించిన ఇందిరా గాంధీ ఆనాడు స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొన్న అనుభవాన్ని రంగరించి పాలన చేశారు. ఇప్పుడు 1930 లోనే భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అనుభవాలు ఇందిరా గాంధివి. చిన్నతనంలోనే బాల్ చరక సంఘం స్థాపించిన, వానరసేనను ఏర్పాటు చేసిన జైలుకు వెళ్లి శిక్షణ అనుభవించిన అడుగడుగునా ఆమె దేశభక్తి తారసపడుతుంది. పెళ్లి పిల్లలు ఇల్లు ఇంటి యాజమాన్యం దృష్టి పెడుతూనే, తండ్రి పెట్టిన బాధ్యతను నిర్వర్తిస్తూనే దేశ పరిపాలన బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. కూతురుగా,ఇల్లాలిగా,తల్లిగా, నాయకురాలిగా, దేశ ప్రధానమంత్రిగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్ ద్వారా పేదలకు వైద్య సౌకర్యాన్ని అందించిన ఇందిరాగాంధీ ఎన్నో ట్రస్టులతో ఎన్నో సంస్థలతో సంబంధం కలిగి, వాటితో అనుబంధంగా మార్చుకున్నారు.
ఇటువంటి వాళ్ళ జీవిత చరిత్రను చదివితే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ప్రసిద్ధిగాంచిన భారతరత్న పురస్కారాన్ని 1972లో స్వీకరించారు.
దేశ పాలన రాజకీయాలే కాదు ఇందిరాగాంధీ వారిలో మంచి రచయిత్రి కూడా దాగి ఉన్నారు. Years of challenge – 1966-69 అనే రచన రాజకీయ నాయకురాలిగా స్థితప్రజ్ఞతను ప్రదర్శించిన నేతగా ఇందిరా గాంధీ తన అనుభవాలను ప్రోది చేశారు. ఇందిరాగాంధీ ఏ దేశానికి వెళ్లిన ఆదేశ డెలిగేట్స్ ఆమెనితో గౌరవించేవాళ్ళు, యుఎన్ఓ ప్రధాన కార్యాలయం సందర్శించినప్పుడు కానీ అమెరికన్ హాస్యం దేశాల్లో తిరిగినప్పుడే కానీ రష్యా, వెనిజులా , స్వీడన్, స్విజర్లాండ్, సింగపూర్ ,న్యూజిలాండ్, కెన్యా ఇలా తిరిగిన ఏ దేశమైనా గౌరవించినవి. అభిమానించేవాళ్ళు. ఆమె రూపే ఆమెకు పెట్టని ఆభరణం.చక్కని వాగ్దాటి చక్కని గళం ఆమెకు అదనపు ఆభరణాలు. చదివిన చదువును సార్ధకత చేసుకోవడం లో సిద్ధహస్తురాలు. ఇంగ్లీషులో కానీ హిందీలో కానీ ఇందిరా గాంధీ ఉపన్యాసం ఇచ్చింది అంటే ఆ భాష ఆ భావ ధార ఎంతో ఆకట్టుకునేవి. 1917 నవంబర్ 19 న జన్మించారు. ఆమెకు మరణం లేదు.