Without efforts we can’t get success. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏ పనిలోనైనా మనదైనటువంటి కృషి ఉంటే తప్పకుండా సాధిస్తాం. నది ఎప్పుడు ముందుకే నడిచినట్టు మనము నడవాలి నడుస్తూనే ఉండాలి. నదులు సాగరంలో కలుస్తాయి అంటారు మనం కూడా సాధన అనే సాగరంలో కలవాలి. మనం అంటే ఇక్కడ స్త్రీలైనా పురుషులైనా. కానీ ఈరోజు ప్రత్యేకంగా పోరాడితే పోయేదేముంది అనే శీర్షికలో ఉన్న భావం కేవలం …కేవలం… స్త్రీల కొరకే ! సమస్య అందరిదైనా పోరాటం స్త్రీల పరంగా చేస్తే ఎలా ఉంటుందో చర్చించుకోవడం అన్నమాట.
“న స్త్రీ స్వాతంత్ర్య మర్హసి” అని చెప్పిన నోళ్ళే “మాతృదేవోభవ” అని కూడా చెప్పాయి. కాబట్టి వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోక స్వాతంత్ర్యానికి సరైన అర్థం మనమే చెప్పుకుంటూ దైవ శక్తి కలిగినటువంటి శక్తి ఉన్న స్త్రీలను అని మనకు మనమే చెప్పుకుంటూ ముందడుగు వేయడమే ప్రధానం. ఏ ఇంటికైనా మూల స్తంభం వంటి వాళ్ళు ఆ ఇంటి స్త్రీలేనని అందరికీ తెలుసు అయినా నిర్వచనాలతో ఇస్తుంటారు ప్రవచనాలలో చెప్తుంటారు ఉపన్యాసాలు దంచేస్తుంటారు కానీ అసలు గుర్తించాల్సిన చోట గుర్తించరు. వాళ్లు గుర్తిస్తే ఎంత గుర్తించకుంటే ఎంత ? ఆత్మ న్యూనత ను వదిలేసి, ఆదిత్యాన్ని ప్రదర్శించాలి. ఎక్కడ ప్రదర్శించాలి ఎట్లా ప్రదర్శించాలి ఇవే ముఖ్యమైన విషయాలు.
పాక్షికంగా ఆర్థిక స్థితిగతుల ను బట్టి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని ఆయా స్థాయిలలో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చూస్తే ఏంటి గాని…. ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా, అత్తగా, మేనత్తగా, భార్యగా, వదినగా, చిన్నమ్మగా, పెద్దమ్మగా ఇంటి వావి వరుసలలో వాడి యైన… వాది ఎవరంటే…. స్త్రీ లే! అయినా కూడా ఇంత స్థానం తనకున్న కూడా… కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు స్త్రీలు. ఇది ముఖ్యంగా వ్యసనలోలులైన కొడుకును, భర్తను, అన్నను, తమ్ముడిని, మామను ఇలా వావివర్సలలో వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తారు ఇది నా కర్మ అనుకుంటూ ఉంటారు లేదా వాడి కర్మ ఏం చేస్తాం అనికుంటూ ఉంటారు.కానీ ఇది కాదు మనం చేయాల్సింది ఏవో ప్రభుత్వాలు వచ్చి … కొత్త ఆలోచనలతో ముందుకొచ్చి.,. మద్యపాన సమస్యను తొలగిస్తారు అనుకోవడం పెద్ద భ్రమ.
ఈ ఆధునిక కాలంలో standard of living అంటే జీవిత పరిణామం మారింది. Material conditions అంటే భౌతిక పరిస్థితులు మారిపోయాయి. Labor power, labor time రెండింటి విలువ తెలిసిన వాళ్ళం అంటే శ్రమశక్తి, శ్రమ కాలం ఈ రెండు మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైన వో తెలిసిన వాళ్ళంగా స్త్రీలము మహిళలము, ఆడవాళ్ళము అందరం ఒక ప్రతినబూనాలి. అదేంటంటే….
ఇతర ఆడవాళ్లను గురించి చులకనగా మాట్లాడినప్పుడు వెంటనే ఖండించడం. నా ఖండించగలగడానికి ముందు మనంగా మనం ఆడవాళ్ళను, తోటి స్త్రీలను చులకన చేసి మాట్లాడకుండ ఉండాలి.
తోటి ఆడవాళ్ళని గురించే కాదు ఎవరిని గురించైనా చులకన చేసి మాట్లాడితే అదే తిరిగి మనకు వర్తిస్తుంది కాబట్టి మొట్టమొదటి ప్రతిన, ఫస్ట్ స్టెప్ అంటారే అది పాటించాలి. తర్వాత కొడుకును సమర్థిస్తూ ఉండడం మానుకోవాలి. వాడంత ఉద్యోగం చేసి కష్టపడి వస్తాడు వ్యాపారంలో వాడికి ఎన్ని కష్టనష్టాలు ఉంటాయి ఏదోలే అని మనకు అని అడ్డుపడుతూ ఉంటుంటారు తల్లులుగా ఆడవాళ్లు. ఏమనకు ఉందా ఉండడం అంటే ఎప్పుడు మొదట్లో రిలాక్సేషన్ కోసం తీసుకునే మద్యం క్రమంగా ఎక్కువవుతుంది ఎక్కువైన తర్వాత పట్టలేక పోతారు ఆ తాగుడుకు బానిస అయినా కొడుకును ఎలా ఖండించాలో తెలియక ఈ కోపాన్నంత కోడలు మీద పిల్లల మీద చూపిస్తుంటారు అత్తలుగా తల్లులుగా ఆడవాళ్లు ఇవి మనం చేయడం మానేయాలి మనలాగే ఇంకొకళ్ళు చేస్తుంటే అడ్డుకోవాలి అనే జ్ఞానం ఆడవాళ్ళందరూ తెచ్చుకోవాలి. తాగి వస్తే భర్తను కొడుకును మాన్పించే ప్రయత్నం గట్టిగా చేయాలి నిరసన తెలిపాలి అవసరం వస్తే పోలీసులు అని కూడా ఆశ్రయించాలి.
సినిమాలు అశ్లీలంగా వస్తున్నాయి ఒక్కళ్ళు కూడా గొంతు విప్పరు.
ఇంట్లో, నలుగురిలో, బంధువుల్లో, పెళ్ళిళ్ళ లో , సభలలో ఎక్కడ ఎక్కడ వీలైతే అక్కడ ఈ రెండు విషయాలపై ఖండించాలి. అవమాన భారంతో కుంగి పోవాలి అవతలివారు.
ఎందుకింత దిగజారి పోతున్నది ఈ సమాజం. స్తబ్దత! ఎక్కడ చూసినా స్తబ్దత! ఎందుకు? గొంతు విప్పాలి పిండికి ఎత్తాలి! బుద్భుద ప్రాయమైన ఈ జీవితం ఇంకేమి చేసేదుంది?
తాగి తాగి ఒళ్ళు ఇల్లు హూనమైపోతున్నా మద్యం తాగుతునే ఉంటారు . విచిత్రం ఏమిటంటే ఈ మధ్య అమ్మాయిలు కూడా తాగుతున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు. ఇదెంత ఘోరం!
ఆదిమ కాలం లో అందరూ తాగేవాళ్ళు ఇప్పుడు తాగితే ఏం తప్పు అనే ధోరణి లో ఉన్నారు. కానీ , అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. కల్తి లో మన జీవనం అయ్యింది.
ఓ వైపు అన్నం తగ్గించి, స్వీట్లు తినకుండా జాగ్రత్తగా ఉంటున్న యువతరాన్ని చూస్తున్నాం. మరోవైపు విచ్చలవిడి గా మత్తు పదార్థాలు తీసుకోవడం చూస్తున్నాం. ఇంత విచిత్రం ఏంటో?
కవితలు పాటలు కథలు రావాలి ఈ చెడువాట్లను ఖండిస్తూ!
ఆరోగ్యం దెబ్బతింటుందని అర్థం చేయించాలి. తల్లి కోడి పిల్లలను తన రెక్కల క్రింద దాచి పైన తిరిగుతూ పసిగడ్తున్న డేగ కు చిక్కకుండా కాపాడుతున్నట్టు ఈ పిచ్చి ని పోగొట్టాలి.
ఇది ప్రచారయుగం అంటే Age of publicity period ! ఎన్ని క్షీణ యుగాలు దఆటఆమఓ!
మనిషి శక్తి కి మించిన వ్యామోహం ఎక్కువైంది. చీడ పట్టిన కొమ్మను నరికెయాలి.నవ్విపోదురుగాక. నాకేటి సిగ్గంటూ విచ్చలవిడి గా ఉంటున్నారు .
ఇవన్నీ సినిమా తెరమీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ అనో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనో చిన్న గా క్రింద ఆ సీన్ లు వచ్చినప్పుడు వేస్తారే అలా అయిపోవద్దు . ఉద్యమాలు చేయడం మనకేం కొత్త కాదు. అహింసా మార్గంలో స్వాతంత్ర్యం తెచ్చుకున్న దేశ చరిత్రమనది. అయినా యుద్ధం చేయడం మాకు కొత్తకాదనే నినదిస్తూ ఇంటి నుండే ప్రారంభం చేద్దాం! విశ్వ వేదికలమౌదాం.
పోరాడితే పోయేది ఏముంది? నిజంగా మనమే సానుకూలం మనమే సేనాధిపతులం మనమే యుద్ధ వీరశిఖామణులం!