పెళ్లి కాకముందు కస్సుబుస్సు కుప్పిగంతుల అన్న
వదినె వచ్చాక ఆరిన చిచ్చు బుడ్డి
కొత్తల్లో వదినె చిరునవ్వుల పూల మతాబు
నేడు చిటపటలాడే సీమటపాకాయ చిందులు
ఆనాడు మాతాత ఎగిరే తారా జువ్వ
నేడు అవ్వలేక చల్లారిన అగ్గిపుల్ల
చిలోపొలో కబుర్లు నవ్వులతో
కాకరపువ్వొత్తు భూచక్రాలుగా వెలిగి తిరిగిన అమ్మా నాన్నలు
బాధ్యతల బరువుతో తిరగని విష్ణు చక్రాలు
ఆటంబాంబు లాగా ధుమధుమ బావ
నేలటపాకాయలా ఢమాఢం అక్క
పాము బిళ్ళలు తుపాకీ పిల్లలకి
మండీలో ఉల్లి పాయలు కూరలన్నీ రాకెట్లు
పులిహోర పెరుగన్నం చాలు బేటీ
చుక్కల్తో అన్ని భేటీ
అమ్మమ్మ సలహాలు
స్వీట్ హాట్ లేవా?”
భర్త నసుగుడు _చిర్రెత్తిన అమ్మమ్మ చివాలున లేచింది
దడదడ జడివాన జోరు లో
దీపావళి ప్రమిదలు ఇంట్లో వెలిగించి కరెంట్ పోతే
అందరం గప్ చిప్
అందరికీ చేతుల్లో చిప్స్ పాకెట్స్ _చూయింగ్ గమ్ తో
నిశబ్దం _ఉరుముల గర్జన తో
మా నోళ్లు బంద్