దీపావళి నోములు

దీపావళి సందర్భంగా

స్త్రీలు మాత్రమే ఆచరించే ఒకానొక ఆధ్యాత్మిక ప్రక్రియ నోములుతమ సౌభాగ్యం దాంపత్యం సంతానంమొదలైనవి సక్రమంగా ఉండాలనేఆకాంక్షతో ఆచరించేవి కొన్ని తోడబుట్టిన ,పుట్టింటి వారు క్షేమంగా ఉండాలనేఆకాంక్షతో ఆచరించేవి కొన్ని వున్నాయి.
నోముల్లో కన్నే వయసులో ఆచరించేవి , వివాహం అయ్యాక ఆచరించేవి అని రెండు రకాలు తప్పక ఆచరించవలసిన నోములు.ఆసక్తిగా ఆచరించేవి అని మళ్లీ రెండు రకాలు అట్లతద్ది’శ్రావణ మంగళవారం ‘కార్తీక పౌర్ణమి లాంటివి తప్పక ఆచరించవలసిన నోములు.


నోముల్లో సాధారణంగా స్త్రీ దేవతలైన పార్వతిని లక్ష్మీని ఎక్కువగా ఆరాధిస్తారు.వారితో పాటు చంద్రుడు ‘విష్ణువు ‘చిత్రగుప్తుడు దేవతలను పూజిస్తారు.బాలికలుతులసి మొక్కను పూజిస్తారు.నియమిత కాలపరిమితిలో ఆచరించడం పూర్తయ్యాక తప్పనిసరిగా చేయవలసిన ప్రక్రియ ఉద్యాపన.నోములుపట్టడం మాత్రం శివరాత్రి రథసప్తమి రెండు రోజుల్లోనే చేయాలని నియమం వుంది.ఉపవాసా ది నియమాలతోనూ పుణ్య సాధన కోసం చేసే కార్యం వ్రతం కష్టాలు’బాధలుగట్టెకించమనేతలంపుతో వ్రతాలు చేస్తూ ఉంటారు ఇవి నిత్య ‘నైమిత్తిక ‘కామ్య ‘ అని మూడు రకాలు
దీపావళి దేశమంతా ఒకే సంస్కృతి కొన్నిచోట్ల మూడు రోజులు పండుగగా మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పర్వంగా నిర్వహిస్తారు.దీపావళి ముందు రోజు నరక చతుర్దశిసత్యభామ సహితుడైన శ్రీకృష్ణుడు నరకాసురుణ్నిసంహరించిన రోజుఆశ్వయుజచతుర్దశి అమావాస్య కార్తీక శుక్ల పాడ్యమిఈ మూడు రోజులుప్రభాతంలో అభ్యంగన స్నానంప్రదోషంలో సూర్యాస్తమయం కాగానే దీపాల అమరికముఖ్య ప్రక్రియలుగా ధర్మశాస్త్రాలుచెబుతున్నాయి.బలి చక్రవర్తి త్యాగానికి గాను నారాయణుడు ఈ దినాలలో ఆ చక్రవర్తికిప్రాధాన్యం ఇచ్చారు నరకాసుర సంహారం జరిగినఆనందానికి గుర్తు దీపావళి.
దీపావళి ప్రదోషంలో చక్కగా పరిశుభ్రమైన రంగవల్లులతో అలంకరించిన గృహ ప్రాంగణంలో వాకిట్లోదేవాలయాల్లో ఉద్యానవనాల్లోగోశాలల్లో తులసి వద్దదీపాలు అలంకరిస్తారు.
సాయంకాలం కాగానేదీపలక్ష్మిని ‘ధనలక్ష్మిని ‘కుబేరున్ని షోడశోపచారాలతో్పూజించడం ఆనవాయితి. యక్షులకురాజు ఉత్తర దిక్కుకుపాలకుడు అయినకుబేరుడు ఈశ్వరానుగ్రహం వల్ల లక్ష్మి కటాక్షం వల్ల ధనా ధ్యక్షుడిగానియమితుడయ్యాడు.అష్టసిద్ధులు ‘నవ నిధులు అతడి ఆధీనంలో ఉంటాయి.లక్ష్మీ ప్రాధాన్యమున్న ఈ రోజును కుబేరున్ని కూడపూజిస్తారు. రాజాధిరాజు వైశ్రవణుడు అనేవి వేదాల్లోను కుబేరుడికి సంబందించిన ప్రసిద్ది నామాలు దక్షిణ దిక్పాలకుడైనయముడికి ఉత్తర దిక్పాలకుడైన కుభేరుడికిప్రాధాన్యం ఉన్న పర్వమిది.ఈ పర్వంలో లక్ష్మీ ప్రాప్తికి దీపాలు వెలిగించడం ఆ లక్ష్మి పరిహారానికి టపాసులతో చప్పుల్లు చేయడం పరంపరగా వస్తున్న పద్ధతి. ఈ రోజు ఆనందంగా వుంటేసంవత్సరం అంతా సంతోషమే అవుతుంది.
దారిద్ర్యం దైన్యంఅజ్ఞానం వీటికి సంకేతంచీకటి ఐశ్వర్యం ఆనందం జ్ఞాన జ్యోతి స్వరూపాలు ఆ మూడింటిని పొందడానికి దీపజ్యోతులనువెలిగిస్తారు.విద్యుత్ దీపాలంకరణ శోభగాచేసినప్పటికీ మట్టి ప్రమిదలోనూ నువ్వుల నూనె ఆవు నెయ్యి వేసి వత్తులతోవెలిగించే దీపం దివ్య శక్తిని ఆవహింపజేస్తుంది.దివ్వెల పండుగ ‘వెలుగు పువ్వుల పండుగ రాత్రి వెలిగే దీపం విలువెంతో చెప్పడం కష్టం.సాయంత్రం దీపం వెలగని ఇంటిని అంగనలేని ఇల్లుచతురంగ బలంబులు లేని రాజు నిస్సంగుడు కాని మౌని అంటారు.ఆధ్యాత్మిక ప్రతీకే దీప ప్రకాశనం దీపం వికాసానికి చిహ్నం కావడమే అందుకు కారణం.దీపావళి రోజున ఇంటి చుట్టూ ద్వారాలన్నీ రకరకాల ఆకారంలో దీపాలను అలంకరిస్తారు.ప్రమిదల ఆకారంలో కొన్ని ఒకే నియాన్ బల్బుతో ఉంటే మరికొన్ని ఎడెనమిదిబల్బులతో ఉంటున్నాయి.దీపావళి అమావాస్య చీకట్లను పారదోలుతూ చెడు మీద మంచిగెలిచిన విజయానికి సంకేతం.దీపం జ్యోతి పరబ్రహ్మం అంటూ దేవుడిదగ్గర తులసి కోట దగ్గర నిత్యం దీపం వెలిగిస్తారు. షోడశోపచారాలలోదీపం ముఖ్యం అందులోని భాగంగానేదీపావళి పండుగనాడు ఇంట్లో వాకిట్లో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి లక్ష్మీదేవినిపూజిస్తారు.మట్టి ప్రమిదలోఆవు నెయ్యి ‘నువ్వుల నూనెతోవెలిగిస్తారు.ఎలక్ట్రిక్ దీపాలు’నీటి దీపాలు ‘కలశం దీపాలు ,దీప ప్రతిబింబాలు ,మైనం దీపాలు’ దీపాలు ఎన్ని అయినా ఆరాధన ఒక్కటే లక్ష్మీదేవిని పూజించడం దీపావళి పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

డా. నన్నపురాజు విజయశ్రీ

Written by Dr.Nannapuraju Vijayasri

డా. నన్నపురాజు విజయశ్రీ
రాష్ట్రపతి అవార్డు గ్రహీత
రంగారెడ్డి జిల్లా
9100439884

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దీపావళి రోజు

కొన్ని స్మృతులు