గెలుపు అంటే ……. ?

ఎదుగుతున్న వ్యక్తిని
ఎగతాళి చేసే కుట్రలు
జరుగుతూనే ఉంటాయి
పురోగతిని పతనం చేసే
కుతంత్రాలు
రగులుతూనే ఉంటాయి !

మనో ధైర్యాన్ని దెబ్బతీస్తే
ప్రత్యర్ధి కుప్పకూలిపోతాడని
దుర్భాషల తూటాల్ని
సంధిస్తూనే ఉంటారు
గేలిచేసి అవమానిస్తే
పోటీదారు వెనుదిరిగిపోతాడని
విద్వేషాల బాణాల్ని
ప్రయోగిస్తూనే ఉంటారు !

అయినప్పటికీ ……..
ఆత్మవిశ్వాసపు జ్యోతిని
ఆరనీకు సుమా !
సూర్యుడవై జ్వలిస్తూనే ఉండాలి

ఎదుగుతున్న నిన్ను ఎగతాళి చేస్తే
జవాబు విజయంతోనే చెప్పాలి !
పురోగతిని అడ్డుకునే కుతంత్రాలు చేస్తే
సమాధానం విజయంతోనే చెప్పాలి !
దుర్భాషల తూటాల్ని ,విద్వేషపు బాణాల్ని
విజేతవై ఎదుర్కొని
విరోధుల నోరు మూయించాలి !

గెలుపు అంటే …..
వైరి వర్గం ఎత్తుల్ని
గుండె నిబ్బరంతో చిత్తుచేయడమే !
శిఖరమంత ఎత్తు ఎదిగి
శత్రు శిరస్సులు నీ ముందు
మోకారిల్లేటట్లు చేయడమే !

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేటి భారతీయమ్” (కాలమ్)

రమక్క తో ముచ్చట్లు -14