ఇది
కొత్తపదమైంది ఇపుడు!
పదాలు ఎపుడూ ఉంటూనే ఉంటాయి..
ఆవశ్యకత మాత్రం
కొన్ని సమయాలలోనే గుర్తొస్తుందా!
ఇచ్చే పర్మిషన్లు
పుచ్చుకున్నపుడు ఏమైందో??
కూల్చివేయడం చేతనైన పనే
బ్రతుకులు కూల్చేయడం సరైనదేనా??
అప్పులు తెచ్చి
ఆశలతో కట్టుకున్న
మధ్యబ్రతుకులు ఇవి!
ఎపుడూ మధ్యలోనే ఆగిపోవద్దని
ఒక్క అడుగు ముందుకేస్తే
హైడ్రా అనే వరద
మమ్మల్ని ముంచెత్తింది
కోలుకునే కొసమెరుపు
రానే లేదు
లేనే లేదు
రాజకీయం మారినప్పుడల్లా
ప్రభుత్వం మారినప్పుడల్లా
ఆశలు కాదు ఆశయాలు కాదు
బ్రతుకును చిదిమే భారం
ముంచుకొస్తుందనే భయం
ప్రజాస్వామ్య దేశంలో
పాలకుల పాలన
పరుగెడుతుంది ఎటువైపో
ఓటరు మిగులుతున్నాడెపుడు
మారుతున్న దారిలో మరుగునపడుతూ
ప్రశ్నలు మిగిలే ఉన్నాయి
FTL ఓటరుకేనా??
మరి ప్రభుత్వానికి??