దశలు — దిశలు

19- 10-2024 తరుణి పత్రిక సంపాదకీయం

గౌరవం దరిచేరిన తర్వాత గతాన్ని మరచి వర్తమానాన్ని పట్టుకొని వేళాడితే చుట్టు ఉన్న వాళ్ళు దూరం అవుతారు. గర్వం దశ ను చెబితే, సత్యం దిశను చెబుతుంది. ఏమయ్యుంటాయి ఈ దశలూ దిశలూ!
పరిశీలించాలి. కొందరు బలం లేక ఓడిపోతారు, కొందరు తెలివి లేక ఓడిపోతారు. అబద్ధాలతో మోసాలతో కొందరు విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇది కూడా దశ దిశ లను నిర్ణయించవు. Dignity of thaghts ఆత్మ గౌరవానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు తప్పకుండా Humanism అంటే మానవతావాదం తలకెత్తుకుంటారు. అయితే ఇవన్నీ కూడా generation gap తరాల అంతరాలు ఉంటుంటాయి.
మరి దశలు అన్నప్పుడు మనిషి పుట్టుక నుండి పెరిగే దశలలో ఇన్ ఫన్ఫాంట్ స్టేజ్ infant stage , బాల దశ, పుట్టినప్పటి నుండి దాదాపు ఒక సంవత్సరం వరకు ఉన్న న్యూ బార్న్ బేబీస్ నుండి ఏడాది వయసు గా చెప్తూ ఉన్నదశ. ఏమలినాలు అంటని మంచేదో చెడు ఏదో తెలియని ఆనందాల దశ.
Toddlers stage ఒకటి నుండి మూడేళ్ళ వరకు వయస్సున్న బాల్య దశ. కోపతాపాలు అలకలు సాధింపులు నీది నాది అనే తేడాలు వంటివన్నీ అంటుకుంటున్న దశ. ఇవేవీ బేబీ ఏజ్ రేంజర్స్ కాదు. మనిషి ఎదుగుదలలో కనిపించే మార్పులు. చైల్డ్ డెవలప్మెంట్ స్టేజెస్. శిశు అభివృద్ధి దశలు. మెల్లి మెల్లిగా బయోలాజికల్ సైకలాజికల్ ఎమోషనల్ చేంజెస్ రావడం అనేది సహజమైనటువంటి వయస్సు. Adolescence అంటారే అదన్నమాట. 5, 6 ఏళ్ల వయసుకు ఎదుగుతున్న సందర్భం. మెల్లిమెల్లిగా వాళ్ళ ఇష్టాలకు ఫౌండేషన్స్ వేసుకుంటుందీ దశ.
Childhood ను ఓ మూడు భాగాలుగా తీసుకున్నప్పుడు. Early childhood, Middle childhood, Late childhood అని తీసుకుంటాం.
ఇక్కడే మొదలవుతుంది బ్రతుకు దశ అభివృద్ధి !
ఇక ఆరు నుంచి పన్నెండు ఏళ్ల వయసు చాలా ప్రత్యేకమైన వయసు.
పదేళ్ల వరకు వచ్చారు అంటే బాల్యవస్థ నుంచి కౌమారంలోకి అడుగుపెట్టబోతున్నారు అని అర్థం. అందరికీ తెలిసిన విషయమే ఆడపిల్లలు శరీర మార్పులు puberty వంటివి. అందుకే ఈ వయసులోనే వాళ్ళ మనసుల్లో వాళ్ళ ఆలోచనలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. 12 నుండి 14 ఏళ్ల వయసు వచ్చేసరికి typical ఆలోచనలు వాళ్ళ మనసులో కలుగుతూ ఉంటాయి. అనేక అనేక అనుమానాలు, అనేక అనేక అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. దీన్నే Major developmental transist period గా చెప్తుంటారు. మగ పిల్లలలో కూడా శారీరక మానసిక స్థితిగతుల్లో మార్పులు వస్తూ ఉంటాయి.
పరిశీలన పరిశోధనా తత్వం పెరుగుతూ ఉంటుంది. ఒక దిశను ఎంచుకునే దశగా దీన్ని చెప్పవచ్చు.
ఇక్కడే వస్తుంటాయి వారసత్వ లక్షణాలు, సమాజ పోకడ లో ఉన్న విభేదాలను తో వచ్చే మార్పులు ఇవి. 22,24 ఏళ్ల వరకు వచ్చేసరికి ఒక నిర్దిష్టమైన భావాన్ని ఏర్పరచుకునేలా తయారవుతారు. ఇది దశను చెప్పలేదు కానీ దిశ కోసం ప్రయత్నం చేయమంటుంది.
అంతకు ముందు విద్యార్థి దశలో ఉన్నప్పుడు
తరగతి గదిలో తెలివైన వాళ్ళమనే ఫీలింగ్ వచ్చేసింది అంటేనే గర్వ ఛాయలు అలుముకున్నాయి అని అర్థం. ఇదే అనర్థం.
ఈ అనర్థాలకు కారణం ఎవరు ఏమిటి అని ఆలోచిస్తే మానవ అభివృద్ధి దశ కోసం చేసే జీవన పరిణామం అనే మూసలో బంధించి వేసిన దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఈ దశ మరిన్ని దశలకు ఆలంబనై దిశ లను వెతుక్కుంటూ సాగుతుంది.
సక్రమమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నామా లేదా అనే వివేచన ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. చెడు స్నేహితులను కలుపుకుంటే చెడు ఆలోచనలు వ్యూహాలు చేస్తే తప్పకుండా ఫలితం చెడుగానే వస్తుంది. ఏదో ఓ రకంగా ఏదో ఓ రూపంలో తప్పకుండా శిక్ష పడితీరుతుంది. మానసికంగా నో శారీరకంగా నో ! ఇవన్నీ యవ్వనం దశ లో కంటికి మనసు కూ కనిపించనీయవు . కానీ
నీరు పల్లమెరిగినట్టే నిజం నీకూ తెలియాలి. నీలోని ఆత్మ విమర్శ నీలోని అంతరాత్మ కు ఎప్పుడూ సమాధానం చెప్పాలి. చెప్పనప్పుడే సమస్యల వలయంలో చిక్కుకొని దిశ లేని తమస్సులో పడిపోతావు.
సాధారణంగా పిల్లల్లో చెడు ఆలోచనలు వస్తున్నాయి అని గ్రహించి నా సరిదిద్దని తల్లిదండ్రుల దే పెద్ద నేరం అవుతుంది. చెడును encarage చేయడం చెడును సమర్థిస్తూ పెంచడం అనేది పెద్ద నేరం. ఈ చెడు గుణాలు మొక్కగా ఉన్నపుడే గుర్తించి సక్రమమైన మార్గంలో కత్తిరించి సవరించి పెట్టాలి. గురువులూ స్నేహితులు కూడా సరిదిద్దాలి.
ఈ దశ నే క్రమం గా ఉద్యోగం, పెళ్లి పిల్లలు ప్రమోషన్లు… వ్యాపారం, సంపాదనలు బాధ్యత లు రిటైర్మెంట్ వంటి దశలలోనూ నీదైన వివేచనతో నడవకుండా పక్కదారి పట్టిన మౌఢ్యమనే తెగులుకు సద్బుద్ధి అనే కీటక నివారణిని పిచికారీ చేస్తూ బ్రతకకుంటే దశ మారడమేమో గాని దుర్దశలో పడిపోవడం తప్పదు.
మనుషులు మారాలి అని మానవత్వం వెల్లివిరియాలి అని ఆలోచిస్తూ అడుగేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఇది నీదైన దశ మారడానికి ది శ ను చూపిస్తుంది

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళా మణులు- కామేశ్వరి కొల్లాపూర్

నులివెచ్చని గ్రీష్మం