ఆదర్శ మహిళ శ్రీమతి కామేశ్వరి గారు ఈనాటి మన మహిళా మణి :-
కామేశ్వరి గారు వారి ఉద్యోగ అనుభవాలను పంచుకుంటూ…..ఆకాశవాణితో 32 ఏళ్ల అనుబంధం గురించి చెబుతూ…. భాష సంస్కృతి సాంప్రదాయం సంగీతం కలలకు కేరాఫ్ అడ్రస్ గా ఆకాశవాణి తో నాకు అనుబంధం దేవుడిచ్చిన వరం అన్నారు.
సమయపాలన, వివేక విచక్షణలు , పెద్దలతో ఎలా మాట్లాడాలో ఒక వ్యక్తిలోని strength, weakness opportunity, threat అన్నీ కూడా సమగ్రంగా బేరిజు వేసుకుని అవగాహన కలిగించుకున్న వ్యక్తిగా ఎదగడం అనేది కేవలం ఈ సంస్థకు మాత్రమే చెల్లుతుంది. ఇది ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో అవసరం అని చెప్పగలను అన్నారు.
ప్రజాప్రసారమాధ్యమంగా AIR code కి అనుగుణంగా రూపొందించి విని కార్యక్రమాలు నా జీవనశైలిని ఎంతో సరళీకృతం చేసింది అంటారు. కావలసింది తీసుకొని అక్కడకు రానిది ఎడిట్ చేసే విధానం మన మానసిక విశ్రాంతతకు ముఖ్యమైనది అని చెప్పారు.
1990 లో ఆకాశవాణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా నా ఉద్యోగ ప్రస్థానం AIR code ని ఎంతగా ఆకలింపు చేసుకుంది అంటే వేరే ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా నెత్తికెక్కని విధంగా నా ఉద్యోగ ధర్మం నన్ను అలా తీర్చిదిద్దింది అంటూనే, డ్యూటీ ఆఫీసర్ గా షిఫ్ట్ లో అప్పటి stalwart announcers శ్రీమతి రతన్ ప్రసాద్,శ్రీ పట్టెం సత్యనారాయణ , శ్రీ రామారావు,శ్రీమతి జ్యోత్స్న ,శ్రీ కపర్థ, డాక్టర్ శమంతకమణి ఇంకా తర్వాతి తరం వారు అందరితో కలిసి షిఫ్ట్ లో పనిచేయటం వల్ల స్నేహబాంధవ్యం ఏర్పడింది అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అసలు ఏది ఎలా చెప్పాలి ఏది చెప్పకూడదు music announcement protocols, VVIP announcement,morning disaster management ఇటువంటివి అన్నీ తెలియకుండానే తెలుసుకొనే అవకాశం దొరికింది. ఒకరిని ఒకరు విమర్శించుకొనటం ఒక ఒరవడి.ఇవి అధిగమించాలి అని తెలుస్తుంది. ఇకపోతే, duelist తయారుచేసి సీనియర్ ఎక్స్ కు తెలియజేయటం ఒక కళ. ఎలా వ్యక్తుల నుండి విషయ అవగాహన , swot analysis ఈ ఉద్యోగానికి ఒక ప్లస్ పాయింట్ అంటారు.
ఇకపోతే సమన్వయ విషయానికి వస్తే ఇంజనీరింగ్ వారితో అకౌంట్స్ అడ్మిన్ వారితోనూ కూడా మన PR పెరుగుతుంది. అది ఒక human resource Management అని తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
మొదట్లో డైరెక్టర్స్ చాలా మటుకు తమిళవారు ఉండేవారు మా అనుబంధం వారితో దూరమే పెక్సీ కో మాకు కోడ్ రూల్స్ రెగ్యులేషన్స్ నేర్పిన వారు నేను చేరినప్పుడు, పాత్ర గారు భీమయ్య గారు చల్ల ప్రసాద్ రావు గారు ఎస్వీ ప్రసాద్ గారు వంటి వాళ్ళు ఎందరో అందరూ మాకు తెలియకుండానే మమ్మల్ని తీర్చిదిద్దారు అంటూ తమ సిన్సియర్ ఒపీనియన్ చెప్పారు.
ఇకపోతే స్పోకెన్ వర్డ్ సెక్షన్ లో నేను, F&H, EB, ESD, MIS, Flagship , ఏ సెక్షన్ లో ఎలాంటి రిసోర్స్ పర్సన్స్ను పిలవాలి కొత్తవారిని ఎలా మనకు అనుగుణంగా మలుచుకోవాలి అని కుశలత అలవాడింది స్క్రిప్ట్ చదవడం ఒక కళ అని అర్థమైంది అంటూ ఉద్యోగంలో తాము నేర్చుకున్న విషయాలను కూలంకషంగా చెప్పారు.
Promotion PEX 2005 లో CBS లో నరసింహ చారి గారి ఆధ్వర్యంలో పెక్సికో గా లెస్ LRS&PC
Commercial correspondence CSU తో commercial manual ప్రకారం ledger service tax ఇతర financial statements ఈ పని కూడా నన్ను,IGNOU లో ఫైనాన్స్ ఎంబీఏ చేయడానికి ప్రేరేపించింది. నాకు కొత్త సబ్జెక్టు ఫైనాన్స్ పై అవగాహన పెంచి రిస్క్ రిటర్న్ అనాలసిస్ మెర్జర్ అండ్ amalgamation project work కి దోహదం చేశాయి. అలానే, FM V B 102.8 mhrs పై FM style లో పాటల తో infotainment 1 గంట నిడివి వారానికి లైవ్ అనౌన్సర్స్తో చేయడం ఒక అనుభూతి. శ్రోతల ఉత్తరాలు గుర్తింపు ఒక అవకాశం అని చెప్పారు.
దాదాపు మూడు సంవత్సరాలు అన్ని పండుగలు అనౌన్స్మెంట్స్ ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఎంచుకొని కోరిన పాటలతో చెప్పటం ఒక తృప్తి అప్పుడు నేను వినోద వల్లరి కథాకేళి వంటి చక్కటి క్రిస్పీ స్క్రిప్ట్ తో కార్యక్రమాలు చేసే అవకాశం,రేడియో నాటక పోటీలకు వివిధ భారతి నుండి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం దొరకడం చక్కటి జ్ఞాపకాలు అన్నారు.
నిజామాబాద్ AIR లో కూడా నేను లైవ్ లో ఉత్తరాలు స్క్రిప్స్ చదివి ఆనందించేదాన్ని దేశభక్తి ఆధారిత కార్యక్రమం భారతీయం చాలా జనాదరణ కలిగి ఉత్తరాలు చాలా వచ్చేవి . తర్వాత హైదరాబాదులో హిందీ మరాఠీ, PC commercials… అయితే హిందీ సెక్షన్ లో నేను రిసోర్సెస్ పర్సన్స్ కు అంశాలను ఇచ్చి రాయమనేదాన్ని ఒకరిద్దరూ నేను ఇచ్చే అంశాలను ఎంతో శ్రద్ధతో తయారుచేసి తెచ్చి చదివేవారు ఆ సెక్షన్ మారిపోయాక వాళ్ళు పని కట్టుకొని నా దగ్గరకు వచ్చి , వాళ్లకు కొత్త టాపిక్స్ ఇవ్వడం వల్ల వారి ఆలోచనలను ప్రభావితం చేశాయని నన్ను సరస్వతి రూపుగా భావిస్తున్నామని చెప్పినప్పుడు నేను మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నాను . ఇటువంటి అవగాహన నాలో తెలియకుండానే ఆధ్యాత్మికతను పెంచింది ఇంతకంటే పరమార్ధం ఏ ఉద్యోగం ఇవ్వదని అనిపిస్తుంది అన్నారు.
వనితా లోకం, స్రవంతి స్త్రీలు వృద్ధులతో కూడా మమేకమై ఎంతో అనుభూతి ఇస్తూ చాలా చాలా తృప్తిని కలిగించాయి. వృద్ధులు, స్త్రీలను స్పెషల్ ఆడియన్స్ ప్రభుత్వం తప్ప వేరే సంస్థలు వారి బాగోగులు పట్టించుకోలేవు. ప్రత్యక్షంగా శ్రోతలు ఎక్స్పర్ట్స్ పాల్గొనేలా M 1 Studio లో చాట్ షోలు , స్త్రీల కార్యక్రమంలో అనేక నాటికలు రూపకాలు ఇంటర్వ్యూస్ చాలా ఆనందాన్ని పేరుని సంపాదించి పెట్టాయి. ఆ దిశగా ఉత్తరాల ద్వారా చెప్పిన ఒక విషయం మీతో పంచుకుంటే జస్ట్ ఫికేషన్ ఏమిటంటే ZP school teacher ఒకరు వనిత లోకం రేడియో కార్యక్రమాలు స్త్రీల సమస్యలను ఎంచుకొని అవగాహన ఏర్పరిచే పరిష్కార మార్గాలు చూపటం అనే విషయం లో రేడియోకు వేరే మీడియా ఏది సాటి రాదు అని చెప్పటం గొప్పతృప్తిని మిగిల్చింది అన్నారు.
దాదాపు 2019 – 20 లో చాలా మంది ప్రోగ్రామర్స్ రిటైర్ అవ్వటం ఒక వ్యాక్యూమ్ ఏర్పడినప్పుడు నాకు ఎఫ్ఎం రెయిన్బో సెక్షన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు కోవిడి వ్యాప్తి కావటం FM rainbow RJ లు అందరూ సహకరించి లైవ్ అన్ని అవరోధాలు దాటి రావటం technical advancement WhatsApp, online అన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ గా ఆపత్కాలంలో FM radio ఎంతగా ప్రజాదరణ పొందిందో ఎంతగా ఉపయుక్తమైందో అందరికీ విధితమే. migrant labour mana FM phone గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి అవసరాలను చెప్పటం, success story పత్రికల ద్వారా మన ప్రసార భారతి సేవలు గుర్తింపు పొందడం ఒక భాగ్యం. లైవ్ లో బాల కార్మికులను ఎక్స్పర్ట్స్ గుర్తించి రెస్క్యూ టీం పంపి స్టేట్ హోమ్ కు తరలించడం ఒక అనిర్వచనీయ అనుభూతి….
అదే సమయంలో ఆన్లైన్ cuesheets, tbs online WhatsApp group లలో స్క్రిప్స్ అన్ని ఒకేసారి అవలీలగా సాంకేతిక సౌజన్యంతో చేయడం నాకు నల్లేరు మీద బండి చందాన సహకరించింది. మన సంస్థను నిలబెట్టే అవకాశం దైవ సంకల్పం. అలానే crisis management కూడా నేర్పిందిAIR.
ఇటీవల ప్రసార భారతి రూపాంతరం చెందుతున్న ఈ దశలో వివిధ భారతి ఛానల్ లోని మార్పులు అలాగే ఎఫ్ఎం రెయిన్బో నాన్ ఫిలిం సాంగ్స్ టు ఎక్స్పరిమెంటేషన్ రెండు దాదాపు ఏకకాలంలో బోర్డు తలపెట్టిన తరుణం. అప్పుడు నాకు బహు కష్టం కలిగించింది కానీ చాలా తృప్తిని ఇచ్చింది archival లలిత సంగీతాన్ని rainbow మీద వినిపించే సాహసం చాలా కష్టపడి పాపులర్ లలిత సంగీత గీతాలు వినిపించే ప్రయత్నం hard disk లు తీసి అందులో వెతికి కొన్ని YouTube air light music పాటలు రోజు 10 గంటలపాటు దాదాపు 6 నెలలు ఎంతో కష్టపడి RJ లను ట్రైన్ చేశా ను. కొందరు ఆర్జేస్ కూడా సహకరించారు దానికి ప్రజాస్పందన బాగానే వచ్చింది కానీ స్టాక్ ఎక్కువ లేకపోవడం సస్టెన్ చేయటం కష్టం అవుతుంది అన్నారు.
నాకు ఎఫ్ఎం రెయిన్బో ఇంకా VB తెలుగు రెండు ఇచ్చి ఉన్న ప్యానెల్ ఆర్జేలను మార్చాలని ఒత్తిడి పెరిగినప్పుడు ఉభయతారకంగా కొందరిని మాత్రం విడతల్లో అటూ ఇటూ సర్దుబాటు చేసి రెండు చానల్స్ కూడా ఇబ్బంది పడకుండా దాదాపు ఒక నెల రోజులు కష్టపడి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను, ఇది యాదృచ్ఛికం ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ నాకు అన్ని రకాల ఎదుగుదలకు సహకరించిన మాతృ సంస్థ ఆకాశవాణి అంటూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇక కష్టం కలిగించిన తెలుసుకోదగ్గ అంశాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ ముందు చెప్పినట్లు మన కోడ్ నాకు నేర్పిన మానసిక డిసిప్లిన్ అక్కరకు రాని అంశాలు ఎడిట్ చేసే పద్ధతి మానసిక ధైర్యాన్ని ఇచ్చింది నాకు ఏ సెక్షన్ ఇవ్వాలో పద్ధతిగా కాక సీనియర్స్ వద్దంటే తీసేసి జూనియర్స్ ఇవ్వద్దు అని అంశాలు పెట్టే పద్ధతిలో, దురుసుగా కొందరు సామూహికంగా వ్యక్తిగత దాడిని చేయటము వారి వారి విజ్ఞతకే వదిలేసా సంస్థ కూడా ఎంప్లాయిస్ ను ఎటువంటి దశ నిర్దేశించక గాలికి వదిలి మన వ్యవస్థ అన్న ధోరణిలో కాక నాకు ఎందుకు ఎవరు ఎవరిని దాడి చేస్తే స్త్రీ అయినా పురుషులైనా అనే ప్రోగ్రాం వింగ్ అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్ కి ఇది ఒక తార్కారణంగా ఉన్నత పరిణామాలు పరిరవెల్లిన తరుణంలో అడుగుపెట్టిన నేను ఇటువంటి నిర్వీర్యమైన పరిస్థితికి శ్రోత ప్రేక్షక పాత్ర పోషించాను.
కానీ నేను ఏ సెక్షన్ కోరి తీసుకోలేదు వద్దు అనలేదు ఇచ్చినవి చాలెంజ్గా తీసుకొని నన్ను నేను మలుచుకున్నాను. వ్యక్తికన్నా వ్యవస్థ గొప్పది అనే నమ్మిక తో ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ…. మరి ఎవరిని కష్టపెట్టే ధోరణి అవకాశం నాకు కలగలేదు తట్టలేదు సాంకేతిక పరిణామాలు అత్యున్నత స్థాయిలో ఉన్న మన దేశంలో ప్రైవేట్ మీడియాతో మనకున్న కొద్దిపాటి సాంకేతిక విసులుబాటు వ్యక్తుల అందుబాటు ఆదరణ ప్రభుత్వ మీడియా పట్ల మారుతున్న ఈ తరుణాన కూడా మన ప్రయత్న లోపం లేకుండా మన కృషి నిర్విరామంగా చేస్తున్నాం. బహుజనహితాయ బహుజన సుఖాయా! అంటూ చాలా ఉన్నతంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
వీరి తల్లిదండ్రులు శ్రీమతి వారిని కీర్తిశేషులు శ్రీ మొదలి అరుణాచలం గార్లు. వీరికి ఇద్దరు పిల్లలు. చిరంజీవి రఘుతేజ కొల్లాపురపు USA , రామకృష్ణ తేజ కొల్లాపురపు , ఎంబిబిఎస్.
శ్రీమతి కామేశ్వరి గారు ఇప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ లో డెప్యూటేషన్ మీద మీడియా మేనేజ్మెంట్ ప్రెస్ రిలీజియస్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అంశాల మీడియా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టేట్ గవర్నర్ ఎంప్లాయిస్ కు ఇండియా సర్వీసెస్ వారిదీ, ఇంకా….ఇంటర్నేషనల్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రాం క్రింద అసోసియేట్ అయ్యి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంత గొప్ప పనులను చేస్తున్న స్త్రీ శక్తి కి నిదర్శనం కామేశ్వరి గారు యువతరానికి ఆదర్శం. తరుణి పత్రిక తరపున అభినందనలు తెలియజేద్దాం !