(ఇప్పటివరకు : సుబ్బ రావు మైత్రేయి పని చేస్తున్న కాలేజీ కొచ్చి గోడవచే స్తాడు. ఇంటి కొచ్చిన మైత్రేయికి తన కోసం లండన్ నుంచి తిరిగిచ్చిన వసుంధర ఆమె కోసం ఎదురుచూ స్తు కనిపించింది. సుబ్బారావు ఫోన్ వస్తుంది. ఆ మరునాడే సుబ్బారావు తల్లి అతని చెల్లి రాజి మైత్రేయిని కలవడానికి వస్తారు. సుబ్బారావు తల్లి కేసు వాపసు తీసుకోమని చెబుతుంది.వసుంధరని కలవడానికి ప్రసాద్ తో కలిసి మైత్రేయి వెళుతుంది )
“ మీరు అలా ఆలోచించటం లో తప్పు లేదు. కానీ హింస లో చిన్నది పెద్దది అన్న వ్యత్యాసం ఉండదు, మైత్రేయి. ఈ రోజు ఆ చర్య చిన్నదిగా అందరికి అనిపించవచ్చు. కానీ పోను పోను తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు సుబ్బా రావు లాంటి వ్యక్తుల పైశాచికత్వం పెరుగుతుందే గాని తగ్గదు. మీరు సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకున్నారు . మీరు కేసు పెట్టేసారు, కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా జరిగాయి, మీరు ఏమయినా చెప్పిన చెప్పక పోయిన, గృహహింస చట్టం కింద అతనికి జరిమానా , శిక్ష అయితే తప్పదు. అయితే మీ లాయర్ కోర్ట్ ముందు పెట్టె వాదన లను బట్టి, మీరు చెప్పిన దాన్నిబట్టి, అతనికి పడే శిక్ష తగ్గవచ్చు,పెరగ వచ్చు. అందుకని మీరేమనుకుంటున్నారో , ముందుగా మీకు క్లారిటీ ఉండాలి ,” అన్నాడు
“సరిగా చెప్పావు ప్రసాద్. భయ పడుతూ మాట్లాడకూడదు. అలాగని మౌనంగా కూడా ఉండకూడదు. కోర్ట్ లో మాట్లాడే ప్రతి పదం రికార్డ్ చేయబడుతుంది. అందుకె చాలా స్పష్టంగా మాట్లాడాలి. లేకపోతే ఎదుటి పార్టీ కి బలం చేకూరుతుంది, నువ్వు బాగా ఆలోచించుకో మైత్రేయి, ఇంకా రెండు రోజులుంది నీకు,కంగారేమి లేదు. నాకు చెప్పాల్సిన విషయలేమయిన నువ్వు ముందుగానే చెప్పాలి నాకు, అప్పుడే మనం పడుతున్న శ్రమకి ఫలితం ఉంటుంది, ’ అంటూ కాఫీ కప్పు లను వాళ్ళ చేతికి అందించింది.
కాఫీ తాగేసి ,” నేను నిన్ను రేపు మళ్ళి కలుస్తాను,వసు,” అంటూ ప్రసాద్ వైపుకి తిరిగి “మనం వెళదామా ,” అంది. అలాగే అన్నట్టు ప్రసాద్ తలూపి బయటికి నడిచాడు , అతని వెనకాలే మైత్రేయి. అలా వెళ్లి పోతున్న ఇద్దరినీ సాలోచనగా చూస్తూ ఉండిపోయింది వసుంధర.
కొంత దూరం వచ్చేశాక మైత్రేయి, “ప్రసాద్ గారు, కొద్ది సేపు ఇక్కడ ఆపండి,” అన్నది.
ఎందుకు అని ఆడకుండానే బైక్ ని రోడ్ కి ఒక పక్క గా ఆపాడు.
మై త్రేయి బైక్ దిగి రోడ్ కి పక్కగా నడుస్తూ ఆలోచనలో పడింది. ప్రసాద్ ఆమెని అనుసరిస్తూ ఆమె వెనకాతలే నడవటంప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళగానే ఆగింది,” ప్రసాద్ గారు,ఇప్పుడే జడ్జిమెంట్ కూడా వచ్చేస్తుందా,” అడిగింది.
“ చెప్పలేము. కేసు యొక్క సీరియస్ ని బట్టి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను,” అన్నాడు. “ మరయితే ఈ కేసు కోర్ట్ లో ఎక్కురోజులు నడిచిందనుకోండి, మరి నా పరిస్తితి ఏంటి? అతని నుండి నాకు ఎప్పుడు ప్రమాదమే కదా,” అన్నది కాస్త భయం గా.
“ కావచ్చు. కానీ కోర్టు ముందు మీ భయం చెప్పుకుంటే మీకు లీగల్ ప్రొటెక్షన్ దొరకొచ్చు. ఎలాటి భయాలు, అనుమనాలు ఉన్న, మీరు వసుంధర గారిని అడగాలి. మీకు మీ కేసు గురించిన అవగాహన కలుగుతుంది. అప్పుడే ఆమె ఏమైనా చేయ గలుగుతారు. అలాగే మీరు అతని ఆగడాలన్నీ స్పష్టంగా మీ లాయర్ కి చెప్పాలి కూడా. దాచిపెట్టటం, భయపడడం లాంటివి చేయకండి. అప్పుడే మీ కేసుకి బలం చేకూరుతుంది.”
“అలాగయితే, మనం ఇప్పుడే వసుంధర దగ్గరికి వెళదామ? ” అడిగింది.
“షూర్, మీరా మేకి ఫోన్ చేసి చెప్పండి తనకి, మీరు ఇప్పుడే
కలవాలనుకుంటున్నారని,” అన్నాడు. వెంటనే మైత్రేయి ఫోన్ కలిపింది.
వసుంధర, “ ఎంటే మైత్రి, మళ్ళీ నా దగ్గరికి రావలనుకుంటున్నవా,” అంటూ అడిగింది .
“ అవును,” అంది మొహమాటంగా
“భలే దనివే , నోర్మూసుకొని వచ్చే సే, నువ్వు నీ మొహమాటం. ఎదురుచూస్తుంటాను,” అంటూ ఫోన్ పెట్టేసింది.
ప్రసాద్ బైక్ స్టార్ట్ చేశాడు ,మైత్రేయి ఎక్కింది. వసుంధర వాళ్ళింటి వైపు మళ్ళీ వెళ్లారు.
వసుంధర వాకిట్లోనే ఎదురొచ్చింది. మొక్కలకి నీళ్ళు పోస్తున్నది. వాళ్ళని చూస్తూనే పంపు కట్టేసి మైత్రేయి చేయి పట్టుకొని లోపలకి నడిచింది. ఈ సారి ఆఫీస్ లోకి కాకుండా ఇంట్లో కి తీసుకె ళ్ళింది. ముందు గది లో అందం గా అమర్చిన ఫర్నిచర్ చూస్తూనే ప్రసాద్ వసుంధర టేస్ట్ కి అబ్బురపడ్డాడు.
వాళ్ళిద్దరినీ కూర్చోమని లోపలకెళ్ళి లెమన్ స్క్వాష్ మూడు గ్లాసుల్లో తీసుకొచ్చింది.
“మీరిద్దరి ఇక్కడే డిన్నర్ చేసి వెళతారు సరేన,” అంది.
ప్రసాద్ కాస్త ఇబ్బందిగా ,” నేనెందుకు లెండి మేడమ్, మైత్రేయి గారు ఉంటారు. నేను మళ్ళీ వస్తాను తనని పిక్ అప్ చేసుకోవడానికి,” అన్నాడు.
“ మీకే దయిన పనుంటే నేను ఆపను, కానీ వెళ్ళి డిన్నర్ టైమ్ కల్లా వచ్చెయ్యండి,” అన్నది. సరేననక తప్పలేదు. ‘అలాగే,’ అని చెప్పి అతను వెళ్ళి పోయాడు.
“ఇప్పుడు చెప్పు మైత్రి, నువ్వు నాకన్ని చెప్పాలి. ఇప్పుడు ఒక లాయర్ గా కాదు నిన్ను ఆడగుతుంది , ఒక ఆత్మీయురాలిగా, చెప్పు,” అంది. వసుంధర చూపెడుతున్న ఆప్యాయత కి కళ్లుచేమర్చి గొంతు గద్గదమయింది. పక్కనే కూర్చొని తలమీద చెయ్యేసింది వసుంధర.
కొద్ది సేపటి కల్ల తెరుకొని వసుంధర లండన్ వెళ్ళిన దగ్గర్నుంచి నిన్న అత్త గారు ఆడపడుచు రాజీ వచ్చి వెళ్ళేదాకా జరిగిన వన్ని చెప్పింది. తనతో టి అన్నయ్య, నాన్న , అమ్మ వాళ్ళు ప్రవర్తించిన తీరు చెబుతుండ గా గొంతు వణికింది మైత్రేయి కి.
అంతా విన్న తరువాత వసుంధర తలడిస్తూ , “ చూడు మైత్రి, సుబ్బ రావు నీ నుండి విడిపోవాలను కోవటం లేదు. నిన్ను అందరి లాగే భావించి నీ మీద తన ఇగోస్ చూపెడుతున్నాడు. అంతే కాకుండా నీ మీద వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే నువ్వు ఒంటరి దానవైతే నిన్ను తన దగ్గరికి లాక్కోవచ్చని అనుకుంటున్నాడు. మీ అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళందరికీ కుటుంబ పరువు, మర్యాద లే వాళ్ళ బలహీనత. అది పట్టుకొని వాళ్ళని మానేజ్ చేసేస్తాడు. అందుకె నీకు కాస్త అండగా ఉన్న ప్రసాద్ ముందుగా అతని టార్గెట్ అయ్యాడు.”
“మరయితే అతని నుండి నాకు విముక్తి ఉండదా ? ఈ కేసు ఎన్నాళ్ళు కోర్టు లో నడుస్తుంది? అప్పటివరకు నా పరిస్థితి ఏంటి?” అడిగింది కాస్త గాభరాగా .
“నువ్వంత భయపడకు , మైత్రి ! మనం కోర్ట్ నుండి ప్రొటెక్షన్ తెచ్చుకోవచ్చు. అలాగే అతని మీద నిఘా పెట్టవచ్చు. కానీ ఈ గోడవలో నువ్వు పడే మానసిక వ్యధ ని మాత్రం తగ్గించలేము. ఎందుకంటే ఈ సమాజం ఎలాటిదంటే తాను మరిచిపొదు , నిన్ను మరిచి పోనివ్వదు. అనుక్షణం నిన్ను తన చూపులతో వెంటాడు తూనే ఉంటుంది. ఎందు కంటే నువు ప్రతి ఒక్కరి తోటి పోరాడ లేవు. అందుకె నువ్వు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. నీకు నువ్వు సర్ది చెప్పుకోవాలి. ఎవరి మీద ఎక్కువగా ఆధార పడకూడదు. ప్రతి చిన్న దానికి చలించిపోకూడదు. ఏం జరిగిన, దానినుండి బయటపడటానికి మార్గం అన్వేషిస్తూ ఉండాలి కానీ, భయపడి పోకూడదు, పోరాటం అంతా సులభం కాదు.”
“ నేనే పోరాటాలు చేయాలనుకోలేదు. అందరి లాగా ఒక కుటుంబం, చక్కటి సంసారం, అందరి తోడు కోరుకున్నాను. నాతో నే ఇలా ఎందుకు జరిగింది.”
“ఇది జీవన పోరాటం మైత్రేయి. నువ్వు పోరాటం ఎంచుకోలేదు. పోరాటమే నిన్ను ఎంచుకుంది. ఎందుకంటే నీలో ఉన్న విజ్ఞత, సంస్కారం, ఆత్మాభిమానం, వినూత్నమయిన వ్యక్తిత్వం, నిన్నలా ఆలోచింపచేశాయి ఆ క్షణం. అందుకె నువ్వు తిరగ పడ్డావు. కానీ చాలా మంది ఆడపిల్లలు అలాంటప్పుడు బాధితులుగానే మిగిలిపోతారే తప్ప ,తిరగబడరు. వాళ్ళతోటి జరుగు తున్న అత్యాచారం చెప్పరు. చివరికి చేయిదాటి పోయే పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కానీ తాము కూడా స్వతంత్ర వ్యక్తులమే అన్న ఆలోచనే వాళ్ళ కుండదు. పైగా పెళ్లి చేసిం తరువాత తమ కి ఆ అమ్మాయి మీదేమి బాధ్యత లేనట్టుగా భావిస్తారు చాలా మంది తల్లితండ్రులు. దానికి ముఖ్యమయిన కారణం ఎక్కువ మంది సంతానం, మొగపిల్లా డిమీదున్న వ్యామోహం , తక్కువ ఆర్ధిక స్థితి, ఇలా చాలా విషయాలు ఇలాటి సమస్యలను ప్రభావితంచేస్తుంటాయి. సామాన్య ప్రజానీకంలో కోర్ట్ అన్న ,పోలీస్ అన్న భయం. ముఖ్యంగా ఆడపిల్ల విషయం లో అయితే బాధించబడటా నికి సిద్ధపడతారుగాని చట్టాన్ని ఆశ్రయించరు. ఎందుకంటే అక్కడ కూడా భయమే! కోర్ట్ లో జరిగే సమయ విలంబన, కోర్టు లాయర్ ఖర్చులు, పోలీసు చట్టం మీద పూర్తిగా నమ్మకం లేకపోవడం ఇవన్నీ ఒకెత్తు. ఆడపిల్ల విషయం పదిమందికి తెలిస్తే కుటుంబ పరువు , మర్యాదలు మరియు ఆడపిల్లే కద అన్న చులకన ఒకెత్తు. అందుకే మన కుటుంబాలలో ఆడపిల్ల మీదనే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. ‘నువ్వే సర్దుకు పోవలమ్మా’ అంటూ నచ్చచెబుతారు. అణిగిమణిగి ఉండి కాపురం గుట్టుగా చేసుకోవాలని చెప్పి చెప్పి ఆ పిల్లకి బ్రైన్ వాష్ కూడా చేస్తారు. అంతేకాదు చదువు కూడా పెళ్ళికోసమే చదివించే తల్లితండ్రులు ఉన్నంత కాలం మనం మార్పు తీసుకు రాలేము.”
“వసు, మరి జనం లో ఇలాటి భయాలను పోగట్టలేమా?”
“పోగొట్టొచ్చు. మన భారతీయ న్యాయస్థానం ఆర్ధిక స్తోమత లేని వారికి వారి తరఫున వారి కేసు ని కోర్ట్ లో వాదించడానికి ఉచితంగా లాయర్ ని ఏర్పాటుచేస్తుంది. అలాగే
నీ పక్కయింట్లోనే ఇలాటి గృహహింస జరుగుతుంటే, ఆ విషయాన్ని నువ్వే పోలీస్ కి చెప్పవచ్చు. అలా చెప్పిన వ్యక్తి వివరాలు రహస్యం గా ఉంచబడతాయి. అలాగే గృహహింస బాధితులు , “దర్వాజ కటకటావో” అంటే ఆ బాధితురాలు పొరుగువారి సహాయం కోసం వారి తలుపు కొట్టమని అర్ధం. ఇలా ప్రజలలో చైతన్యం తేవడానికి ఎన్నో స్వచ్చంధ సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ మన ఆలోచనలు మారనంత వరకు ఇలాటి సామాజిక సమస్యలు అంతరించిపోవు. నీలాటి విద్యావంతులయిన స్త్రీలు ధైర్యం గా నిలబడాలి. మనమే తయారు చేసుకున్న వ్యవస్థ మీద మనమే నమ్మకం పెంచాలి. అప్పుడే నీకోసం నువ్వు చేస్తున్న ఈ పోరాటం పదిమందికి ప్రేరణ అవుతుంది,” అంటూ చెప్పుకొచ్చింది వసుంధర.
వసుంధర మాటలు మంత్రం లాగా పనిచేశాయి మైత్రేయి మనసు మీద. మనసులో దృఢంగా నిర్ణయించుకుంది, ‘ఏది ఏమయినా అతనికి అతను చేసిన తప్పు తెలిసిరావాలి, తాను వెనకడుగు వేయకూడదు.’
****************
ప్రసాద్ సరిగ్గా డిన్నర్ టైమ్ కి వచ్ఛాడు. అప్పడే వెంకటేశ్వర్లు గారు కూడా వచ్ఛా డు. అందరూ కలిసి భోజనానికి కూర్చుంన్నారు . టేబుల్ మీదనే అన్నీ ముందుగా సర్ది పెట్టి వసుంధర కూడా కూర్చుంది వెంకటేశ్వర్లు గారి పక్కన.
“ప్రసాద్, నీకు కావలసినవి నువ్వే పెట్టుకోవయ్య , మీ మేడమ్ గారు వడ్డించే ఆచారం ఇక్కడ ఆపేసి, మరొక చోట మొదలుపెట్టారు,” అన్నడు వసుంధర వైపు కాస్త కొంటెగా చూస్తూ.
ఎక్కడేంటి,” అడిగినది వసుంధర చిరుకోపంతో.
“ఎక్కడేంటి వసుంధర , కోర్ట్ లోనే,” అంటూ నవ్వేశాడు. అతని నవ్వుతో ఆమె స్వరం కలిపింది. అలా ఒకరి నొకరు గౌరవించుకుంటున్న దంపతులను చూస్తుంటే చాలా ముచ్చట అనిపించింది ప్రసాద్ కి.
“నువ్వు ,వెంకటేశ్వర్లు గారు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి,” అని మనసులోనే మనసారా కోరుకుంది మైత్రేయి. తినడం అయ్యాక వెంకటేశ్వర్లు టేబల్ మీదున్న గిన్నెలన్నీ కీచన్ లోని సింక్ లో పడేసి వచ్చాడు. ఆ తరువాత టేబుల్ తుడిచేసి బయటికి వచ్చాడు. ఇంతలొకే వసింధర ఐస్ క్రీమ్ కప్పులు తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది.
“మైత్రేయి గారి పుణ్యమా అని , నాకు వారంలో ఒక్కసారైనా మంచి మీల్స్ దొరుకుతున్నాయ్,” అని అన్నాడు.
“నువ్వు పెళ్లి ఇంకా ఎందుకు చేసుకోలేదు ప్రసాద్,” అడిగాడు ఆయన.
“నాకు పెళ్ళయింది, సర్. నేను బ్రహ్మచారిని కాదు. పెళ్ళయిన బ్రహ్మచారిని,” నవ్వాడు ప్రసాద్.
ఈసారి మైత్రేయి ఆశ్చర్యంగా ,” వాట్ !” అంది.
“అవును మైత్రేయి నాకు పెళ్ళయింది,” అన్నా డు.
“మరి మీ భార్య ఎక్కడ ఉన్నది,” అడిగింది వసుంధర.
“వాళ్ళింట్లోనే, చెన్నై దగ్గరున్నగుడియాట్టం టౌన్ లో. వాళ్ళ నాన్న గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తాడు. వాళ్ళమ్మ ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ గా పని చేస్తారు. నాకు అపూర్వ తో టి పెళ్ళయి రెండేళ్లవుతున్నది. ” అన్నాడు.
“మరయితే మీరు మీ భార్యను తెచ్చుకోవచ్చు కదా,” అన్నది మైత్రేయి.
“ అది సాధ్యపడదండీ ,” అన్నడు కాస్త సీరియస్ గా.
“ఎందుకని, ఏదయిన ప్రాబ్లం,” అడిగాడు వెంకటేశ్వర్లు గారు.
“ అలాటిదే , ఆమెకు నాకు మధ్యన ఉన్న సమస్య,” అన్నాడు.
“అంటే,” అన్నాడు వెంకటేశ్వర్లు.
“ నాది చాలా సెన్సిటివ్ ప్రాబ్లం సర్, అందరితోటి షేర్ చేసుకోలేను, ఎప్పుడయినా మిమ్మల్ని ఇంకోసారి కలిసి నప్పుడు చెబుతాను,” అన్నాడు ప్రసాద్ ఇప్పుడీ ప్రస్తావన ఆపమని అ ర్ధిస్తున్నట్లు.
అందరికీ అర్ధమయింది. నీకు తెలుసా వసుంధర , ఈ రోజు మీటింగ్ లో నేను ప్రభాకర్ గారిని కూడా కలిశాను. చాలా సరదా మనిషి. మంచి ఇన్వెస్టిగేటర్. మా బార్ లో కొందరు పబ్లిక్ ఇంటరెస్ట్ కేసులు కూడా ఫైల్ చేస్తుంటారు. వాళ్ళే మీటింగ్ ఏర్పాటు చేస్తూ మిగిలిన లాయర్స్ తోటి కూడా డిస్కస్ చేస్తారు. ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా మేమందరం కూడా జాయిన్ అవుతుంటాము.
” మరి ప్రభాకర్ గారేందుకు వచ్చారు,” అన్నది వసుంధర.
“ఆయన , ఈ మధ్యన కొన్ని మురికివాడలను, ఎక్సటెన్షన్స్ ని, చిన్న చిన్న మర్కెట్స్ ని డిమాలిష్ చేస్తున్నారు కదా ప్రతి చోట. కృష్ణ లంకల దగ్గర జరిగిన డిమోలిష లో కొందరు చిన్న పోన్న వ్యాపారులు చాలామంది నిర్వాసితులయ్యారు. వాళ్ళచేత డిమాలిషన్ను వ్యతిరేకిస్తూ కోర్ట్ లో కేసు వేయించాడు ఆయన. చాలా మంచి రిపోర్ట్ తయారుచేశాడు. ఆ విషయమై ఆయన కూడా మా మీటింగ్ కి వచ్చాడు,” అంటూ ప్రసాద్ టాపిక్ ని మార్చడాయన. ఐ స్ క్రీమ్ తినడం అవగానే ప్రసాద్ అన్నాడు ,” మాకు సెలవిప్పించండి , మేమిల లేటుగా వెళితే మా రమాదేవి గారికి అనుమానం వస్తుంది.,” అన్నాడు నవ్వుతూ. మైత్రేయి కూడా లేచి ప్రసాద్ వెనకాతలే బయటి కొచ్చింది. వాళ్ళిద్దరినీ గెట్ దాకా వచ్చి వదిలేసి “ గుడ్ నైట్ ,” అని చెప్పి లోపలికెళ్ళి పోయారు లాయర్ దంపతులు.
ప్రసాద్ ,మైత్రేయి ఇల్లు చేరు కున్నారు. మైత్రేయి తన ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంది. ప్రసాద్ గురించి ఆలోచిస్తూ పడుకోవటానికి ఉపక్రమించింది. ప్రసాద్ కి మాత్రం గతం తాలూకు సంఘటనలు ఒకదాని వెంట ఒకటి గుర్తు కోస్తూ నిద్దర పోలేక పోయాడు.
(ఇంకావుంది)