మన మహిళామణులు -వుప్పలపాటి కుసుమకుమారి.

వుప్పలపాటి కుసుమకుమారి. హైదరాబాదు.
సామాన్య గృహిణి.
ఉస్మానియా యూనివర్సిటీ నుండి M.A, History, పద్మావతి మహిళా యూనివర్సిటీ నుండి కర్ణాటక సంగీతంలో M.A చేశాను.
యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశాను.  యోగా ఇన్స్త్రక్టర్. సంస్క్రత భారతి కోర్సులు కోవిద వరకు కంప్లీట్ అయింది. హోమియో డిప్లొమాచేశాను. నాచుట్టు పక్కలవారికి హోమియో సేవలందిస్తాను. Computer science, photography లో diploma చేసాను.

చిన్నప్పటినుండి చదువుకోవటం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంటుంది. చిన్నప్పుడు academically, bright గా ఉండేదాన్ని. అదీ కాకుండా ఆ రోజుల్లోనే స్పోర్ట్స్, inter College, inter university ఆడేదాన్ని. అన్ని activities లో participate చేసేదాన్ని.
ఆ రోజుల్లో ఆడవాళ్ళని డిగ్రీ చేయించటమే గొప్ప. డిగ్రీ కాంగానే పెళ్లి చేశారు. ఉద్యోగం చేయటానికి బయటికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. బాధ్యతలు బాగా ఉండేవి. అయినా సరే నాకున్న చదువు మీద ఉన్న ఆసక్తి వల్ల ఇద్దరు పిల్లల్ని, అత్తగారిని చూసుకుంటూనే MA, history, external గా చేశాను. యూనివర్సిటీలో మూడు ఫస్ట్ క్లాస్ లు అయితే, అందులో నాది కూడా ఒకటి. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే గడిపాను. ఒక ఫీల్డ్ అని కాదు. ఏదో ఒకటి నేర్చుకోవటం. Quest for knowledge బాగా ఉండేది. To keep myself busy, so that there is no time to be sad. సంగీతంలో సర్టిఫికెట్, డిప్లమా, ఎం ఏ అయిపోయింది. తర్వాత యోగ టీచర్ ట్రైనింగ్, టైపింగ్, ఎంబ్రాయిడరీ, ఫోటోగ్రఫీ, అభిరుచులు రకరకాలుగా ఉండేవి.
2015లో భయం భయంగా fbలో ఎకౌంటు తెరిచాను. అక్కడ నాకు వివిధ సంగీత, సాహిత్య సమూహాలతో పరిచయం ఏర్పడింది. పద్యాలు నేర్పే వాళ్ళు, గజల్స్ నేర్పేవాళ్ళు. ఆ గ్రూపుల ద్వారా, పద్యాలు నేర్చుకొని, తర్వాత గజల్స్ రాయటం నేర్చుకొని అలా సాహిత్యం జీవితానికి సర్వస్వం అయిపోయింది. అదీ 60 లలో. అలా నా దృష్టిలో FB ఒక నలంద విశ్వవిద్యాలయం, తంజావూరు గ్రంథాలయం.
ఇద్దరు అబ్బాయిలూ, విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి వారి వారి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెద్దబ్బాయి లక్ష్మీ శ్రీనివాస్ Capital One, executive Vice president, DC, చిన్నబ్బాయి, రాజేష్, Nyka, CTO, Delhi. పెద్దకోడలు రాధిక Meta Director. చిన్నకోడలు రమణి, Msc.
భువనవిజయం, పద్యాల తోరణాలలో విరివిగా అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నాను. వేమరాజు నరసింహారావుగారి స్మారక award వచ్చింది. పద్యపోటీలు, గజల్ పోటీలు, కథలు, కవితల పోటీల్లో అప్పుడప్పుడు బహుమతులు పొందటం జరిగింది.
సంగీతం, సాహిత్యాలంటే బాగా అభిరుచి. పాటలు రాస్తాను.  రెండు CD లు రిలీజు అయినయ్యి. ఎక్కువగా ఆధ్యాత్మికంగానే వుంటాయి. ఆధ్యాత్మికమైన వ్యాసాలు రాయడం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, పాటలు పాడటం వ్యాపకాలు. కథలూ, కవితలూ, దోహాలు, పద్యాలు, గజల్స్ రాస్తుంటాను. దాదాపు 400పైగా గజల్స్ వ్రాసాను. మూడు శతకాలు, ‘రామవాక్కు’ ఆధ్యాత్మిక శతకం, ‘ కౌసుమం’ గజల్ సంకలనం release అయినయ్యి. అవధానాల్లో ప్రచ్ఛకురాలిగా పాల్గోవటం, గజల్ ముషాయిరాల్లో పాల్గోవటం వ్యాపకాలుగా సాగిపోతున్నాయి!


‘శ్రీ గురుచారిత్రకోదాహరణ కావ్యం’,
శత ఛందస్సులలో ‘మానవా!’ మకుటంతో సుభాషిత శతకం, అనంత ఛందం గ్రూపు సభ్యులు వందమంది కవులు కలిసి రాసిన శతకసంకలనంలో వ్రాసిన 100 ఛందస్సులతో పద్యమాల, ప్రజపద్యం వారు నిర్వహించిన నాటక స్పర్ధలో ప్రత్యేక బహుమతి పొందిన, సాంఘిక పద్య నాటకం, “దివ్యౌషధం!”
ఈ నాలుగు కలిపి ‘సాహితీ చతుర్భుజి’ అన్న పేరు మీద నా సంకలనం 16-09-2024న, హైదరాబాదులో ఆవిష్కరించుకున్నాను.
అవధానాల్లో పృచ్ఛకురాలిగా ఉండటం, గజల్ ముషాయరాయల్లో పాల్గొనడం ముఖ్యమైన వ్యాపకాలు. ఇప్పుడు ఈ రెండే నన్ను బాగా ఎంగేజ్ చేస్తున్నాయి. I am happy with myself. I am busy with myself.
జ్ఞానం అనంతం!సముద్రమంత ఉంది. మనకున్న ఆయుః ప్రమాణం మాత్రం అల్పం. కాబట్టి క్షీర నీర న్యాయంగా, కాలాన్ని వృధా పరచకుండా, మనకి కావాల్సింది స్వీకరించుకుంటూ, సాగిపోవటమే, జీవితం అనిపిస్తోంది

తృప్తితో జీవితంగడపాలి అంటారామె,

ఫోన్ నెంబర్9705009254

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వింత ప్రపంచం

అహంకారం