ఎడారి కొలను 

ధారావాహికం – 38వ భాగం  

(ఇప్పటివరకు : మైత్రేయి తో టి  గుంటూర్ లో వాళ్ళింటికి చేరు కున్న కాంతమ్మ గారికి మైత్రేయి తల్లితండ్రుల  ధోరణి  కష్టమనిపించింది. మైత్రేయికి  జరిగిన విషయాలు తెలిస్తే తనని తన తల్లి తండ్రులు అర్ధం చేసుకుంటారన్న ఆశ, అడియాసే అయింది. )

  సమన్స్ అందాయన్న విషయం మైత్రేయి రాజ్య లక్ష్మీ కి  ఫోన్లో చెప్పింది.

“ రాజ్యలక్ష్మీ , వసుంధర ఎప్పుడు వస్తున్నది ,” అడిగినది.

“ జూన్  ఆరు కల్ల  వచ్చేస్తారు మేడమ్ . మీ హియరింగ్ డేట్ జూన్ పదిహేను కదా. అప్పటికల్లా  ఇక్కడ ఉంటారు. నిన్ననే ఫోన్ చేసి మాట్లాడను. మిమ్మలనేమి భయపడొద్దని చెప్పారు,” అని చెప్పింది.

కాస్త ఊపిరి  పీల్చుకున్నట్లయింది ఆ మాటతో, “వసు వచ్చేస్తుంది. ఇంక తానే చూసుకుంటుంది అన్నీ విషయాలు,” అనుకొంటే మనసుకెనతో ఊరటగా అనిపించింది. అమ్మ నాన్నవాళ్ళ వైఖరి తాను ఊహించనిది కాదు.  ఇందులో వాళ్ళ తప్పు ఏమి లేదు. అంతా పరిస్తితుల ప్రభావం. ఇలా అనుకుంటే తనకెవ్వరు లేరని, తనేదో సమస్యల వలయంలో చిక్కుకొని భాధపడుతున్నానని గాని మైత్రేయి కి అనిపించటం లేదు. కాలేజ్ లో కూడా ఎవరయినా కాస్త తేడాగా మాట్లాడిన . వ్యంగంగా    మాట్లాడిన తను అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు సమస్యలేలా ఉంటాయో వీళ్ల కేం తెలుసు. ఎంత మంది జీవితాంతం పోరాడుతూనే ఉంటారు. కొందరు తమ జీవితం తోనే పోరాటం చేస్తుంటే, మరి కొందరు సమాజలో మార్పు కోసం, మరి కొందరు ఆశయాల కోసం. ఇదొక ఎడతెగని జీవన పోరాటం. గెలుపు, ఓటమి అనేవి  ఉండవు. గెలిచామన్న సంతోషం అసలే ఉండదు. ఎందుకంటే ఆ పోరాటం మళ్ళీ మొదలవుతుంది మరొక రూపం లో.  ఆ పోరాటం లో అనుభవించిన బాధ, కష్టం ముందు గెలిచిన ఈ సంతోషం చాలా చిన్నది.  ఆ అనుభవం ముందు మన జీవితమే చాలా చిన్నగా అనిపిస్తుంది. అనుకోని సంఘటనలు , హతాత్పరిణామాలు ఎటునుంచి ఎలా వస్తాయో తెలియదు , వాటిని ఎదుర్కోవాల్సిందే.

ఎవరికోసం ఈ కాల గమనం ఆగదు. అలాగే సమయం యొక్క  వలయంలో చిక్కుకున్నాక బయటపడడం కూడా అంతే కష్టం. మైత్రేయి జీవితం కూడా అంతే. ఆమె కు హియరింగ్ డేట్ వచ్చిన సంతోషం ఒక్కరోజు కూడా నిల్వ లేదు. సుబ్బారావు  మైత్రేయి ని వెతుక్కుం టూ  ఆమె  పనిచేస్తున్న కాలేజీ దగ్గరికి చేరాడు.

కాలేజీ గేట్ దగ్గర ఉన్న వాచ్ మాన్  సుబ్బారావు ని ఆపి “మీరు ఎవరికోసం వచ్చారు ?”అని అడిగాడు.

“నేను మీ మైత్రేయి మేడం భర్తని “”. అని అన్నాడు.

వాచ్ మాన్  అనుమానంగా “ మైత్రేయి మేడం గారికి తెలుసా సర్, మీరు వస్తారని ?” అని అన్నాడు

“ ఆమెని కలవటానికి నాకు అనుమతి  కావాలా? ఆమె భర్త నని మీ విజిటర్స్  రిజిస్టర్ లో రాసుకోండి”  అంటూ రిజిస్టర్ లో సైన్ కూడా చేయకుండా  బరబరా స్టాఫ్ రూమ్ వైపు నడిచాడు. వాచ్ మ్యాన్    అతని ధోరణికి గాభరాగా  ప్రిన్సిపాల్ రూమ్ వైపు పరిగెత్తు కెళ్ళాడు.

సుబ్బారావు నేరుగా స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక చైర్ మీద కూర్చొని చుట్టూ చూస్తూ  , అక్కడే కొద్దీ దూరం లో కూర్చొని ఉన్న వైదేహి గారిని   చూస్తూ , “నేను మైత్రేయి కోసం వచ్చాను . ఆమె ఎక్కడి కెళ్లింది “, అని అడిగాడు

ఆమె కూడా కాస్త అనుమానంగా చూస్తూ “మీరు ఇదివరకు ఎప్పుడు రాలేదే ?”అని అడిగింది.

‘మీకు ఏమి తెలియదన్న మాట “, ఆమెను రానివండి “అన్ని విషయాలు మీకే అర్ధమవుతాయి”. అంటూ టేబుల్ మీదకు కా ళ్ళు పెట్టి చాల అసభ్యంగ కూర్చున్నాడు.

అప్పుడే మైత్రేయి క్లాస్ ముగించుకొని స్టాఫ్ రూమ్ వైపు వస్తుండగా రాజన్ , ఫిజిక్స్ లెక్చరర్ , ఆమె ను కలిసి మాట్లాడుతూ స్టాఫ్ రూమ్ వైపుకి ఆమె తో కలిసి వచ్చాడు. దూరం గ మైత్రేయి రావడం కనిపిస్తున్నది. ఆమె చాల సంతోషంగా అతనితో కబుర్లు చెబుతున్నట్లున్నదని చాల కసిగా సుబ్బారావు మనసులో అనుకొంటూ కింది పెదవిని కొరుక్కోవడం వైదేహి గమనించింది .

స్టాఫ్ రూమ్ లోకి వస్తూనే అలా కాళ్ళు పైకి పెట్టి కూర్చొని ఉన్న సుబ్బారావు ని చూసి ఆమె అవాక్కయింది. ఆమెలో భయం తో కూడిన కంపనలు మొదలయ్యాయి.

“ఎందుకొచ్చారు?”అని మాటమాట కూడబలుక్కొంటూ  అతన్ని అడిగింది .

“ ఉరికినే, నిన్ను చూసిపోదామని. మన కేస్ హియరింగ్ 15 జూన్ అని చెప్పడానికి వచ్చాను. తయారుగా ఉండు,” అంటూ కాస్త వెకిలిగా నవ్వుతూ,  వైదేహి గారి వైపు చూసి  ,” మీరు పెద్ద వారు, అనుభవజ్ఞులు. ఈమెకు  భర్తతో కాపురం చేయమని చెప్పండి. కోర్ట్  గొడవలు వదిలేయమని చెప్పండి. కోర్ట్ లో కేసులు నడుస్తాయి గాని కాపురాలు కాదు. ఆమెకు కాస్తంత గడ్డి పెట్టండి, ఇప్పటి కయిన బుద్ది తేచ్చుకుంటుందేమో చూద్దాము ,” అంటూ విస విస వెళ్ళిపోయాడు.

అతను మాట్లాడుతున్నంత సేపు మైత్రేయి ఓర్పుగా తలదించుకొని నిలబడి ఉన్నది. వైదేహి మైత్రేయి దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేసి , టేబల్ దగ్గరున్న కుర్చీదగ్గరికి తీసు కెళ్ళి కూర్చోబెట్టి,” మైత్రేయి “ నువ్వేం తప్పుచేశావాని అలా తలవంచుకోవాలి. మా అందరికీ తెలుసు నువ్వెంత గా బాధపడుతున్నావో. మేమేవ్వ రం అతని మాటలను పట్టించుకొము.  విపరీత బుద్ధి కాకపోతే కోర్ట్  లో కేసు  నడుస్తుండగా అతనిలా  నిన్ను వేధించడం అతనికే మెడకు చుట్టు కుంటుంది,”  అంటూ మాట్లాడింది.

“ అవును మైత్రేయి గారు, మీ హాసబెండ్  లాంటి వారికి మంచి చెడు అర్ధం కావు, ఎంత సేపు ఎదుటి వాళ్ళను బాధపెట్టి సంతోష పడడ ము, అదే  హీరోయిజం  అనుకోవడం,” అన్నాడు రాజన్.

అప్పుడే అక్కడకు వచ్చిన ప్రిన్సిపల్ ,” మైత్రేయి నువ్వు నా రూమ్ కి రా ,” అని చెప్పి వెళ్ళిపోయింది. వాచ్ మాన్ ఆమె వెనకాతలే అక్కడకు వచ్చాడు. వెళ్ళుతున్న వాడిని ఆపి,

“ఏమయింది సడన్ గా ప్రిన్సిపల్ మేడమ్ మైత్రేయి గారిని తన రూమ్ కి రమ్మన్నారు,” అంటూ ఆరా  తీశాడు రాజన్ .

“ ఏమి లేదు సార్, మైత్రేయి మేడమ్ గారి హాసబెండ్ వచ్చారు కదా , ఆ విషయం తెలుసుకుందా మని , మేడమ్ గారు  మైత్రేయి గారిని పిలిచారు,” అని వివరించాడు.

అప్పుడు వైదేహి కల్పించుకొని ,  “మైత్రేయి త్వరగా వెళ్ళు, కానీ ఆమె అన్నీ అర్ధం చేసుకుంటుంది, నిర్భయంగా మాట్లాడు. ఇందులో నీ తప్పేముంది,” అంటూ ధైర్యం చెప్పి పంపించింది.

మైత్రేయి ప్రిన్సిపల్ ఆఫీస్ లోకి అడుగు పెట్టింది .

“ రండి మైత్రేయి,” అంటూ కాస్త అధికారపూరితమైన కంఠంతో పిలిచింది  ప్రిన్సిపల్ ఇందిరా దేవి.

“ నమస్తే మేడమ్,  నన్ను పిలిచారు,” అంది చాలా విధేయతతో.

“ ముందు మీరు కూర్చోండి ,” అంటూ చైర్ చూపించింది. కాలింగ్ బెల్ కొట్టి ‘రామయ్య’  అని పిలిచింది. బయట స్టూలు మీద కూర్చొని ఉన్న రామయ్య ఆదుర్దాగా లోపలకి వచ్చాడు. రెండు గ్లాసుల మంచి నీళ్ళు తెచ్చి పెట్టండి.,” అన్నది అతను వెంటనే శుబ్రంగా కడిగిన రెండు గాజు గ్లాసుల నిండా  కూలర్ నీళ్ళు నింపి తెచ్చి అక్కడ పెట్టాడు. “ మీరిక వెళ్ళండి. బయటి నుండి ఎవ్వరిని ఒక గంట దాకా లోపలకి పంపించకండి. లోపల ఎవరున్నారు అని అడిగిన చెప్పకండి. మేడమ్ బిజీ అని మాత్రమే చెప్పండి,” అంటూ స్ట్రిక్ట్ గా చెప్పింది.

అతను వెళ్ళి పోతు  ప్రిన్సిపల్ రూమ్ విండో కరటన్స్ ని కూడా సరి చేసి , తలుపు వెసు కొని వెళ్ళిపోయాడు.

“ మైత్రేయి! ఇప్పుడు చెప్పండి అసలేమయింది? ” అన్నది. కొద్ది సేపు మైత్రేయి ఏమి మాట్లాడలేక పోయింది.

“ నాకు కొంత తెలుసు . మీరేదో మీ హాసబెండ్ మీదనే కేసు పెట్టారని. అవన్నీ మీ సొంత విషయాలు, కానీ ఈ రోజు అతను స్టాఫ్ రూమ్ లో కొచ్చి  ఆడ్  గా బిహావ్ చేశాడని తెలిసింది. అంతే  కాదు రిజిస్టర్ లో కూడా సైన్ చేయలేదు. దీన్ని బట్టి నేనర్ధం చేసుకోగలను అతని నేచర్. మీకు నేనమయిన సాయం చేయగలన?” అని సాలోచనగా మైత్రేయి వైపు చూసింది.

“  నేను నా భర్త మీద పెట్టిన కేసు హియరింగ్ 15 జూన్ మేడమ్. ఇతను నన్ను కాంప్రమైజ్   చేయించాలని చూస్తున్నాడు. అందువల్ల అతనికి పెనాల్టీ గాని శిక్ష గాని ఉండకుండా చేసుకోవచ్చని ఆశ. కానీ నేనందుకు రెడీ గా లేను మేడమ్. ఇవాల్టి విషయమే కాదు ఇంతకు ముందు కూడా నన్ను  ఎలాగాయిన వొప్పించాలని చాలా ప్రయత్నాలు చేశాడు,  లక్కీ గా నాకు వసుంధర లాంటి లాయర్ , కాంతమ్మ గారి లాంటి పెద్దవాళ్ళ అండ ఉండడంతో బయట పడగలిగాను,” అంది.

“ కాంతమ్మ గారు నీకు సపోర్ట్ చేశారంటే, నీకు స్వయం గా ఆ దేవి అండగా ఉన్నట్లు, నువ్వు నిర్భయంగా  ఉండవచ్చు. అలాగే నేను కూడా విన్నాను లాయర్ వసుంధర గురించి , వెరీ స్మార్ట్ లాయర్. అంత మంచి వాళ్ళ తోడు నీకుంటే ఇంకెందుకు భయపడుతున్నావు మైత్రేయి, నిశ్చింతగా ఉండు. ఇంకే దయిన సహాయం కావలంటే అడుగు నీకెప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. మొహమాట పడకు అడగటా నికి, చెప్పడానికి. మళ్ళీ నీ హాసబెండ్ కాలేజి  లోకి ఇలా వచ్చి గొడవ చేయకుండా నేను చూసు కుంటాను,” అని భరోసా ఇచ్చి ,” మీరిక వెళ్ళండి. కావాలంటే ఇంకొన్ని రోజులు లీవ్ తీసుకోండి,” అన్నది ప్రిన్సిపల్ ఇందిరా దేవి.

“ ఇప్పుడు లీవ్ అవసరం లేదు మేడమ్. నాకు కాలేజీలో ఉంటేనే ధైర్యం గా ఉంటుంది. నాకు అవసరమయినప్పుడు అడుగుతాను,” అంటూ లేచి వీష్ చేసి ప్రిన్సిపల్ రూమ్ లోనుండి  బయటి కొచ్చింది.

లాంగ్ బెల్ కావడం తో చాలామంది స్టాఫ్ వెళ్ళి పోయారు. రాజన్,  వైదేహి మాత్రం  ఆమెకోసం  ఎదురు చూస్తూ స్టాఫ్ రూమ్ దగ్గరే నిలబడి ఉన్నారు. మైత్రేయి ని చూస్తూనే,

”మైత్రేయి పద నేను,  రాజన్ నిన్ను  ఇంటి దగ్గర దిగబెట్టి వెళతాము,” అని అన్నది. ఇంత లోకి రాజన్ పార్కింగ్ లో ఉంచిన తన మారుతికార్  ని బయటికి తీసి స్టార్ట్ చేసి, ఎదురుచూస్తున్నాడు.  మైత్రేయి, వైదేహి కారు ఎక్కగానే కారుని ముందుకి ఉరికించాడు రాజన్.  కారు గేటు బయటికి రాగానే , దూరంగా ఉన్న టీ బంకు దగ్గర నిలబడి సిగరెట్టు కా లుస్తున్న సుబ్బ రావు కనిపించాడు. అతన్ని చూసిన కూడా చూడనట్లే తల పక్క కి  తిప్పి ఇంకో వైపు పుకి చూస్తూ కూర్చుంది మైత్రేయి. మైత్రేయి ని ఇంటిదగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళి పోయారు.

లోపలకి వెళ్ళిన మైత్రేయి  ఆనందంతో   ఉక్కిరి బిక్కిరి అయింది. ఎదురుగా వసుంధర కనిపించింది. వరండాలోనే కూర్చొని ఉన్నది. పక్కనే పంతులు గారు ఇంకోవైపు రమాదేవి నిలబడి ఉన్నారు. కొద్ది దూరంలో స్తంభానికి అనుకోని నిలుచుని ఉన్న ప్రసాద్ కనిపించాడు.

‘వసు’ అంటూ ఆనందంతో పరిగెత్తినట్టు వెళ్ళి ఆమెని హత్తుకుంది మైత్రేయి. వసుంధర ఆమె ని పొదివిపట్టుకొని , “ఏమిటే ఇలా అయిపోయావు ?” అంది ఆప్యాయంగా.

“ నేను బాగానే ఉన్నాను, ముందు నీ విషయాలు చెప్పు. ఎప్పుడొచ్చావు?” అంటూ “ఇంటికి తాళం తెరుస్తూ ,” రావే లోపలికెళ్ళి మాట్లాడుకుందాము, “ అంటూ చెయ్యి పట్టుకొని వసుంధరని లోపలకు తీసుకెళ్లింది. వెనకాలే అక్కమ్మ కూడా లోపలికెళ్ళి ,” శానా  సంతోషం గ ఉన్నది అమ్మ గారు, మీరు వచ్చేసారు, ఇక మైత్రేయమ్మ కి ఏ  కష్టము రాదు,” అని అన్నది.

“ అంటే ఏమిటి అక్కమ్మ , నేను లేని సమయంలో ఏదయినా జరిగిందా?” అంది సూటిగా.

“ అ బ్బె అదేం లేదే ! అక్కమ్మ వొట్టి గాభరా మనిషి, నిన్ను  చూసిన సంబరంలో అ  లాగన్నది, అంతే  కదు అక్కమ్మ,” అంటూ  దేనిగురించి మాట్లాడవద్దని అక్కమ్మకు సైగ చేసింది.

“ అక్కమ్మ నువ్వెళ్ళి టీ పెట్టుకురా!” అని అక్కడి నుంచి పంపేసింది.

వసుంధరకు మాత్రం ‘ఏదో జరిగిందని పించింది, ఇప్పుడే తనకు చెప్పదలుచుకోలేదు తాను, కానీ కొద్దిరోజులు ఎదురు చూద్దాం, తానే చెపుతుందిలే’ అని తన మనసులోనే అనుకోని ఏమి అర్ధం కానట్లు ,” ఇప్పుడు చెప్పు ఈ సెలవల్లో నువ్వేం చేసావు. ఎక్కడికయినా వెళ్ళావా లేక ఇక్కడే కూర్చొని ఆలోచిస్తూ గడిపేసావా,” అంది. “ లేదే ! నెను ఎక్కడికి వెళ్ళలేదు, ఎదో పుస్తకాలు చదువుతూ గడిపేశాను,” అంటూ కాస్త నెర్వస్ గ నవ్వింది.

ఇంతలోకే అక్కమ్మ టీ తో పటు కొన్ని బిస్కెట్స్ కూడా పళ్లెం లో పెట్టి తెచ్చింది.

మైత్రేయి అన్నది,” అక్కమ్మ , ప్రసాద్ గారిని కూడా పిలువు , టీ తాగడానికి”

అక్కమ్మ వెళ్లి “ ప్రసాద్ బాబు, మీరు కూడా రండి టీ తాగడానికి, మైత్రేయమ్మ పిలుస్తున్నది,”  అని చెప్పింది.

రూమ్  లోంచి బయటికొచ్చిన ప్రసాద్ దగ్గరికెళ్లి “ సూడు బాబు , మైత్రేయమ్మకు జరిగిన పోలీస్ యవ్వారం గురించి ఇప్పుడేమి మాటాడబోకు, నాకు ఏమి మాటాడవద్దని సైగ చేసింది,” అని రగస్యం గ అతని చెవిలో చెప్పింది.

ప్రసాద్ నవ్వి ,” పిచ్చి అక్కమ్మ , నువ్వు నేను చెప్పక పొతే ఆమె తెలుసుకోలేదను కున్నవా, ఆమె చాల తెలివయిన లాయర్,” అంటూ లోపలికొచ్చి వసుంధర పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అందరు టీ తాగుతూ కొద్దీ సేపు కబుర్లు చెప్పుకున్నారు. వసుంధరని   ఆమె లండన్ ట్రిప్ గురించి అడిగి మరి తెలుసుకున్నాడు ప్రసాద్.

వసుంధరకి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడి ,” నేనిక వెళ్తానే మైత్రి , వెంకటేశ్వర్లు గారు ఎక్కడికో పోవాలట , కారు కోసం వెయిట్ చేస్తున్నారు,” అంటూ తన హ్యాండ్ బాగ్ లోంచి మంచి కోల్డ్ క్రీమ్ , కొన్ని ఇంపోర్టెడ్ చాకోలెట్స్ తీసి మైత్రేయి కి ఇచ్చింది. వెంటనే బై చెప్పి వెళ్ళిపోయింది.

అప్పుడు ప్రసాద్ అడిగాడు,” మైత్రేయి గారు , మీరు వసుంధరకు జరిగిన విషయాలేవీ ఎందుకు చెప్పలేదు.”

“ ఇప్పుడే ఎందుకని చెప్పలేదు. నిదానంగా చూపొచ్చులే అనుకున్నాను,” అన్నది.

“కేసు హియరింగ్ డేట్ వచ్చిందా? ఎప్పుడు?” అడిగాడు

“ జూన్ 15 న,”  అని అన్యమనస్కం గ సమాధానం చెప్పింది.

అది గమనించి,” ఏమైంది?” అడిగాడు అతను .

“ ఎప్పటి విషయమే! అతను మళ్ళి  ఈరోజు కాలేజ్ కి వచ్చాడు,”

“ ఎం చేసాడు కాలేజీలో?” పొడిగించాడు.

“ ఎం చెప్ప మంటారు! చాల అసభ్యంగ మాట్లాడాడు. అతని రాక తెలిసిన ప్రిన్సిపాల్ నన్ను ఆఫీస్ కి పిలిచి మాట్లాడింది.  అందరు తమకు అర్ధమయిన విధంగా నా ఈ స్థితి కి స్పందిస్తున్నారు. కొందరు జాలి పడుతున్నారు, కొందరు అనుమానంగా చూస్తున్నారు. కొందరు భరోసా ఇస్తున్నారు. ఎవరు ఎలా అనుకున్న , ఈ రోజు అతని రాక మరింతగా వారి ఊహలు నిజమని నమ్మటానికి  అవకాశం ఇచ్చిందేమో ననిపిస్తున్నది,” అంది బాధగా.

ప్రసాద్ కి ఆమెకి ఎం చెప్పాలో అర్ధం కాలేదు. కొందరు చివరి దాక తోడుంటే, కొందరు చివరిదాకా వేధిస్తూనే ఉంటారు. సుబ్బారావు లాంటి వాళ్ళు రెండో రకం. అలాటి వాళ్ళు జీవితంలో తారస పడితే , ఎప్పుడు జాగర్తగా ఉండాల్సిందే ,’ అని అనుకున్నాడు.

ఇంతలోకే మైత్రేయి ఫోన్ మోగింది.

“ హలో,” అంది

“నేనే , లాయర్  వసుంధర వచ్చిందని సంబరపడుతున్నావా ,” అన్నాడు అవతలి వ్యక్తి ఫోన్ లో. ఆ కంఠం వింటూనే వెలతెలా పోయింది మైత్రేయి మొహం. అది గమనించిన ప్రసాద్,

“ ఎవరండీ ఫోన్ లో,” అన్నాడు.

ఫోన్ కి చేయి అడ్డం పెట్టి లోగొంతుకలో “ సుబ్బారావు,” అన్నది ఆమె.

“ ఏంటి ఏమి మాట్లాడడటం లేదు. వాడుకూడా నీ పక్కనే ఉన్నడా ,”

“ ఎవరిగురించి అలా అసభ్యంగా మాట్లాడుతున్నావు ,” అంది కోపంగా.

“ అదే నీ తోక , నీ బాడీగార్డ్ , నీ పూజారి , బ్లా, బ్లా, బ్లా …… ,”

“ కాస్త మాటలు జాగర్తగా రానియండి. అతని జోలికెందుకెళుతున్నారో నాకయితే అర్ధం కావటం లేదు. ”

“ వాడి అండ , వసుంధరాదేవి ,ది గ్రేట్ లాయర్ తోడు చూసుకొని నువ్వు రెచ్చి పోతున్నావు కదా . ”

“ మీరు సభ్యంగా ప్రవర్తించివుంటే ఈ రోజు చూడాల్సిన స్థితి మీకుండేది కాదు , నాకి అవమానాలుండేవి కాదు. ఇలాటి సున్నితమయిన విషయాలను అర్ధం చేసుకోగల మనస్సు

మీకు లేదని ఎప్పుడో అర్ధమయింది, ఇప్పుడెందుకు ఫోన్ చేసారు,”

“ నీ గొంతు విందామని ,”

“ విన్నారుగా , పెట్టేయండి ,”

“అలాకాదు మైత్రేయి, మనం రాజి చేసుకుందాము ,  నేను నిన్నుఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను, నన్ను నమ్ము,” అంటూ ప్రాధేయపడుతున్న ధోరణిలో మాట్లాడాడు.

“ మిమ్మల్ని నమ్మటం అంటే నేను ఆత్మహత్య కు సిద్దమయినట్లే , ఇక ఏదయినా కోర్ట్ లోనే తేల్చుకుందాము ,” అంటూ ఫోన్ పెట్టేసింది.

మనసంతా వికలమయిపోయింది.

“ ఎందుకంత బాధపడుతున్నారు. అతని గురించి తెలిసిందే కదా! రిలాక్స్ అవండి ,” అంటూ చెప్పబోయాడు ప్రసాద్.

“ నాకే స్వాంతన మాటలు అవసరం లేదు.దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. మీరెందుకు నా విషయంలో తలా దూరుస్తున్నారు. నా చావు నేను చస్తాను, ప్లీజ్ !” అంటూ చేతులు జోడించింది  మైత్రేయి.

ప్రసాద్ మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు.

“ అక్కమ్మ ఆ తలుపు వేసి రా ,” అంది. అక్కమ్మకు   కూడా మైత్రేయి మొహం చుస్తే కాస్త భయం కలిగింది.

“ ఏమయిందమ్మా ?” అడిగింది కాస్త అనునయంగా. మైత్రేయి కి ఏడుపు ఆగలేదు. చాలాసేపు చేతుల్లో మొహందాచుకొని అ లా ఏడుస్తూ ఉంది పోయింది. కొద్దీ సేపటికి తేరుకొని ,

“అక్కమ్మ, ప్రసాద్ గారి లాంటి మంచి వ్యక్తి ని కూడా ఆ సుబ్బారావు వదిలిపెట్టడం లేదు. క్రితం సరి, అతన్నీ  షాపులో   చెంపమీద కొట్టాడు. నేను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది.   ఈ రోజు చాలా అసహ్యంగా మాట్లాడాడు అతని గురించి.  అతని నుండి ఈ ప్రసాద్ గారి నెల దూరంగా ఉంచాలో నాకర్ధం కావటం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాటి  ప్రమాదం తెచ్చి పెడతాడో! ” చెప్పింది.

“పిచ్చి తల్లి , అందుకే ప్రసాద్ బాబు మీద అంతలా విరుచుకు పడ్డావు. బాబు కేమి కాదమ్మా. అయన జోలికి ఈయన వెళ్ళలేడు. ఆలా అయితే మాత్రం సుబ్బారావు గారిని ఆ దేవుడు కూడా రచ్చించలేడు, మీరేమి బెంగ పడొద్దు,” అంటూ సముదాయించింది.

“ రేపు నేను ప్రసాద్ గారికి నా మొహమెట్ల చూపించాను అక్కమ్మ, ఆవేశంలో అతని మీద  విసుక్కున్నాను,” అన్నది కళ్ళు తుడుచుకుంటూ.

“ ఆ సంగతి నాకు వదిలేయండమ్మా, నేను ప్రసాద్ బాబు గారితో మాట్లాడుతానుగా,” అంటూ భరోసా ఇచ్చింది. పక్కసద్ది మైత్రేయి ని పడుకోమని తాను పడుకున్నది.

(ఇంకాఉన్నది)                                                 

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

” నేటి భారతీయమ్ కాలమ్”

వర్థనమ్మ కష్టాలు