మన మహిళ మణులు- దీపా నిదాన కవి

సహజంగా రేడియో అనగానే అందరిలో ఒకలాంటి కుతూహాలo మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి నాకు కూడా రేడియో అంటే చాలా పిచ్చి. మా ఇంట్లో నా చిన్నప్పుడు నేను స్కూల్ కి వెళ్లే టైం లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి అంటూ సీత గారు రావు గారు వచ్చేవాళ్ళన్నమాట అది విన్నప్పుడు అనిపించేది నాకు అబ్బా ఎంత బాగుంది వీళ్ళ గొంతు నేను కూడా పెద్దయ్యాక వీళ్ళలా రేడియోలో మాట్లాడితే బాగుండే అని అనుకున్నాను. మా తండ్రిగారు నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు శ్రీ త్యాగరాయ సంగీత నృత్య కళాశాల లో సంగీతం నేర్పిస్తే బాగుంటుంది మా పాపకు అనుకొని, నన్ను అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అలా పాఠశాల స్థాయి నుండి ఇంటర్ కాలేజ్ స్థాయిలో, ఇంజనీరింగ్ వరకు ఇలా నేను పాటలు పాడి బహుమతులు గెలుచుకోవడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల స్థాయిలో కూడా నేను శ్రీ సరస్వతిశిశు మందిర్ లో చదవడం మూలాన చిన్మయానంద మిషన్ వాళ్లు కండక్ట్ చేసిన భగవద్గీత శ్లోకాలు పోటీలో కూడా ప్రథమ బహుమతి లో నిలిచాను. ఇక నేను నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక చాలా చోట్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయడం జరిగింది. అదే క్రమంలో ఒకరోజు ఇలా ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్లు కావాలి అని ప్రకటన మా నాన్నగారు వినడం జరిగింది, అలా నువ్వు కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని మా తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో నేను అప్లికేషన్ వేయడం జరిగింది. సో ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది ఆడిషన్ కి పిలిచారు వాళ్ళు నా వాయిస్ ని మాత్రమే కాదండి నా రైటింగ్ ఎబిలిటీని కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనం ఎలా స్క్రిప్ట్ ని రాయిగలమా లేదా అనే దాన్ని కూడా వాళ్ళు చాలా గట్టిగానే పరీక్షించడం జరిగింది .అలా ఉగాది రోజు నేను నా మొదటి ప్రోగ్రాం ని ఆలిండియా రేడియోలో యువ వాణి తెలుగులో ఇవ్వడం జరిగింది. ఆరోజు నా ఆనందానికి అవధులు లేవు నా తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. సో అలా మొదలైన నా రేడియో ప్రయాణం చాలా కొద్ది వ్యవధిలోనే రేడియో జాకీగా ఎఫ్ఎం 101.9MHz రేడియో జాకీగా అవకాశం రావడం ఇలా పదహారేళ్ల నా ప్రస్థానం ఆల్ ఇండియా లో ఇంకా కొనసాగుతుంది.

నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఉద్యోగం చేయడం జరిగింది అలా చేస్తూనే ఆల్ ఇండియా లెవెల్ లో ఇంజనీరింగ్ విభాగంలో గేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ లో నాకు సీట్ రావడం జరిగింది. సో త్రు గేట్ నేను నా పీజీ ని కంప్లీట్ చేశాను.ఆల్ ఇండియా రేడియో తో అసోసియేట్ కావడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది ఎందుకంటే మన వృత్తిని మనం ఒక వైపు చేసుకుంటూ ప్రవృత్తిగా రేడియో జాకీగా కంటిన్యూ కావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది .వృత్తిరీత్యా నేను ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకురాలుగా చేయటం జరిగింది. అంతేకాకుండా నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో Ph.D థీసిస్ సబ్మిట్ చేయడం జరిగింది.
నా తల్లిదండ్రులు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఆర్ వెంకటేశం గారు విశ్రాంత ఆచార్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, మా తల్లిగారు శ్రీమతి నిదానకవి లలిత గారు. తల్లిదండ్రులు పిల్లలు బాగోగులు కోరుకోవడం అనేది జనరల్ గా జరుగుతూనే ఉంటుంది కానీ మా తల్లిదండ్రులకు మేము ఆరుగురు సంతానం ఆడబిడ్డలు అయితే పిల్లలకు చదువుతోపాటుగా లలిత కళలు కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించిన మా తల్లిదండ్రులు మా ఆరుగురు అక్కాచెల్లెళ్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళను నేర్పించడం జరిగింది. ఒకరికి వీణ , ఒకరికి కూచిపూడి నృత్యం, అలా నాకు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్పించారు.నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు శ్రీ నూకల చిన సత్యనారాయణ గారి మేనల్లుడైన శ్రీ అన్నాజీ రావు గారి దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం జరిగింది. అక్కడ సర్టిఫికెట్ కోసం నేను శ్రీ త్యాగరాజ సంగీత నృత్య కళాశాల ఓల్డ్ సిటీ లో నేర్చుకున్నాను, కాలక్రమమైన పై చదువులు చదువుతున్నప్పుడు ఈ శాస్త్రీయ సంగీతాన్ని ఎంత ప్రయత్నించినా పూర్తి చేయలేకపోయాను. ఆ తర్వాత నాకు పిజి కంప్లీట్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తాడని….
చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉంటాయి నమ్మడానికి ఎంత బాగుంటుందో అని ప్రతి అమ్మాయి కలలు కన్నా ఆ కలలో రాకుమారుడు నా జీవితంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది ఆ తర్వాత నా జీవిత ప్రయాణంలో నా తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీహెచ్డీ లో చేరటానికి నా భర్త
కె వేణుగోపాల్ గారి సహకారం ఎంతో ఉంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా పెళ్లినాటి ప్రమాణాలను అక్కడే వదిలేయకుండా నా ప్రతి ప్రయాణంలో తన పాత్ర ఎంతో ఉంది. పెళ్లి తర్వాత నేను సంగీతంలో డిప్లమా ప్రథమ సంవత్సరం శ్రీ పోలకి రాజు గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది, ఆ తర్వాత నా ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన ఘట్టం, మహిళ నుంచి పరిపూర్ణ మహిళగా మారే ఆ క్షణం నా జీవితంలో రానే వచ్చింది. నా జీవితంలోకి నా కవల పిల్లలు జాగృత్ మరియు జిజ్ఞాస్ రాకతో నా వృత్తి అధ్యాపకురాలి నుండి పరిపూర్ణ మహిళగా మారింది. ఇక నా ప్రవృత్తి అయిన రేడియో జాకీ నీ కంటిన్యూ చేస్తూ వస్తున్నాను.

దీపా కుటుంబం

ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా పనిచేయడం మూలాన పలు సంస్థల అధికారులను ఇంటర్వ్యూ చేయటం జరిగింది .కొన్ని ప్రదేశాలకు వెళ్లడం ఆ ప్రాంతాల యొక్క ఉనికిని తెలుసుకోవడం స్కూల్స్, కాలేజెస్ సంస్థలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఇంటర్వ్యూ చేయటము చాలా చాలా సంతోషాన్నిచ్చాయి ఎన్నో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఆల్ ఇండియా రేడియోలో ఆర్జే గానే కాకుండా ఇప్పుడు నేను ఫ్రీ లాన్సర్ గా చాలామందికి బుక్ రిలీజింగ్ ఫంక్షన్స్, స్కూలు కాలేజీ ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ కిట్టి పార్టీస్ ఈవెంట్ మేనేజర్ గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా వృత్తిరీత్యా అధ్యాపకురాలని కావడంతో ఈ మధ్య సమాజంలో మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము నేనిప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్ గా, మోటివేషన్ స్పీకర్గా పలు విద్యాసంస్థల్లో లెక్చర్స్ హైబ్రిడ్ (ఆన్లైన్&ఆఫ్లైన్) పద్ధతులలో ఇవ్వడం జరిగింది.అలాగే చైల్డ్ సైకాలజిస్ట్ గా సమాజంలోనీ ఒక పౌరురాలిగా నా వంతు గురుతర బాధ్యతను ఆ సమస్యలను తీర్చడంలో నిర్వహిస్తున్నాను.
అవార్డ్స్:
———–
వివిధ సంస్థల నుంచి బెస్ట్ RJ అవార్డులు, బెస్ట్ టీచర్ అవార్డులు,తీసుకున్నాను.
నాకు సమయం.దొరికినప్పుడు సమాజంలో.జరిగే ప్రతి సమస్యలపై కవితలు రాస్తుంటాను.
నాకవితలు పలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.సంగీతం పాడుకుంటాను.అలాగే
ఇంజనీరింగ్ విభాగంలో మైనింగ్ విభాగానికి డిప్లొమా.లెవెల్.లో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పుస్తకాన్ని రాయడం.జరిగింది,పలు,పుస్తకాల్లో chapters రాయడం జరిగింది. వివాహ అనంతరం, నాకు కవల పిల్లలు పుట్టిన తర్వాత నా తల్లితండ్రులు మరియు నా భర్త ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేయగలిగాను.

యధా పేరెంట్స్ తథ చిల్డ్రన్స్ అన్నట్టుగా నా తండ్రి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విశ్రాంత ఆచార్యులు తెలుగు విభాగంలో నేను అదే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి పిహెచ్డి సబ్మిట్ చేయడం జరిగింది నాకు నాలుగు సంవత్సరాల కవల పిల్లలు ఉన్నారు jagruth జాగృత్ మరియు జిజ్ఞాస్ ఇద్దరు కూడా పలు స్టేజీల పైన భగవద్గీత శ్లోకాలు పాడటం భాగవతంలోని పద్యాలు పాడటం పలువురి ప్రశంసలు పొందటం తల్లిగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
ఒక ఆదర్శ మాత దీప తాను బిజీగా ఉంటూ కవలపిల్లలను తీర్చి దిద్దే విధానం నిజంగా ప్రశంసనీయం. ఫోన్.9912868272

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మారుతున్న నిర్వచనం

” నేటి భారతీయమ్ కాలమ్”