నిజాలు- ఇజాలు – Hypocrisy

తరుణి పత్రిక సంపాదకీయం

నిజం నిప్పులాంటి. ఎన్ని అబద్ధాలు ఆడినా, నిజాలను కప్పేయాలని చూసినా  నెగ్గి తీరుతుంది. ఇజం అంటే మనుషులను బట్టి మనస్తత్వాలను బట్టి జీవితాలను బట్టి ఇజాలు మారవు. ఇజాలు స్థిరంగా ఉంటాయి మనుషులే వాటిని మార్చి మార్చి చూపిస్తుంటారు.

సాహిత్యంలో ఇజాలు అంటే  వాదాలు , ధోరణులు రకరకాలుగా ఉన్నాయి

అభ్యుదయవాదమని విప్లవవాదమని వాస్తవిక వాదమని హేతువాదమని వాదాలు ప్రముఖమైనవే ఉన్నాయి. డాడాయిజం, సర్రియలిజం, ఫ్యూచరిజం, సింబాలిజం, ఇమేజిజం అంటూ నిజాలు చాలానే ఉన్నాయి.

సాహిత్యంలో సౌందర్యవాదం అనేది పాశ్చాత్య దేశాలలో బ్రిటిష్ కవుల రచనల్లో ఎక్కువగా వచ్చాయి. ఆదర్శవాదం స్వేచ్ఛ వాదము జర్మనీ,ఫ్రాన్స్ దేశాలలో ఎక్కువగా వచ్చాయి. మనిషికి ప్రకృతికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు వైరుధ్యాల నేపథ్యాల నుంచి హేతువాదమైనా  కాల్పనికవాదమైన సంప్రదాయవాదమైనా పుట్టుకొచ్చాయని చెప్పడం ఉద్దేశం కాదు ఇప్పుడు. ఇవన్నీ మనుషుల ఆలోచనలు పెరిగిన నేపథ్యాన్ని బట్టి రచయితలు కవులు తమ రచన విధానాలను మార్చుకుంటూ వారి మానసిక స్వభావాలను  స్థిరీకరించుకుంటూ సమాజానికి మార్గదర్శకులు అయ్యారు.

కానీ నిత్య జీవితంలో సాధారణ మానవులు సగటు జీవులు మాట్లాడే మాటల్లో చేసే చేతల్లో నిజాలు ఎంత ఉన్నాయి? వాళ్ళ ఇజాలు ఎలాంటివి అనేది ఒక్కసారి స్పృశించుకుంటూ వెళితే వాటి వెనక ఉన్న హిపోక్రసీ ఏమిటో కూడా తెలిసిపోతుంది.

రాజకీయాలు సమాజంలో ఎంతటి ప్రభావం చూపిస్తాయో తెలియని వారు ఉండరు. ఎన్నికలు అధికారాలు పదవులు వంటి మాటలు లేని సందర్భంగా కనిపించడం లేదు ఇది ఎలా ఉంటుందంటే కొంతమంది ఓడిపోయే వాళ్ళకి బలం లేదని కాదు తెలివి లేక కూడా కాదు . అబద్ధాలు అన్నివేళలా

 

పనిచేయక. రాజకీయాలు కాకుండా సాధారణ విషయాలలో ప్రజల లు నిజాలు మాత్రమే చెప్పి ఓడిపోతుంటారు. మానసిక సంఘర్షణలకు జీవన సంఘర్షణలకు మధ్య సగటు జీవులు ఎప్పుడు అల్లకల్లోలం అయిపోతుంటారు. అయితే గిల్లి గిల్లి పెద్దగా చేసుకోకుండా ఉంటే శరీరం మీద పడిన గాయం తొందరగా  మానిపోయినట్టుగా పదే పదే తలుచుకోవడం తగ్గిస్తే మనసుకు కలిగే గాయాలు కూడా మానుతాయి.

పేదవాళ్లు సగటు జీవులు ఎదుర్కొనే కష్టాలకు ఆదుకునే సమాజం ఇంకా మన ముందుకు రాలేదు. ఎక్కడో ఓచోట సంఘసంస్కర్తలు తళుక్కున మెరుస్తూ ఉంటారు. ఎక్కువ అవుతున్న కుటుంబ సమస్యలు బయట నుంచి వచ్చే ఆకర్షణల హోర్లు సమస్యలకు కారణాలు అవుతున్నాయి.

అయితే కుటుంబంలో మనస్పర్ధలు అనేవి పోవాలంటే…ఏపుగా పెరగాలని కొమ్మలు కత్తిరించినట్టుగా మనుషులలో కుటుంబ సభ్యులలో ఉండే అహంభావం అనే వికారాన్ని కత్తిరిస్తూ పోతే మంచి బంధాలు రేపు గానే పెరుగుతాయి. Understand each other stay forever …అనేది.unity is strength అనేది రుజువు చేస్తుంది.

ఈ బంధాలను నిలబెట్టుకోవాలంటే always take extra care of three things అంటారు అవేంటంటే, promises … ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ఫ్రెండ్షిప్ …స్నేహ పరిమళాలను పంచడం, రిలేషన్షిప్.. బంధుత్వాన్ని నిలబెట్టుకోవడం అనే ముఖ్యమైన మూడింటిని పాటించాలి అంటారు. ఇది నిజం. ఇదే నిజం. ఈ నిజాన్ని మనుషుల ఇజాలతో  వేయించి చూద్దాం….

గమ్యం చేరాలనుకున్నప్పుడు ఒక్కోసారి అవమానాలు ఎదురవుతుంటాయి అంతులేని కష్టాలు ఎదురవుతాయి కానీ నిరంతర ప్రయత్నం కొనసాగితే తప్పకుండా ఫలితాలను సాధిస్తారు అనేది అందరికీ తెలుసు.అయినా కూడా, చీకట్లో ఉన్నప్పుడే దీపం విలువ తెలిసినట్టుగా చేతిలో గవ్వలేనప్పుడు ఒక్క రూపాయి ఎవరైనా ఇచ్చిన అది ఎంతో విలువైనదిగా తోచడం వంటివి ఇటువంటి సందర్భాల్లో గుర్తు చేసుకోవాలి.

ఇవన్నీ ఎవరు చెప్తారు? చెడ్డ వాళ్లతో బలమైన స్నేహం కలిగి ఉన్నా కూడా అది అసత్యన్నే వెంట తీసుకువస్తుంది చెడ్డ అనుభవాలను మాత్రమే మీదకు  తెస్తుంది. జంతువులకు మనుషులకు ఎన్నో తేడాలుంటాయి

అయినా కూడా ఆ జంతువులను మనుషులకు పోలుస్తుంటారు. కుక్క విశ్వాసాన్ని,సింహం ధైర్యాన్ని నక్కజిత్తులను ఆవు సాధుస్వభావాన్ని మనుషులకు పోలుస్తుంటారు. ముసళ్ళకు నాలుక ఉండవు పాములకు చెవులు ఉండవు తాబేలకు వెంట్రుకలు ఉండవు చేపలకు జీర్ణశక్తి ఉండదు ఇవన్నీ కూడా మనుషులకు ఉంటాయి. కానీ ఎన్ని ఉంటే ఏమిటి మనసు అనేది ఒకటి లేనప్పుడు? మనసు బుద్ధి రెండు కూడా మనిషి మనుగడకు మూలమైనవి. గబ్బు వంటి జబ్బులు ఒంటినిండా ఉన్న మనిషి గురించి “తల నుండి ఫణి కి విషము….” ఎంతో గొప్ప పద్యం ఉన్నది. పాముకు తలలో విషం ఉంటుంది తెలుగు తోకలో విషం ఉంటుంది కానీ చెడ్డవాళ్లకు ఒళ్లంతా విషమే ఉంటుంది అని ఊరికే అన్నారా కవి! ఈ విషయం మాటల ద్వారా చేతుల ద్వారా చూపుల ద్వారా వ్యక్తపరుస్తూనే ఉంటారు.

మనిషి ఒళ్ళు రకరకాల జబ్బుల పుట్ట. ఈ జబ్బులకు బ్లడ్ ప్రెషర్ అనో… షుగర్ అనో..  గుండె నొప్పి అనో ..క్యాన్సర్ అనో.. రకరకాల పేర్లు. కానీ అన్ని వ్యాధులకన్నా అతి భయంకరమైన వ్యాధి అహంకారం. ఈ అహంకారం అనేది వాడని సరిగ్గా ఉండనివ్వదు ఇతరులతోనూ  సరిగ్గా ఉండనివ్వదు. అయితే ఇతరులందరితో స్నేహంగా ప్రేమగా ఉండకున్నా కనీసం తన నా వాళ్ళనుకునే వాళ్ళ ముందు అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉంటే ఆ మనిషి జన్మకు ఒక అర్థం అనేది ఉంటుంది.

కపట బుద్ధి లోలోపల ఉన్న దాని పైకి కనపడకుండా దాచేసి మంచి వాళ్ళలా మాట్లాడేవాడు కోకొల్లలు. దీన్ని సహజవాదం అని అనొచ్చేమో! నేచురలిజం… వాస్తవమేనా! కానీ వాస్తవికతను ప్రతిబింబించడం అనేది సామ్యవాద సదుద్దేశంతో ఉండే ఉండడం లాంటిది. సమాజంలోని జీవులకు ఒక సమస్య ఏదైనా వస్తే పరిష్కారాన్ని సూచించడం దేవా నిరతితో ఉండడం సమరశీల పోరాట తత్వం కలిగి ఉండడం అచ్చంచలమైన నిష్ఠ గరిష్టతతో ఉండడం వంటివి కదా సామ్యవాద వాసవి కథను అడ్డంపట్ మేడంతార్క భౌతిక వాద సిద్ధాంతం. ఇదే కదా అభ్యుదయభావానికి పునాది.

మనిషిలోని చైతన్య స్రవంతి అటు సంప్రదాయవాదాన్ని ఇటు అభ్యుదయ వాదాన్ని తనని చేసుకుంటూ సాగాలి. అలవికాని విషయాల పైన అన్నీ సాధిస్తామని చెప్పడం,అనవసరపు భేషజాలతో ఏదో మాట్లాడి ఏదో

చేస్తామని చెప్పి ఏదీ చేయకుండా ఉండడం కంటే నిజాన్ని నమ్ముతూ నిజానికి విలువలిస్తూ బ్రతకడం అనే నైజం కలిగి ఉన్నవాళ్ళకు  ఎప్పుడూ మంచి పేరు వస్తుంది.

వీళ్లకు ఇజాలతో పనిలేదు. అప్పుడు ఈ పోగ్రఫీకి తావే ఉండదు. కుటిల  నీతి ఎప్పుడు రాణించదు. తను నమ్మిన సిద్ధాంతం పై నిలబడి నలుగురికి ఆదర్శంగా ఉన్నవాళ్లు చిరస్మరణీయులవుతారు. సమాజం ఇటువంటి వారి పట్ల గర్విస్తుంది. సిద్ధాంతాలను చెబుతూ, హృదయంలో ఏ ఆదర్శాలను పాటించకుండా ఈ సిద్ధాంతాలకు విలువ వేయకుండా హిపోక్రసీతో ఉండేవాళ్లను ఎప్పుడైనా సమాజం గర్హిస్తుంది. మరి మనమెటువైపు!!

________****___,____

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళా మణులు – దేవమ్మ

మరుగుజ్జు బుద్ధులు