మహిళా మణులు – దేవమ్మ

భారత్ నగర్ కూరల మార్కెట్ చివర మసిబారిన ఇల్లు లాంటి రేకుషెడ్ లో గదులుగా విభజించి ఉంటోంది దేవమ్మ తన ఇద్దరు కొడుకులు కోడళ్ళు 3 గ్గురు మనవరాళ్లు ఒక మనవడితో.ఆమెతో పాటు తమ్ముని భార్య వెంకటమ్మ కూడా ఉంటోంది.వీరంతా ఎరుకల జాతి వారు.5ఏళ్ళ పిల్లలప్పటినుంచే ఈతచెట్టు బోదెల నించి సన్నగా కొబ్బరి పుల్లలు లాగా కొడవలితో చెక్కి తట్టలు బుట్టలు తయారు చేస్తారు.దేవమ్మపుట్టింది సులేపేట అత్తారిల్లు అల్కోడా.జహీరాబాద్ కి బార్డర్ లో కర్ణాటక ప్రాంతంలో పుట్టిన ఈమె కన్నడ తెలుగు మాట్లాడుతుంది.తండ్రి కరెంట్ పని చేసేవాడు.

     

4గురు అన్నదమ్ములు ఒక అక్క.7ఏళ్లకే పెళ్లి అక్కడే గంపలు రకరకాలుగా తట్టబుట్టలు‌ అల్లడం నేర్చుకుంది.ఇంటికి పెద్ద కోడలు.తమ పల్లెల్లో ఈతపళ్లతో పాటు ఈతబోదెతో కొబ్బరి చీపురు పుల్లలుగా చీల్చాలంటే వాటిని నానబెట్టి ఆపై రోజుకి 4 బుట్టలు అల్లుతుంది దేవమ్మ.ముళ్లు తీసేసి కోయటం కష్టమైన పని.కానీ అదే తమకు జీవనోపాధి.ఒక 3 నెలలు హైదరాబాద్ లో ఉండి ఆపై ఓ 3 నెలలు తమ పల్లె అల్కోడాకి వెల్తుంది.అక్కడ పప్పులు ధాన్యాలు పెండగంపలు తయారు చేసి అమ్ముతుంది.మళ్లీ హైదరాబాద్ వస్తుంది.తాము ఉండే ఇల్లు నెలకి 5వేలు కరెంట్ బిల్లు మంచి నీళ్ళు కొనుక్కుని ఉన్నంతలో తిని జీవితం గడుపుతున్న కుటుంబం ఆమెది.పిల్లలని తమ పల్లె అంగన్వాడీ కి పంపుతారు.ఈతాకులమధ్య కట్టె పుల్లలు కూడా వాడతారు బుట్టలు అల్లడం కోసం.చిన్నకోడలు 12చదివింది.చిన్నకొడుకు డ్రైవర్.ఇక తమ్ముడి భార్య వెంకటమ్మ ది తాండూరు దగ్గర అక్కంపల్లె.కొడుకు 12 పాసై నాడు.10 పాసైన కూతురు పెళ్లి ఐంది.9వక్లాస్ కూతురు కి పెళ్లి చేయాలి.అంబా భవానీ వెంకటేశుని పూజిస్తారు.మంత్రాలు రావు.దేవుడ్ని నమ్ముతారు.తాము ఊరికెల్తే ఆఇంట్లో బంధువులు వచ్చి ఉంటారుట.మళ్లీ వీరు రాగానే వారు తమ ఊరికి పోతారు.
ఎంత పెద్ద ఇల్లు పోష్ గా ఉన్నా చాలదు అని గొణిగే మనం ! తిండికి దొరికితే చాలని తృప్తి పడే వారు! ఎంత తేడా!?🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆర్మీ వీరుడు

నిజాలు- ఇజాలు – Hypocrisy