అజ్ఞానం అనే దానిని తొలగించి,
జ్ఞానవంతులని చేసే తావు…
కోటి ఆశయాల కలలను,
నీ ద్వారా తీర్చుతావు…
దేనికోసం జీవించాలనే ఆలోచన వున్నవారికి,
నా కోసం జీవించుమని స్పందిచేస్తావు..
ప్రతి జీవికి నీ జ్ఞానంతో
జీవితాన్ని దివ్యజ్యోతిలా మలిచేస్తావు
మానవుడు ఉన్నతస్థాయికి చేరుకోవడానికి,
నీదైన ప్రథమ పాత్ర
వహించెదవు…
రాముడికి బాణంలా,
భీముడికి బలంలా, హనుమంతుడికి రామమంత్రలా…
చైతన్య ప్రతీక గా
మంచికి మార్పు దిశగా
మనిషితనానికి దివ్యత్వం లా
చదువు
చదివినంత చేరువ
చదువు …
ప్రతి మనిషికి నీవు ఒక అలంకారంలా మారినావు….