మధురవాణి 

మధురవాణి తంజావురును పరిపాలించిన రఘునాథ నాయకుని ఆస్థానములోని విదుషీమణులలో ఒకరు. ఈమెకుశుకవాణి‘ అనే మొదటి పేరు ఉందని చెబుతారు. సంస్కృతంలో సుందరాకాండ వరకు రామాయణాన్ని రచించింది. ఇది సంపూర్ణముగా లభించలేదు. 1500 శ్లోకములుగల 14 సర్గల గ్రంథము మాత్రమే లభించాయి. రామాయణ సారా కావ్య తిలకము 9 సర్గాంత గద్యలలో “మధురైక ధురంధరాంద్ర కవితా నిర్మాణ సమ్మాన్యయా” అని ఈమె చెప్పుకున్నది. ఈమె అరఘడియలో వంద శ్లోకాలు చెప్పగలదు అని, ఆరు భాషలలో కవిత్వం చెప్పగలదు అని, చిత్ర కవిత్వం ఆమెకు తెలుసునని ఆమెకు ఉన్న బిరుదులను బట్టి తెలుస్తుంది. అంత బహుముఖ ప్రజ్ఞాశాలి కనకనే రఘునాథ నాయకునిచే కనకాభిషేకం పోందటం అతిశయోక్తి కాదు. అంతేగాక సరస్వతీ మహల్ ని పండితవాగ్వాదంలో గెలిచి మధురనుండి తంజావూరు తెప్పించిన వీణా విద్వాంసురాలు మధురవాణి అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.  

 ఆరోజుల్లో (1581–1614) వరకూ రాజ్యాన్ని పరిపాలించినఆంధ్రరాజులైనఅచ్యుతప్పనాయకుల వారి ఆస్థానంలో వారి ఆదరాభి మానాన్ని పొంది నాట్యకళా సాంప్రదాయలను అభివృద్ధి పరిచారు. తంజావూరు సరస్వతీ మహల్ కవులతోనూ, గాయకులతోనూ, కళాకారులతోనూ అద్వితీయంగా వెలుగొందింది.  తంజావూరు రాజుల్లో అచ్యుతప్ప నాయకుని మరణానంతరం రాజ్య పారిపాలనకు వచ్చిన రఘునాథరాయలు, విజయరాఘవ రాయలు కాలంలో కూడ ఈ భాగవతాలు ఆదరించ బడ్డాయి.   

       సరస్వతీ మహల్ తంజావూరు 

  సుందరకాండములోని కొన్ని ఘట్టాలు – 1800 కాలం నాటి చిత్రం – ఇందులో సాగర లంఘనం, సీతా దర్శనం, లంకా దహనం చిత్రీకరింపబడినాయి 

  మధురవాణికవి, పండితురాలని, తంజావూరు నాయక్ రాజు రఘునాథ నాయక్ (1600-34) పాలనలో తంజావూరులో నివసించారని చారిత్రక ఆధారాలున్నాయని తెలుస్తుంది. ఆమె తెనుగించిన రఘునాథ రామాయణ కావ్యం సంస్కృత అనువాదానికి విస్తృతంగా ప్రసిద్ధి చెందింది “ఆమె మూడు భాషలలో కవిత్వం కంపోజ్ చేయగలరని అష్టావధానంలో దిట్టయని సాహితీ పరిశోధకులు విశ్లేషించారు. 

మధురవాణి ప్రధాన రచనలు: రామాయణ కావ్యతిలకము(సంస్కృత) కుమారసంభవం (సంస్కృత) నైషదం(సంస్కృత చంపూకావ్యం)  

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని –

నులివెచ్చని గ్రీష్మం