సావిత్రీబాయితో కలిసి నడిచిన ఫాతిమా షేక్

మొట్టమొదటి ముస్లిం మహిళ ఫాతిమా షేక్’గా ఉపాధ్యాయినిగా ఫాతిమా ప్రస్థానం ఆరంభం, బేటీ పడావో’ ఉద్యమానికి పునాదులు, ఫాతిమా విజ్ఞప్తులకు స్పందన
,ఆడపిల్లలు చదువుకుంటే అన్ని రంగాల్లో ముందు ఉంటారని! భావించిన సభ్య సమాజం ఆడవార్ని చదువుకోకుండా చదువు దూరం చేసింది. ఆడపిల్లలు చదువుకుంటే చేతికి అందకుండా పోతారని మూఢత్వాన్ని తల్లిదండ్రులలో నింపింది సభ్య సమాజం కానీ అందుకు విరుద్ధంగా ఆడపిల్లలు చదువుకోవాలి ఆడపిల్ల చదువు అవనికి వెలుగు అన్నట్టుగా
ఎన్నెన్నో దురాచారాలు ఆనాటి సమాజంలో సతీసాగమనం బాల్యవివాహాలు బహు భార్య తత్వం వితంతులపై ఆంక్షలు, దేవదాసి వ్యవస్థ అంటరానితనం.
కట్టుబాట్ల పేర్లతో మహిళలు అనగారిన వర్గాల జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. అలాంటి దురాచారాలను రూపుమాపటానికి నడుం బిగించిన నాటి సంఘసంస్కర్తలు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు జ్యోతిబాపూలే. విద్య ద్వారా సమానత్వం అని అతను 1848 లో పూణేలు నిమ్న కులలా బాలికల కోసం ఒక మార్గదర్శక పాఠశాలను ప్రారంభించాడు ఆ సమయంలో భారత దేశంలో ఏ బాలికలు విద్యను పొంద చదవడం చాలా అరుదు. అతను తన భార్య సావిత్రిబాయి పూలేను ఇంట్లోనే చదివించాడు భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు మనుషులు మనుషులుగా చూడలేని ఆసభ్య సమాజంలో బతుకుతున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం పాఠశాల స్థాపించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు.ఆడపిల్లలు చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుగని స్త్రీ విద్య వ్యాప్తి కోసం కంకణం కట్టుకున్న దంపతులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయిలు. వారి జీవితాన్ని గురించి తెలుసుకోవటం అవసరం. అలాంటి మహానీయుల బాటలో నడిచిన మహానుభావురాలు ఫాతిమా షేక్.

కులం పేరుతో చదువుకు దూరం అయిన మహిళలు కొందరైతే మతం పేరుతో చదువుకు దూరమై బయట ప్రపంచాన్ని చూడలేక పరదా వేసుకుని బతికిన స్త్రీలు ముస్లిం స్త్రీలు అలాంటి అడ్డుగోడల్ని లెక్క చేయక నేను సైతం ఉన్నానంటూ సమాజం బాగుకోసం స్త్రీ విద్య కోసం పాటుపడ్డ మహానీయుల పంచక చేరిన మహానుభావురాలు ఫాతిమా షేక్ అలాంటి వారి జీవితాల గురించి తెలుసుకుందాం. ఆడవారికి అప్పుడు? ఇప్పుడు? ఎప్పుడు? రక్షణ కరువైంది చదువుకొని అన్ని రంగాల్లో రాణించిన పిరికితనం అనే ముసుగు ఆడవారి నుండి విడిపోవటం లేదు.
ఆ ముసగును తొలగించాలంటే ఇలాంటి వారి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ ధైర్యంగా ముందుకు రావాలి. అలాంటప్పుడు నవ సమాజ నిర్మాణానికి పునాది వేసిన వాళ్లమవుతాము ఒకసారి ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం.
సాంకేతిక విద్య ఎంతో అభివృద్ధి చెందిందో…! రోజు ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి వారి చేతిలో సెల్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదేమోబహుశా! . రోజు సోషల్ మీడియాలో చూస్తేనే ఉన్నాము మూడు నెలల పసికందు నుంచి పండు ముసలి వరకు రక్షణ కరువైంది. మగ పులి ఆడపిల్లి పై (ఆడపిల్ల కాదు) హత్యాచారం చేస్తుంటే. ఆ ఆడపిల్ల ఆ మగ పులిని ఏమి చేయలేక పోతుంది. అందుకు కారణం ఆడవారిలో నింపిన పిరికితనం ఈ పిరికితనం పోవాలంటే ఆడవారందరూ ధైర్యవంతులు కావాలి. మగవారిని ఎదిరించే శక్తి రావాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది.
అమ్మాయిలు చదువుకుంటున్నారు బాగుపడుతున్నారు అని అనుకుంటుండగానే మొన్న కలకత్తా సంఘటన ఒక్కసారి ఒళ్ళు గగురు పరిచింది మనుషుల! రాక్షసులా! మానవ మృగాల! అన్నట్టు ప్రవర్తించారు. ఆడవారికి రక్షణ కరువైంది అని అనే కంటే ఆడవారిలో పిరికితనం నింపారు అంటే బాగుటుందేమో…!
ఇలాంటి మహానీయులు ఉండబట్టే ఈమాత్రమైనా చదువుకోగలుగుతున్నామేమో! లేకుంటే ఇంకా అంట్లు తోముకుంటూ బట్టలుతుకుంటూ ఇంట్లోనే ఉండే వాళ్ళమేమో! సావిత్రిబాయి,ఫాతిమా షేక్ గారు వారు ఆడపిల్లల చదువు కోసం ఎంత పరితపించారో బాధ పడ్డారో అవమాన పడ్డారో…..
భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సామాజిక ఆర్ధికంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ జ్యోతిరావు ఫూలే ప్రారంభించిన పాఠశాలలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు, వయోజనులకు చదువు చెప్పడం కోసం ఫాతిమా షేక్ కంకణబద్దులయ్యారు. సంక్షుభిత సమాజంలో స్పష్టమైన సంస్కరణలను అభిలషిస్తూ విద్య ద్వారా సంపాదించిన జ్ఞానం మాత్రమే సంస్కరణల సాధనకు, మార్పుకు తోడ్పడగలదన్న విషయం మీద జోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలేల సహచర్యంలో మంచి సామాజిక అవగాహన సంతరించుకున్న ఫాతిమా షేక్ దళిత, బహుజన వర్గాల బాల-బాలికల విద్యాబోధన ఆరంభించారు. అతిశూద్ర, శూద్ర సామాజిక వర్గాలలో, ప్రధానంగా బాలికలలో విద్యా వ్యాప్తి గురించి ఒక నిర్ణయానికి వచ్చిన ఫాతిమాషేక్ తన అన్నయ్య ఉస్మాన్ షేక్ ప్రోత్సాహంతో జ్యోతిరావు ఫూలే మార్గదర్శకంలో సావిత్రీబాయి సహచర్యంలో తన పూర్తికాలాన్ని విద్యారంగానికి అంకితం చేసారు. బాలికలకు చదువునేర్పిండంలో పూలే దంపతులకు సహకరించాలని నిర్ణయించుకున్న ఫాతిమా షేక్ విద్యావ్యాప్తి దిశగా తన ప్రస్థానం ఆరంభించారు.
ఫూలే ప్రారంభించిన పాఠశాలలు ప్రధానంగా దళితులు, బహుజన సామాజిక వర్గాల బాలికల కోసం ఉద్దేశించబడినవైనా బ్రాహ్మణులు, క్రైస్తవులు, ఆ ముస్లింల కుటుంబాలకు చెందిన పేద వర్గాల బాలికలకు కూడా ఆ పాఠశాలలో ప్రవేశం లభించేది. అందువలన బ్రాహ్మణులు, క్రైస్తవులు, ముస్లింల కుటుంబాలకు చెందిన పేద వర్గాల బాలికలను కూడా తమ పాఠశాలలో చేర్చుకోడానికి ఫాతిమా షేక్, సావిత్రీబాయి, సగుణాబాయి ప్రయత్నాలు ప్రారంభించారు. చివరకు ఆనాటి సామాజిక వ్యవస్థ విధించిన ఆచారసాంప్రదాయాలు, – కట్టుబాట్లను ఖాతరు చేయకుండా సావిత్రీబాయి, సగుణాబాయితో కలసి ఎంతో సాహసంతో బాలికలలో విద్యాజ్యోతులను వెలిగించడానికి కంకణం కట్టుకుని ఫాతిమా షేక్ ముందుకు వచ్చారు. ఈ విధంగా ‘ఆధునిక భారతదేశంలో విద్యార్థులకు చదువు చెప్పిన మొట్టమొదటి ముస్లిం మహిళ ఫాతిమా షేక్’గా ఆమె ఖ్యాతి గడించారు.
ఆగ్రహించిన ఆధిపత్య కుల పెద్దలు
పూర్వకాలంలో స్త్రీ విద్యను సమాజం ప్రోత్సహించేది కాదు. ఆడపిల్లలు ఇంటి పట్టున ఉండి ఏదైతే నేర్చుకుంటారో అదేవారికి చాలని అనుకునేవారు. మగపిల్లలను స్కూలుకు పంపించేవారు. ఆడపిల్లకు ఆ అవకాశం ఉండేదికాదు. ఈ వాతావరణంలో జోతిరావు పూలే బడుగు వర్గాలకు, బాలికలకు చదువు కోసం పాఠశాలలు ప్రారంభించడం, ఆ పాఠశాలల్లో బాలికలకు విద్యాబోధన కోసం సావిత్రీబాయి, ఫాతిమా షేక్ ముందుకు రావడం ఆధిపత్యకులాల పెద్దలకు ఆగ్రహం కల్గించింది. మతం, కులం ఆచార సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించటం, కట్టుబాట్లను తమ ఆదేశాలను ఖాతరు చేయకుండా ముందుకు సాగుతున్న జ్యోతిరావు ఫూలే బృందాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఆ ప్రయత్నాలు ముందుగా తిట్లు, శాపనార్ధాలతో ఆరంభమయ్యి చివరకు భౌతిక దాడుల వరకు వెళ్ళారు. ‘కింది కులాల వారికి విద్యాబోధన చేయడం అరిష్టమంటూ జాతి నాశనమైపోతుందని సనాతన బ్రహ్మణులు ప్రచారం చేశారు.
స్వజనుల వ్యతిరేకతనూ సహించిన ఫాతిమా
ఆనాటి సామాజిక ఆంక్షల కాలంలో ముస్లిం సామాజిక సముదాయం కూడా అందుకు అతీతంగా లేదు. ‘ఆ కాలంలో ముస్లిం కుటుంబాల్లో అరబిక్ మరియు పర్షియన్ భాషల విద్యాబోధన ప్రైవేటు ఉపాధ్యాయులను పెట్టుకుని ఇళ్లల్లోనే నేర్పిప్పించుకునేవారు. ఇంటి అడవాళ్ళు తమ స్వంత ఇళ్లల్లోనే విద్య నేర్చుకునేవారని ముస్లిం బాలికలు మాత్రమే కాదు బాలురు కూడా ఆధునిక విద్య నేర్చుకోడానికి కొందరు ఛాందస ముల్లాలు-మౌల్వీలు అడ్డుపడ్డారు. బాలికలు ఇంటి బయటకు వచ్చి చదువుకోవటం ఊహించలేని విషయం. విద్యావ్యాప్తి లక్ష్యంగా పెట్టుకున్న ఫాతిమా షేక్ ఇంటి నుండి బయటకు వెళ్ళి పాఠశాలలో విద్యాబోధన చేయడం మాత్రమే కాకుండా బాలబాలికలను పాఠశాలలో చేర్చడానికి ఇల్లిల్లు తిరగడం చాలా సాహసోపేతమైన చర్య. సనాతన ఛాందసులకు ఇది అభ్యంతకరమైన ప్రవర్తన. ఆ కారణంగా ఫాతిమా షేక్ కూడా జనం నుండి వ్యతిరేకతను ఎదుర్కోక తప్పలేదు. ఆనాడు ముస్లిం సమాజం నుండి ఫాతిమా షేక్ కు ఎంతటి మద్దతు లభించిందో చెప్పలేము గాని ఆనాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే జోతిబా దంపతుల్లాగే ఫాతిమా షేక్ కూడా తప్పకుండా వ్యతిరేకతను ఎదుర్కొని ఉంటారు చెప్పలేము. ఈ విధమైన అడ్డుకట్టలు-ఆటంకాలు, ఆంక్షల దుస్థితి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపకుడు సర్ సయ్యడ్ అహ్మద్ ఖాన్ ‘బేగమ్స్ ఆఫ్ బోఫాల్’గా ఖ్యాతి గడించిన భోపాల్ బేగం సుల్తాన్ జహాన్ బేగం చివరకు రొఖయా షెకావత్ హుసైన్ లాంటి విద్యావేత్తలకు కూడా తప్పలేదు. 1901 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ముస్లింలలో చదువుకున్నవారు 9.83 శాతం ఉంటే మహిళలు 0.69శాతం ఉన్నారు. ఈ శాతాన్ని బట్టి ముస్లిం మహిళల్లో చదువుకున్న వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. 1900 నాటికి బాలికలు చదువు విషయంలో సామాజిక వ్యవస్థ ధోరణి, తీరుతెన్నులు అంత ప్రతికూలంగా ఉంటే 1848లో ఆ వ్యతిరేకత ఎంత తీవ్రస్థాయిలో ఉండి ఉంటుందో ఊహించవచ్చు.
బేటీ పడావో’ ఉద్యమానికి పునాదులు
ఒకవైపున కుల వ్యవస్థ కట్టుబాట్ల పరిరక్షణకు కంకణం కట్టుకున్న ఆధిపత్య కులపెద్దల వ్యతిరేకతను ఒకవైపున స్వజనులలోని ఛాందస మౌలానాలు-మాల్వీల ప్రతికూలతను మరొక వైపున ఫాతిమా షేక్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సంక్లిష్ట కట్టుబాట్ల వాతావరణంలో కూడా ఫాతిమా షేక్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆమె ఎంతో ధైర్యంగా ప్రజలలోకి వెడుతూ విద్యావశ్యకతను వివరిస్తూ పాఠశాలలకు బాలబాలికలను పంపాల్సిందిగా కోరడం ప్రారంభించారు. బాలికల కుటుంబాలను కలసి బాలికలను చదివించమని తండ్రులను అభ్యర్థిస్తూ విద్యావ్యాప్తికి ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ‘ఆమె ఇంటింటికి వెళ్ళి తల్లి తండ్రులకు నచ్చజెప్పి బాలికలను పాఠశాలలకు రప్పించసాగారు’ ఈమేరకు 170 ఏండ్ల క్రితమే బాలికల విద్యాకోసం ‘బేటీ పడావో’ ఉద్యమానికి ఫాతిమా షేక్ పునాదులు వేసారని చెప్పవచ్చు. ఆ చర్యలతో జోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలేలతో పాటుగా ప్రస్తుతం ఫాతిమా షేక్ కూడా ఆధిపత్య కులాలలోని పెద్దలకు ప్రశ్నార్ధకం అయ్యారు. పూలే దంపతులతోపాటుగా అగ్ర కులాల పెద్దలలో ఆమె కూడా చర్చనీయాంశమయ్యారు. ఆ సామాజిక వాతావరణంలో ఫాతిమా షేక్ ఎవ్వరికి వెరువక జ్యోతిరావు ఫూలే మార్గదర్శకాల మేరకు సావిత్రీబాయి ఫూలే, సగుణాబాయిలతో కలసి తన కార్యక్రమాలను నిర్విఘ్నంగా సాగిస్తుండటంతో ఆధిపత్య కులపెద్దలు మండిపడ్డారు. జ్యోతిరావు ఫూలే మరియు ఆయన అనుచరుల కార్యాచరణకు అడ్డుకట్ట వేయడానికి ఆలోచనలు సాగించారు. చిట్టచివరకు సావిత్రీబాయి, ఫాతిమా షేక్లకు ప్రతికూలంగా సమావేశాలు, చర్చలు, సాగించి ఆ ఇరువురిని నియంత్రించి నిరోధించడానికి దుష్ట పన్నాగాలకు పాల్పడ్డారు. ఆ వాతావరణాన్ని పట్టించుకోకుండా నిరంతరం విద్యాబోధనా కార్యక్రమాలను ఒకవైపున నిర్వహిస్తూ మరోవైపున విద్యావ్యాప్తికి అవసరమగు ప్రచార కార్యక్రమాలను చేపట్టి సగుణాబాయితో కలసి ఫాతిమా షేక్ ముందుకు సాగారు.
ఫాతిమా విజ్ఞప్తులకు స్పందన
జ్యోతిరావు ఫూలే మార్గదర్శకంలో, సావిత్రీబాయి సహచర్యంలో అతిశూద్ర, శూద్ర కులాల బాలికల తోపాటుగా ముస్లిం సమాజంలోని బాలికలకు కూడా ఆధునిక ఆంగ్ల విద్యను నేర్పించాలని ఆశించిన ఫాతిమా షేక్ ఆ దిశగా కూడా దృష్టి సారించారు. జ్యోతిరావు ఫూలే ప్రారంబించిన పాఠశాలలో హిందూ, క్రైస్తవ, ఇస్లాం న మతాలకు చెందిన పేద కుటుంబాల బాలికలకు కూడా ఆయన ప్రవేశం కల్పించారు. ఆ కారణంగా ముస్లిం బాలికలను కూడా జోతిరావు పాఠశాలలో చేర్చడానికి అవకాశం ఏర్పడింది. ఆమె ముస్లింల ఇళ్ళకు వెళ్ళి బాలికల తల్లితండ్రులకు నచ్చజెప్పడం ఆరంభించింది. ఆనాటి ముస్లిం సమాజంలోని ముల్లాలు-మౌల్వీలు స్త్రీ విద్యకు వ్యతిరేకంగా ఉన్నా ఆ ఆక్షేపణలను, ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయలేదు. ఫాతిమా షేక్ ప్రతి వీధి, ప్రతి ఇల్లు తిరుగుతూ ముస్లిం కుటుంబాలలోని పిల్లల తల్లి తండ్రులకు బాలికల విద్యావశ్యకతను వివరించి బాలికలను పాఠశాలకు పంపాల్సిందిగా ఆమె చేసిన విజ్ఞప్తులకు క్రమంగా స్పందన లభించింది.
జ్యోతిరావు ఫూలే ఆరంభించిన పాఠశాలల్లో ఫాతిమా షేక్ ప్రచార కార్యక్రమాల ప్రభావం వలన ముస్లిం బాలబాలికలు కూడా చేరసాగారు. ఈ విషయాన్ని ఆ పాఠశాలల్లోని ఒక పాఠశాలలో జరిగినట్టుగా వెల్లడవుతున్న సంఘటన రుజువుచేస్తుంది. ఆ సంఘటన ఏమిటంటే, ఒకసారి సావిత్రిబాయి పూలే పాఠశాలలో పాఠం చెబుతుండగా ఆ పాఠశాల గదిలోకి ఒక వ్యక్తి వచ్చి ‘ముహమ్మద్’ అను విద్యార్థి తన బిడ్డను కొట్టినందున తాను ఆ విద్యార్థిని కొడతానంటూ ఆగ్రహించాడు. ఆగ్రహం వ్యక్తంచేస్తూ తరగతి గదిలోకి వచ్చిన ఆ వ్యక్తిని సావిత్రీబాయి ఎంతో చాకచక్యంగా నచ్చచెప్పారు. ఈ సంఘటన ద్వారా సావిత్రీబాయి శక్తియుక్తులు ఏపాటివో వెల్లడి కావడంతోపాటుగా ఆ పాఠశాలల్లో ముస్లిం బాలబాలికలు కూడా విద్యఅభ్యసించడానికి వచ్చారన్నది విశేషం.
అడ్డుకట్టకు విఫలప్రయత్నాలు
జ్యోతిరావు ఫూలే బాలికలకు, అతిశూద్ర, శూద్ర కులాల వారికి విద్యాబోధన చేయాలన్న సంకల్పంతో సాగిస్తున్న ప్రయత్నాలు మత, కుల కట్టుబాట్లకు, ఆచార సాంప్రదాయాలకు బద్ద వ్యతిరేకమని అగ్రవర్ణ, ఆధిపత్య కులాల పెద్దలు ప్రకటించారు. ఆ ప్రకటనల మేరకు ఆగ్రవర్ణ, ఆధిపత్య కుల నాయకులు జోతిరావును, ఆయన సహచరులను ఎలాగైనా సరే అడ్డుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు ఆయనను, ఆయన సహచరులను భౌతికంగా అడ్డుకోడానికి ప్రయత్నాలు ఆరంభించారు. బాలికలకు కోసం చదువు చెప్పటానికి పాఠశాలకు వెళ్ళుతున్న ఇద్దరిపై సావిత్రీబాయి ఫూలే, ఫాతిమా షేక్ లను భౌతికంగా అడ్డుకోడానికి సిద్ధపడ్డారు. ఆ అగ్రవర్ణాల పెద్దల ప్రేరరణతో, ఫాతిమా షేక్, సావిత్రీబాయి ఫూలే ఇరువురు పాఠశాలలకు వెళ్ళే మార్గంలో కొందరు ఆకతాయులు కాపుకాసి వారి రాకను గమనించి మార్గమధ్యంలో అవరోధాలు కల్పించడం ఆరంభించారు. ఆ ఇరువురి రాకపోకలపై నిఘాపెట్టి రహదారుల్లో అడ్డంగా నిలచి వారిని చూస్తూ నవ్వుతూ హేళన చేయసాగారు. వెకిలి చేష్టలకు కూడా పాల్పడ్డారు. ఆ ఆకతాయిలు అంతటితో ఆగకుండా కొన్నిసార్లు వారి మీద రాళ్ళతో దాడులు కూడా చేశారు.
ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకుని సావిత్రీబాయితో కలిసి విస్మరించబడిన సామాజిక వర్గాంలో విద్యావ్యాప్తికి నిరుపమాన సేవలందిస్తున్న ఫాతిమా షేక్ రాకపోకలను అడ్డుకునేందుకు ఆకతాయిలు వారి బట్టల మీదకు అశుద్దాన్ని, బురద కూడా చల్లడానికి సాహసించారు. ఎంతటి అఘాయిత్యానికి పలపడ్డా ఆమె మాత్రం భయపడలేదు.
ఆమె దారిలో వెడుతుంటే బూతులు కూడా మాట్లాడేవాడు. దాడులలో ఆడవాళ్ళుకూడా పాల్గొనేవారు.’ ఇది గొప్ప విశేషయం అందుకే ఆడవారి చదువు ఆది లోనే వుంది. అంతటి అఘాయిత్యాలు ఎదురవుతున్నా ఫాతిమా షేక్ మాత్రం సావిత్రీబాయి చేయి విడువ కుండా అతిశూద్ర, శూద్ర సామాజిక వర్గాల బాలికలకు చదువు నేర్పించటం కోసం ఆమె సిద్ధపడ్డారు. సావిత్రీబాయి పూలేతో పాటుగా ఫాతిమా షేక్ కూడా అగ్రవర్ణాల ఆధిపత్య కుల పెద్దల ద్వారా ప్రేరేపించబడిన ఆకతాయిల అరాచకాన్ని పలుమార్లు పలు విధాల అనివార్యంగా చవి చూడాల్సి వచ్చింది.
సడలని పట్టుదల
ఆకతాయులు ఆధిపత్యకుల పెద్దల సహాకరంతోఎన్ని ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నా ఫాతిమా షేక్, సావిత్రీబాయిలలోని పట్టుదల ఏమాత్రం సడలలేదు. సరికదా మరింత బలపడింది. ఆకతాయిల చర్యలను సావిత్రీబాయి, ఫాతిమా షేక్ లు ఆత్మ విశ్వాసంతో దైర్యంగా ఎదుర్నొన్నారు. చివరకు తల్లితండ్రులకు నచ్చజెప్పి పిల్లలను పాఠశాలలకు తీసుకెడుతున్న సావిత్రీబాయి, ఫాతిమా షేక్ను ఆధిపత్యకులాల పెద్దలు పలుమార్లు ‘ నిలదీసి దుర్భాలాడిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఆకతాయి తనపు చర్యలు ఎన్ని ఎదురైనా ఏమాత్రం అదురు బెదురు – లేకుండా ప్రశాంతంగా తమ పనులను తాము చేసుకపోతున్న ఆ ఇరువురు ఉపాధ్యాయినుల మీద భౌతికంగా దాడులకు కూడా పాల్పడినా ధైర్యంగా తగిన సమాధానమిచ్చి ముందుకు సాగిన సావిత్రీబాయితో పాటుగా ఫాతిమా షేక్ అన్ని అష్టకష్టాలను కూడా భరిస్తూ ధైర్యంగా కర్తవ్య ” దీక్షతో ముందుకు సాగారు,
సావిత్రీబాయితో కలిసి నడిచిన ఫాతిమా షేక్
ఎన్ని అవరోధాలు ఆధిపత్యవర్గాలు కల్పించినా ఏమాత్రం వెనకడుగువేయక ముందుకు సాగిన జ్యోతిరావు పూలే 1849 నాటికి పూనాలో మరో ఐదు బాలికల పాఠశాలలను, వయోజనుల పాఠశాలను ప్రారంభించారు. తొలి దశలో పాఠశాలలో ఒంటరిగా నడిపారు. సావిత్రీబాయికి ఫాతిమా షేక్ కూడా తోడుగా ఉండటం వలన ఆమె బరువు బాధ్యతలు కాస్త తగ్గాయి. ఆ తరువాత పూనాలో మాత్రమే కాకుండా పూనా బయట కూడా జ్యోతిరావు ఫూలే పలు పాఠశాలలను స్థాపించి స్థానిక కమిటీల ద్వారా వాటిని కూడా నిర్వహించారు. బాలికల పాఠశాలతో ఆరంభమై వయోజనుల పాఠశాల, ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలను జోతిరావు ఫూలే ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో సామాజిక సేవ దిశగా దృష్టి సారించి బాల్యవివాహాలు ఫలితంగా చిన్నతనంలో వైధవ్యం పొందిన యువతుల సంరక్షణకు విధవ మహిళల ఆశ్రమం కూడా ఆరంభించారు. బాల్యవివాహాల వలన చిన్నతనంలో చదువు కు దూరం అయిన యువతులు ఏకారణంగానైనా గర్భం ధరిస్తే వారికి పురుడుపోసి, వారికి పుట్టిన బిడ్డల సంరక్షణకు ‘బాలహత్య ప్రతిబంధక గృహం’ 1853 జూలై 12న ఏర్పడింది. ఈ కార్యక్రమం నిర్వహణకు సావిత్రీబాయి పూలేతోపాటుగా ఫాతిమా షేక్ కూడా ప్రసూతి శిక్షణను పొందారు. 1854లో కార్మికులు, రైతుల కోసం రాత్రి పాఠశాల ఆరంభించారు. మానవతా దృష్టితో పూలే దంపతులు ఆరంభించిన ప్రతి కార్యక్రమంలో ఫాతిమా షేక్ ప్రత్యక్షంగా, పరోక్షంగా తన క్రియాశీలక చేయూత ఇచ్చారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇటు ఉపాధ్యాయినిగా, అటు సామాజిక సేవికగా, సంఘ సంస్కర్తగా, పూలే దంపతుల సహచరిణిగా వారు ఏర్పాటు చేసిన సంస్థలలో, నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలలో ఫాతిమా షేక్ పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయినిగా ఫాతిమా షేక్
సావిత్రీబాయి త్రీవ ఆనారోగ్యానికి గురయ్యారు1856లో. ఆ కారణంగా మహారాష్ట్ర రాష్ట్రం, సతారా జిల్లా, ఖండాలా తాలూకాలోని ఆమె పుట్టిల్లు నాయ్ గామ్ గ్రామానికి ఆమె వెళ్ళాల్సి వచ్చింది. ఆ సందర్భంగా జ్యోతిరావు పూలే విద్యాసంస్థలలో విద్యాబోధన, కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ లాంటి అదనపు బాధ్యతలు కూడా ఫాతిమా షేక్ మీద పడ్డాయి. అనారోగ్యం వలన సావిత్రీబాయిపుట్టింట్లో ఉండాల్సి రావడంతో జ్యోతిరావు ఫూలే పూనాలోని పాఠశాలల పర్యవేక్షణ, నిర్వహణకు ఫాతిమా షేక్ ను ప్రధానోపాధ్యాయిని చేసి బోధనా బాధ్యతలతోపాటుగా పాఠశాలల యాజమాన్య బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ బాధ్యతలను సమర్ధవంతగా నిర్వహించిన ఫాతిమా షేక్ శక్తిసామర్ధ్యాలు సావిత్రీబాయి ప్రశంసలను అందుకున్నాయి. ఆధునిక భారత విద్యారంగంలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళగా, తొలి ముస్లిం ఉపాధ్యాయినిగా, ఫాతిమా షేక్ చరిత్ర సృష్టించిన ఆమె ప్రస్తుతం ప్రధానోపాధ్యాయినిగా బాధ్యతలు చేపట్టి తొలి ముస్లిం ప్రధానోపాధ్యాయినిగా కూడా ఇంకొక చరిత్రను సృష్టించారు.

డాక్టర్. అరుణ పరంధాములు తెలుగు అధ్యాపకురాలు సాంఘిక సంక్షేమ సైనిక గురుకుల మహిళా కళాశాల భువనగిరి, యాదాద్రి జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

నులివెచ్చని గ్రీష్మం