(ఇప్పటివరకు : రమాదేవి ఇల్లు ఖాళీ చేయమని గొడవ మొదలు పెడుతుంది. మైత్రేయి పది రోజులలో ఇల్లు ఖాళీ చేస్తానని అంటుంది. కానీ ఆమెకు మనసులో భయమయితే ఉన్నది. ఇలాటి స్థితి లో అది సాధ్యమా అని. కానీ మరునాడు పొద్దునే పంతులు గారు రమాదేవి మాటలే వి పట్టించుకోవద్దని, ఇల్లు ఖా ళీ చేయాల్సిన వసరం లేదని చెబుతాడు. ఆదివారం నాడు మైత్రేయి కాంతమ్మ గారింటి కి వెళుతుంది. రమణి కి పెళ్లి కుదిరిందని, తనని వదిలి రావడానికి వాళ్ళ పల్లె కి వెళదామని కాంతమ్మ గారు మైత్రేయి కి చెబుతుంది)
ప్రసాద్ లోపలకొచ్చాడు. అందరికి విష్ చేసి ప్రభాకర్ గారి కోసం చూసాడు. ఇంతలోకే ఆ యన కూడా బట్టలు మార్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పటిలాగే సరదా సరదా కబుర్లతోటి భోజనం కానిచ్చారు.
“ప్రసాద్ , నీతోటి పర్సనల్ గా మాట్లాడాలి, నాతోటి రా ,” అంటూ ప్రభాకర్ తన పర్సనల్ గది లోకి తీసుకెళ్లాడు.
“ విను ప్రసాద్ నేను నీకొక విషయం చెబుతున్నాను. అది చాలా కాన్ఫిడెన్ షియల్,” అన్నాడు. “చెప్పండి సార్,” అన్నాడు అతను. “నువు పంపిన వీడియో చూసాక, నేను కూడా నా తరఫున చిన్న ఇన్వెస్టిగేషన్ చేశాను, సుబ్బా రావు గురించి.”
“ వాడొక ఫ్రాడ్. ఇలా పెళ్లి చేసుకొని డబ్బులు గుంజుతూటాడు. తల్లి తండ్రులు వయసులో పెద్దవాళ్లవటంతో , వాళ్ళని దగ్గరికి రానీయడు. పైగా వాళ్ళని ఆ పల్లె నుండి కూడా వేరే ఊరికి కూడా కదల నీయడు. బ్యాంకు లో ఎదో పెద్ద స్కాం చేస్తున్నాడని కొంత సమాచారం. అంతే కాదు, మైత్రేయి తో పెళ్ళికి ముందు కూడా ఒకఅమ్మాయి తో ప్రేమ వ్యవహారం సాగించి, ఆ అమ్మాయి దగ్గరున్న నగలన్నీ దోచుకొని పారిపోయాట్ట. నగల విషయం పోలీస్ కేస్ పెట్టి రచ్చ చేసుకుంటే ఆడపిల్ల భవిష్యతు పాడవుతుంది అనుకోని అమ్మాయి తల్లి తండ్రులు ఏ కంప్లైన్ట్ లేకుండా గుమ్ము గున్నారు,” చెప్పాడాయన.
“ అవును సార్, నాకు అతన్ని మొదటి సారి హాస్పిటల్లో చూసినప్పుడే అనుమానమొచ్చింది, కానీ సరయిన ఆధారాలు లేవు కదా అని ఊరుకున్నాను. ఈ ఒక్క వీడియో తో వాడి ఆట కట్టచ్చేమో అని ఎదురు చూస్తున్నా. మీరు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు,ఎలా సాధ్యమయింది సార్,” అన్నాడు ఉత్సాహంగ.
“ నా “ఈగిల్స్ ఐ” విధానాలు నాకున్నాయి. వాడిని అంత సులభంగా వదిలిపెట్టను. ఇంకా బలమయిన ఆధారాలు ఉంటె, ఇంకో క్రిమినల్ ని శాశ్వతంగా ఈ సమాజం నుండి తొలిగించవచ్చు,” అన్నాడాయన సాలోచనగా.
“ మేము బయలు దేరుతున్నాము. మీ కబుర్లయినాయ, “ అంటూ కాంతమ్మ గారు కేక వేసి పిలిచింది
*******************
జానీ కారు సిద్ధం చేశాడు. కాంతమ్మ గారు చెప్పింది, “అంగలకుదురు వెళ్ళాలి.ఎంతసేపు పడుతుంది?”
“ఎంతమ్మా ఎనభై కిలోమీటర్లు దూరం రెండు గంటల్లో వెళ్లిపోవచ్చు, ” అన్నాడు. “ “అలాగా,” అంటూ ,” మైత్రేయి సిద్దమేనా”అడిగింది.
“ఆ రెడీ అయ్యానండి, నేను,రమణికూడా ,” అంటూ ఒక డోలక్ బాగ్ తోటి బయటికొచ్చింది మైత్రేయి. ఆమెతోపాటు రమణి చేయి పట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ రాంబాయమ్మ గారు కూడా వాళ్ళ తో పాటె కారు దగ్గరి కొచ్చారు. ప్రసాద్ ప్రభాకర్ గారు కూడా కారు దగ్గరికొచ్చారు.
“రమణి , నీకే అవసర మున్నా, ఈ అంకుల్ , నీ కోసం ఎప్పుడు అండగానే ఉంటాడు. గుర్తుంచుకో తల్లి,” అని ఆశీర్వదించాడు.
చీర కొంగులో దాచుకొని ఉంచిన రెండు అయిదు వందల నోట్లు రమణి చేతిలో పెట్టి, “క్షేమంగా పోయి , లాభంగా తిరిగి రామ్మా! వచ్చేటప్పుడు మీ ఆయనతో సహా వచ్చి నాకు చూపించాలి మీ ఆయన్ని మరి,” అంటూ కాస్త పేలవం గ నవ్వుతు రమణి ని విడవలేనట్లు బాధగా కారులో కూర్చోపెట్టి డోర్ వేసింది.
కారు అంగలకుదురు వైపుగా సాగింది. అందరి హృదయాలు భారం గ ఉన్నాయి. కాంతమ్మ గారి కేమి తోచటం లేదు. మనసంతా ఎన్నో ప్రశ్నలు.
జానీ కూడా చాల అన్యమనస్కం గానే డ్రైవ్ చేసాడు. దారిలో ఒకసారి కారు ని రోడ్డు పక్కనే ఉన్న పెద్దగుంటలోకి దింపబోయాడు . అది చూస్తున్న మైత్రేయి, “జానీ , చూసుకో ఎంత చివరికెళ్ళావో. కారు స్కిడ్ అయిందంటే అందరం ఆ చెట్ల కెళ్ళి గుద్దుకుంటాము, మనసెక్కడుంది,” అంటూ అరిచింది. తనను తాని సంభాళించుకొని కారు నడిపాడు జానీ.
సాయంత్రం అయిదున్నర కల్లా కారు అంగలకుదురు చేరుకుంది. రమణి వాళ్ళఇంటి దారి చెప్పసాగింది, “జానీ, ఇంకొంచం ముందుకు పోయి ఎడంవైపుకి తిరుగు, అక్కడ రాములోరి గుడి వస్తుంది, ఇంకొంచం ముందుకెళితే వీధీ చివరి పెంకుటిల్లే మాది. ”
“ఆ ఆ , కారు ఇక్కడే ఆపు, ఇదే మా ఇల్లు,” అంది. కారుని జానీ వాళ్ళఇంటి ముందర ఆపాడు. కాంతమ్మ గారు , మైత్రేయి ,రమణి కారు దిగారు. జానీ డిక్కీ తెరిచి రమణి బాగ్ ని బయట పెట్టాడు. అలా బాగ్ అందుకొని వెళ్ళిపోతున్న రమణి ని బాధగా చూస్తూ అక్కడే నిలుచుండి పోయాడు. అతని మొహం లోని భావాలూ మాత్రం మైత్రేయి దృష్టిని దాటి పోలేదు.
వాకిట్లో కారు ఆగడం చూసి రమణి నాయన బయటి కొచ్చాడు. ఏంతో వినయంగ, “నమస్తే అమ్మగారు, లోపలి రండి,” అంటూ సాదరంగా పిలిచాడు. వెనకా తలే వస్తున్నా రమణి బాగ్ ని తన చేతుల్లోకి తీసుకొని,” నువ్వు బేగి వెళ్లి అమ్మకి చెప్పు అమ్మగారొచ్చారని,” అంటూ హడావిడి చేసాడు.
కొంచం విశాలంగా ఉన్న పెంకుటిల్లు. వరుసగా మూడు గదులుండి, ముందు వెనక పెంకుల పంచ ఉన్నది . ఆరు బయట ఒక నులక మంచం నిలబెట్టి ఉన్నది. రమణి వాళ్ళ నాయన , “ఒరేయ్ ఈశం! నువ్వా నులక మంచం తెచ్చి ముందుగదిలో వేయి,” అన్నాడు.
సన్నగా రివట గా ఉన్న పాతికేళ్ల కుర్రాడు ,”అలాగే అయ్యా!” అంటూ గబా గబా నిలబెట్టి ఉంచిన మంచాన్ని తీసు కెళ్ళి మధ్య గదిలో వేసి దాని పైన ఒక తెనాలి నేత గళ్ళ దుప్పటి పరిచాడు. కాస్త దగ్గరిగా ఉన్న టేబుల్ ఫ్యాన్ ని దగ్గరికి జరిపి స్విచ్చే సాడు. ఫ్యాన్ శబ్దం చేస్తూ తిరగటం మొదలెట్టింది. రమణి తల్లి ఒక స్టీలు చెంబునిండా మంచి నీళ్లు తీసు కొచ్చింది.
“ బాగున్నారా అమ్మ గారు,” అని అడిగింది గౌరవంగా. “ బాగున్నాము యశోద. నువ్వెలా ఉన్నావు. ఏంటి అంత హడావుడిగా పెళ్లి కుదిరించారు. ఇప్పుడే అంత తొందరేమొచ్చింది,” కాస్త ఆరాగా అడిగింది.
“ అదా అమ్మగారు!” అంటూ మొగుడి వంక చూస్తూ నసిగింది.
వీరెడ్ది కల్పించు కొని, “మా కులం లో ఇప్పటికే శానా మంది ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసేసారమ్మ గారు. మేమె వెనక బడ్డాము. పైగా మంచి సంబంధం. ఎదురు సేసు కుంటే ఖర్చుండదని అనుకున్నాము,” అన్నాడు కాస్త భయం భయంగ.
“ పిల్లాడేం చేస్తున్నడెంటి?ఎంత వరకు చదివాడు? ” అని అడిగింది.
పిల్లాడి నాయన వ్యవసాయం చేస్తాడమ్మా. పొలాలను కౌలికి తీసుకొని చేస్తుంటాడు. ఈ పిల్లగా డు కూడ వాళ్ళ అయ్యతో కలిసి పొలం పనులే చేస్తుంటాడు. వాళ్లకి ఒక పిల్ల ఉన్నది. అందుకని వాళ్ళు వాళ్ళ పిల్లని మావాడికి సేసుకుంటే, వాళ్ళు మా పిల్లని వాళ్ళ పిల్లాడి కిచ్చి చేయటానికి ఒప్పుకున్నారమ్మా. బాగానే ఉంది కదా ని మేము ఒప్పేసుకున్నాము,” అన్నాడు.
“ మరి పెళ్లి ఎప్పుడు?”
“వచ్చే ఆదివారమే నమ్మ,” చెప్పాడు. “ముందగాల మనువు నా కొడుక్కి చేస్తమమ్మ, ఆ పైన రెండు రోజులకి నా కూతురికి. ”
“ సరే అయితే,” అంటూ ఆమే తన హ్యాండ్ బాగ్ లోంచి పదివేల రూపాయలు యశోద చేతి కిచ్చి ,” ఇది నా బహుమతి అనుకో యశోద , ఇంద తీసుకో,” అంటూ చేతిలో పెట్టింది.
“జానీ డిక్కీ లో పెట్టిన కూరల- పండ్ల సంచి తీసుకురా,” అంటూ పురమాయించి, “యశోద, నువ్వు రాగి జావా చేసుకురా, తాగేసి వెళ్లి పోతాము,” అన్నది.
సంతోషం గ యశోద లోపలికెళ్ళింది. రమణి ని దగ్గరికి పిలిచి కాస్త లోగొంతుకలో,” చూడు రమణి, నీ కీ పెళ్లి లో ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా, నాకు వెంటనే ఫోన్ చేయి. నేను కానీ అంకులు కానీ వెంటనే వచ్చేస్తాము. దేనికి భయపడకూడదు. నువ్వు కాస్త చదువుకున్నావు కదా , ఆ ఆలోచన ఇక్కడ చూపించు. అన్ని బాగుంటేనే? నీ ఇష్టం,” అంటూ కాంతమ్మ గారు రమణి కి భరోసా ఇచ్చారు.
ఇంతలోకే రాగి జావా చేసు కొచ్చింది యశోద,” తీసు కొండి అమ్మగారు . మీ కిష్టమని ఉప్పు కా రం వేసి కాసిన,” అంటూ రెండు దొన్నెల నిండా జావ తాగడానికి మైత్రేయి కి , కాంతమ్మ గారికి ఇచ్చింది.
మళ్లి వాళ్ళ తిరుగు ప్రయాణం మొదలయింది.
కొంత దూరం ప్రయాణం తరువాత మైత్రేయి అన్నది,” కాంతమ్మ గారు, నేను కాలేజ్ తెరిచే లోపల ఒక సారి మా అమ్మ నాన్న దగరికి వెళ్లి రావాలనుకుంటున్నాను. ”
“గుడ్. మంచి ఆలోచన. నీకు కాస్త మనస్సు స్థిమిత పడుతుంది. ఎక్కడ ఉంటారు?”
“గుంటూరు అరండల్ పెట లో మాకు ఇల్లు ఉన్నదండి. అన్న వదిన ,అమ్మ నాన్న,అందరు అక్కడే ఉంటారు.”
“ఓ అలాగ! నేను ఎల్లుండి సత్తెనపల్లి పోతున్నాను, నిన్ను గుంటూరు లో మీ ఇంటి దగ్గర దింపుతానూ ,” అన్నది ఆమె.
చాల సంతోషంగా, “ఇంకా మంచిది . మీరు కూడా ఉంటె నాకు మా అమ్మ నాన్న లను కలవ టానికి ధైర్యం గా ఉంటుంది ,” అన్నది.
“ అదేంటి మైత్రేయి. మీ అమ్మ నాన్నలను కలవటానికి నీకు నా తోడేందుకు,” అన్నది కొంచెం అనుమానంగా.
“ అదే కదా మేడం నా సమస్య. నేనుమా ఆయన మీద కేసు పెట్టానని, వాళ్ళ మాట విని కేసు వెన్నక్కి తీసుకోనందుకు, నా మీద వాళ్ళకి చాలా కోపంగా ఉన్నది. అంతే కాదు నేను వాళ్ళనే దో నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తున్నానని, నన్ను ఇంటికి రావద్దని చెప్పింది మా అమ్మ,” అంది తలొంచుకొని.
“ అలాగా! సరే నేను కూడా వస్తానులే, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి , అటునుంచి సత్తెనపల్లి పోతాను,” అన్నరావిడ మైత్రేయికి భరోసా ఇస్తూ.
(ఇంకా ఉన్నది )