సంస్కార పరిమళాలలదిన
జ్ఞాన జ్యోతికి
చంచల మనోహరుడైన ఓ బాటసారికి
కుదిరిన స్నేహం అంతరాలెరుగక సాగుతూ
అవసరానికై చెరోమెట్టు దిగి బంధానికి బంధనాలు జోడించి
సంసార జీవన చట్రంలో చెరోసగమై ఒదిగి
ఆనందంతో సాగగా
అనుకోని ఉత్పాతాలు ఉల్కలై వెంటాడి
ఉక్కిరిబిక్కిరి చేసినా ఒకరికి ఒకరు వెన్నుదన్నై పొందే
ఊరటలై
ఒడినిండని వేదన బెదిరింపులకు చెదరక
తమకు తాము ఓదార్పై
ఐనవాళ్ళ స్వార్థపు ఎత్తుగడలకు ఎదురీది
చెదిరిన మనసుల ఊరట కలిగించేందుకు
పరస్పరం అండగా
వదలని చేతులతో
గతుకుల రహదారిపైన
ఆశల గమ్యం అడుగులే ఆదర్శం!
స్పందించిన నయనాల్లో జాలువారే ద్వైదీభావపు
అశృధారల నడుమ మది మనసారా కోరుతోంది –
ఓ బలమైన బంధమా,
నూరేండ్లు వర్ధిల్లమని!