కులాలు కులాలు అని చావకండి
కులాలు మతాలు అన్నీ మీ గుణాలను తెలుపుతాయి
కులం మీ వృత్తిని తెలుపుతుంది
కులం మీ గుణం తెలుపుతుంది
కులం మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది
కులంతో నీ విలువ పెరగదు
కులంతో నీకు ప్రశంస వచ్చిన
అది ఎన్నాళ్లో నిలవదు
కులం నీ వృత్తిని తెలుపుతుంది
కులం నీ
సృజనాత్మకతను తెలుపుతుంది
కులం నీ వ్యక్తిత్వాన్ని పెంచుతుంది
కులాలలో చిచ్చు పెట్టకు
కులాలని వేరు చూడకు
కులాలని వాదించకు
కులాలు భగవంతుడు ఇచ్చిన
వరాలని భావించు
నీ జీన్స్ మారవు ఎప్పుడు
జీన్స్ ప్యాంటు వేసుకున్నంత మాత్రాన
అవి మార్చడం నీ తరం కాదు
మా కులం ఇదని
విర్రవీగకు !
తక్కువగా ఉన్నానని
నీలో నీవు కృషించకు !
ఎక్కువ వాడివని
అహంకారం ప్రదర్శించకు !
కులం నీ గుణం తెలుపుతుంది
కులం నీ పూర్వీకుల చరిత్రను తెలుపుతుంది
నీ కులం వాళ్ళ గొప్ప ను తెలుపుతుంది
కులం నీ వృత్తిని తెలుపుతుంది
కులం నీ ప్రవృత్తిని తెలుపుతుంది
కులం జాతి మతం
మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది
కులాలను చూసి వర్షాలు పడవు
కులాలను చూసి ఎండ రాదు
కులాలని చూసి గాలి రాదు
కులాలను పట్టి భూమి లేదు
ఎందుకురా కులాలు కులాలని
కొట్టుకు చస్తున్నారు
కులం ఏ గుణం మరవకు
నీకులానికి నీవు రాజు వు
ఎప్పటికీ నీవు రాజువే.
నీ వ్యక్తిత్వానికి
నీవు రా రాజు వే!