ఎడారి కొలను 

ధారావాహికం -34వ భాగం

(ఇప్పటివరకు : కాంతమ్మ గారి ఇంటి నుండి వచ్చిన తరువాత మైత్రేయి లో ఎదో మార్పు కనిపిస్తుంది. ఆమె కు మనసు తేలిక పడినట్లుగా ఉంటుంది.  కొన్ని సరుకులు  తేవడానికి ప్రసాద్ , మైత్రేయి కలిసి సాయంత్రం బయటికి వెళ్ళటం రమాదేవి చూస్తుంది. ఐస్క్రీం  పార్లర్ దగ్గర సుబ్బా రావు కనిపించి గొడవ చేస్తాడు. ప్రసాద్ మీద చేయి చేసుకుంటాడు. ఇది చాలదన్నట్లు వాళ్ళు ఇల్లు చేరుకొన్న కొద్దీ సేపటికల్లా రమాదేవి గొడవ మొదలు పెడుతుంది.)

     ప్రసాద్ కి అనిపించింది ‘ఈ గొడవ ఎటుకి దారితెస్తుందో. తనెమయిన మాట్లాడితే ఈ రమాదేవి పెడ అర్ధాలు  తీస్తుందేమో’ అనుకుంటూ  ఈమె నెలా నోరుమూయించాలి’ అన్న ఆలోచనలోనే ఉండిపోయాడు.

అనుకోని విధంగా మైత్రేయి మాట్లాడడం మొదలుపెట్టింది.

“ చూడండి రమా దేవి గారు! మీరు చెప్పింది అక్షరాల నిజం. మీరెంత అయోమయం లో ఉన్నారో, స్వయం గా అనుభవిస్తున్న నేను అంతే అయోమయం లో ఉన్నాను. నాకేమీ అర్ధం కాక చస్తున్నాను. ఇదిగో! ప్రసాద్, వసుంధర , కాంతమ్మ గారు లాంటి వారి సహాయం తో అంత పెద్ద సమస్య నుండి కూడా బయట పడ గలిగాను. పూర్తి గా నాకు తెలిస్తే మీకు తప్పకుండా చెబుతాను. మరొక విషయం, మీకు అబార్షన్ అయి , గర్భసంచి తీసేసి నప్పుడు, మీకు ఆపరేషన్ సమయం లో హాస్పిటల్లో మీతో పాటే  ఉండి , మీ కు అవసరమయిన బ్లడ్ దొరక లేదని పంతులు గారు బాధపడుతుంటే, నేనెళ్లీ  నా బ్లడ్ టెస్ట్ చేయించి, అది సరిపోతుందని డాక్టర్ చెప్పగానే ,మరో మాట  లేకుండా మీకు బ్లడ్ ఇచ్చి , నా  తోబుట్టువుని బతికించు కున్నానన్నఆనందంతో నేను, స్వంత ఆడబిడ్డలాగా నన్ను చూస్తూ పంతులు గారు ఆ ప్రమాదం గట్టెక్కిందని సంతోష పడ్డాము. అప్పటి నుండి పంతులు గారు మాత్రం నన్నె ప్పుడు ఆయన స్వంత చెల్లెలిలాగా నే చూస్తున్నారు. కానీ మీకన్నీ తెలిసిసన మీ కలా  ఎందుకు అనిపించటం లేదో నాకయితే తెలియదు. బహుశా మీకు నా మీద అంత  మంచి అభిప్రాయం లేదమోననిపిస్తుంది. పరవాలేదు . ఇప్పుడు మీ ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటార!” అంటూ సూటిగా అడిగేసింది.

మైత్రేయి మాట్లాడుతునప్పుడు , ఆ విషయాలన్నీ ఏకరువు పేడుతుందని ఆమె అనుకోలేదు. అందుకే నేల చూపులు చూస్తూ కూర్చుంది. పంతులు గారు కూడా ఏమి మాట్లాడలేక చాలా ఇబ్బందిగా కదులుతున్నాడు. మాట్లాడే విధానం లో ఏ  మాత్రం బేరు కు గాని, భయం కానీ కనిపించలేదు. ప్రతి చిన్న విషయానికి చిగురుటా కుల  వణికి పోయే మైత్రేయి ఎంతో హుందాగా మాట్లాడుతున్నది .

“ అలాగే రమాదేవి గారు, నాకు పది రోజులు టైమ్ ఇవ్వండి , ఇల్లు వెతుక్కుని వెళ్లిపోతాను. ఇంకెప్పుడు మీకు నా వలన ఏ  ఇబ్బంది లేకుండా జాగర్త పడతాను ,” అంటూ తాను కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడింది.

రమాదేవి కి ఏం చెప్పాలో పాలుపోలేదు. కాసేపు అ పిల్లని గోల చేసి తృప్తి పడాలను కుంది. కానీ తనకేమి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇంతలొకే ప్రసాద్ ఆమె మౌనం ఆసరాగా తీసుకొని,  “నేను కూడా ఖాళీ చేస్తాను పంతులు గారు, కాకపోతే మీరీ మధ్యన చేబదులుగా  నా దగ్గర తీసుకున్న 5,000/- వారం రోజుల్లో ఇచ్చెయ్యండి. నేను కూడా పది రోజుల్లో ఖాళీ చేసేస్తాను” అంటూ వెళ్ళి పోవటానికి లేచి నిలబడ్డాడు.

పంతులు గారికి అనుకున్న ప్రమాదం ఎదురయింది. ఇప్పటికిప్పుడు అయిదు వేలు ఎక్కడనుంచి తెచ్చి ఇస్తాడు, అలాగే మైత్రేయి వాళ్ళింట్లో అద్దెకి లేదని తెలియగానే  అ వసుంధరమ్మ , తనని గుడి పూజారి పని నుండి పీకేయదూ. అంతా నాకర్మ. దీని నోరు మూయించ లేక చస్తున్నాను అనుకొంటు ,   “పొద్దుపోయింది  లే!  ఇక నీ భాగవతం కట్టి  పెట్టు. నోర్మూసుకొని పద. ఇంకొక్క మాట  మాట్లాడవంటే నన్ను చంపుకు తిన్నట్లే,” అంటూ రమా దేవి చేయి పట్టు కొని బర బర బయటికి లాక్కు పోయాడు ఆయన.

పోతూ పోతూ  “ అమ్మ మైత్రేయి, మీ అక్కాయే అనుకో. కోపం పెట్టుకోకు. రేపు మనం నిదానం గా మాట్లాడుకుందాం. ప్రసాద్ నీకు కూడా అదే చెబుతున్న, మీరిక వెళ్ళండి రేపు మాట్లాడుకుందాము, “ అంటూ  వెనక్కి  చూడ కుండ వాళ్ళ ఇంట్లో కెళ్ళి దభేల్ మనీ తలుపు వేసేశాడు.

ఆయన భయం చూసి ప్రసాద్ కి  నవ్వు వచ్చింది. “మైత్రేయి గారు! చాలా  బాగా బుద్ది  చెప్పారండి రమాదేవి గారికి,” అంటూ ఎంతో ప్రశంసనీయంగా ఆమె వంక చూ సాడు. కానీ మైత్రేయి మాత్రం అతని ప్రశంసని విన్నట్టుగా లేదు. ఏదో ఆలోచిస్తున్నది.

అది గమనించి,  “ఏమాలోచిస్తున్నారు?” అన్నాడు.

“అదే ఆలోచిస్తున్నాను, అనటమయితే అన్నాను గాని పది రోజుల్లో ఖాళీ చేస్తానని , ఇల్లు అంతా తొందరగా దొరుకుతుందా? పైగా నేను  మా ఆయన సుబ్బ రావు నుండి తప్పించు కొని ఆ కొత్త చోట బతక గలనా?”  అని.

“ ఓహో!అదా! అంతా సీన్ లేదు లెండి. మీరు భయపడే వేవి జరగవు. రేపు పొద్దున కల్ల వాళ్ళనుండి  మీరు కోరుకునే సమాధానమే వచ్చేస్తుంది. చూస్తుండండి. ఈ రాత్రికి నిశ్చింతగా పడుకోండి. ఎక్కువ ఆలోచించొద్దు. ఏది జరిగిన అది మన మంచికే.” అన్నాడు.

“అలాగయితే  చెంప దెబ్బ తినడం కూడాన?” అంది హాస్యం గా.

“అవును కదా మరి. అయన కొట్టిన దెబ్బకీ నా దవడ నొప్పి తగ్గిపోయింది,” అన్నాడు దవడలు రుద్దుకుంటూ నవ్వే సాడు వాతావరణం తేలిక చేయడానికి.

“మీనుండి ఒకటయితే తప్పక నేర్చుకోవాలి ప్రసాద్ గారు. ఎన్ని సమస్యలున్నా నవ్వుతూ ఉండగలగటం . మీరు  అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అసలేమీ జరగనట్లే ఉన్నది. థాంక్స్ అండి . మనసు తేలిక చేసారు,” అంది మనఃస్ఫూర్తిగా.

“మనం మంచి స్నేహితులుగా ఉందామండి, మన కు థాంక్స్ లు సారీ లు చెప్పుకునే అవసరం   మాత్రం రాకూడదు అని కోరుకుందాము , సరేనా!” అంటూ  “గుడ్ నైట్” చెప్పేసి వెళ్లి పోయాడు. మైత్రేయి కూడా గుడ్ నైట్ అనేసి తలుపు వేసుకుంది.

పడుకోవాలని ఎంత ప్రయత్నించినా నిద్దర రావటం లేదు తనకి. మనసంతా వెలితిగా ఉన్నది. ఏవేవో ఆలోచనలు. మధ్య మధ్యలో కలత నిద్దర. ఆ నిద్దరలో పిచ్చి పిచ్చి కలలు. మళ్ళి  మేలుకు రావడం. ఎప్పుడో తెల్లవారు జాముకి ఆమె కి కునుకు పట్టింది

ప్రసాద్ స్థితి  కూడా అలానే ఉన్నది. అస్సలు నిద్దర పట్టలేదు. ఆ సుబ్బారావు కొట్టిన చెంపదెబ్బ పదేపదే బాధ కలిగిస్తున్నది. కళ్ళు మూసుకుంటే అతని పైశాచిక రూప మే  కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఇంత మంచి భార్యను ఉంచుకొని  అంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తిస్తాడు. వాడికేలాగయినా బుద్ధి  చెప్పాలి. ఎలా? అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారు జాముకి అతనికి కునుకు పట్టింది. పొద్దునే అక్కమ్మ వచ్చి లేపేవరకు మైత్రేయి నిద్దరనుండి  లేవలేదు.  కానీ అలవాటుగా ఉదయాన్నే లేచి జాగింగ్  కి వెళ్లడం అలవాటు ఉన్నందు వలన ప్రసాద్ ఎప్పటి లాగే లేచి జాగింగ్  కి వెళ్ళిపోయాడు.

మంచి నీళ్లు పట్టు కుంటూ రమాదేవి మైత్రేయి ఇంటి వంకే మిర్రి మిర్రి చూస్తున్నది. ఇంత  లోకే జాగింగ్  పూర్తయి ప్రసాద్ వెన్నక్కి వచ్చాడు. వస్తూనే ,  “నమస్తే రమా దేవి గారు! రాత్రి బాగా నిద్దర పట్టిందా,” అన్నాడు నవ్వుతూ.

“ఆ నాయన, నిద్దరకేం భాగ్యం, హాయిగా వచ్చేస్తుంది,” అంటూ కాస్త వెటకారంగా సమాధానం చెప్పింది. ఆమె మాటలు వింటూనే పంతులు గారు బయటి కొచ్చి నిలబడ్డాడు. ఆయనలా నిలబడడం చూసి, “నన్ను కాస్త త్వరగా పోనివ్వండమ్మా, పంతులు గారికి దేవతార్చన సిద్ధం చేయాలి, “ అంటూ తన నీళ్ల  బిందె తీసుకొని చక చక వెళ్లి పోయింది. అది చూసిన ప్రసాద్ కనిపించింది, “ పంతులు గారు కాస్త గట్టి డోసే ఇచ్చినట్లున్నారని.’

కొద్దీ సేపయినా తరువాత ప్రసాద్ వరండా లోకి వచ్చి , ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. అప్పుడే పంతులు గారు కూడా బయటికొచ్చాడు. “తమ్ముడు, నాకొక ఇల్లు అర్జెంటు గ చూసి పెట్టారా. పది రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తానని మా ఓనరికి చెప్పాను. అదే ఒక చిన్న గొడవలే. ముందొక ఇల్లు చూడు, విషయాలన్నీ తరువాత చెబుతాను,” అంటున్నాడు ప్రసాదు. పంతులు గారికి కంగారు ఎక్కువయింది.

“ఏంటయ్యా ప్రసాద్ , ఇల్లు వెతకటం మొదలు పెట్టేశావా ఏంటి?” అని మొహమంతా నవ్వు పులుముకుంటూ అడిగాడు. “తప్పదు కదండీ. మీకు మాట ఇచ్చాము కదా ఖాళీ చేస్తామని,” అని అన్నాడు.

“అంత  తొందరేమీ లేదు లేవయ్యా . అదోట్టి పిచ్చిది. పైకి ఆలా మాట్లాడేస్తుంది, మసులో ఏమి ఉండదు. రాత్రంతా ఒకటే  గోల. నేను కాస్త తొండర పడ్డానండి, సొంత అక్కలాగా చూసుకునే మైత్రేయి ని, తమ్ముడల్లే ఉండే ప్రసాద్ ని నేనెలా ఇల్లు ఖాళీ చేయిస్తాను. అలాటి మంచి మనుషులు మనకి మళ్ళి  దొరుకుతారు. కాకపోతే నెనంత రాధాంతం చేసాక ఏ మొహం పెట్టుకొని మళ్ళి  మాట్లాడగలను. రేపుదయం మీరే వాళ్ళకి సర్దిచెప్పండి. నేను చాల బాధ పడుతున్నానని కూడా చెప్పండి,” అంటూ ఒకటే గోలనుకో.   “నువ్వు రాత్రి విషయాలేవీ మనసులో పెట్టుకోమాకు. మీరేమి ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు,” అంటూ వడివడి గ బయటికి వెళ్లి పోయాడు. అదంతా అక్క డే నుంచొని విన్న అక్కమ్మ గబా గబా మైత్రేయి ఇంట్లోకెళ్ళి అయన చెప్పిన విషయం చెప్పేసింది.ఆ  కబురు  వినగానే మనసెంతో తెలీక పడ్డట్లయింది మైత్రేయికి.

ప్రసాద్ ఇంట్లోకి తొంగి చూస్తూ,” కంగ్రాట్స్ ! మీరు ఏకంగా రమాదేవి మీదనే గెలిచేసారు. ఆమె తన నిర్ణయం మార్చుకునేటట్లు చేయగలిగారు. అంటే ఇది మీ విజయానికి మొదటి మెట్టు. ఇలాగె ఉండండి , మీ సమస్యలన్నీ ఇట్టే మాయమయి పోతాయి,” అన్నాడు.

“అలాగా ,రండి! సెలబ్రేట్ చేసుకుందాము కాఫీ తోటి,”  అని “అక్కమ్మ ఫ్లాస్క్ లో కాఫీ ఉన్నాయి రెండు కప్పులో పోసుకురా,”  చెప్పింది నవ్వుతూ.

అలా ఆ రోజు కాస్త ప్రశాంతం గానే గడిచి పోయింది.

******************************

ఆదివారం నాడు ప్రభాకర్ గారు ఫోన్ చేసి ఇంటికి రమ్మ ని పిలిచాడు  మైత్రేయి ని, ప్రసాద్ ని.

వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇద్దరు సిద్ధమయ్యారు.

ప్రసాద్ బైక్ లో వెళ్లి ఆటో పిలుచుకొచ్చాడు. మైత్రేయి ఆటో లో బయలుదేరింది.

అది చూపిస్తూ పంతులు గారు,” చూడు రమా , మనం హద్దు మీరు మాట్లాడాము, అనుమానించాము వాళ్ళని, కానీ వాళ్ళు వాళ్ళ హద్దులోనే ఉన్నారు. ఇంకెప్పుడు ఇలాటి గొడవలు తెచ్చి పెట్టద్దు. వాళ్ళ వలన మన కేమి నష్టం లేదు,” అంటూ ఆమెకు బోధ చేసాడు.

మైత్రేయి ఎక్కినా ఆటో నేరుగా కాంతమ్మ గారింటి దగ్గర ఆగింది. రాంబాయమ్మ గారు చాల సంతోషం గ ఎదురొచ్చారు,”రామ్మా  మైత్రేయి, నాలుగు రోజులే అయినా , నాకెందుకో చాలా రోజులయినట్లుగా ఉన్నది. నీ ఆరోగ్యం బాగానే ఉన్నది కదా/” అంటూ పక్క నే కూర్చోపెట్టుకొని పరామర్శించింది.

రమణి మంచినీళ్లు తెచ్చి ఇస్తూ,” అక్క రాంబాయమ్మ గారికి , నువ్వెళ్ళి పొతే ఏమి తోచలేదంట. ఒకటే తలుచుకుంటున్నారు.,” చెప్పింది తమాషాగా నవ్వుతూ. .

“సరెలేవే, నువ్వు  ఊరికి పొతే మాత్రం నేనెలా ఉండగలను చెప్పు. అందుకేకదా, తోరగొచ్చేయ్ అని పది సార్లు చెబుతుండా!” అంది ఆమె.

“ఏంటి రమణి, నువ్వు ఉరికెళుతున్నావా ?” అడిగింది మైత్రేయి.

“అవునక్క, మా నాయన ఫోన్ చేసాడు పల్లెనుండి. మా అన్నకి పెళ్లి కుదిరిందట. రమ్మన్నాడు.” అంది.

“మరయితే ఎన్ని రోజులేంటి నువ్వక్కడ ఉండేది?” అడిగింది.

“తెలవదు. నేనీ ఇసయం రాంబాయమ్మ  గారి కింకా  చెప్పలేదక్క,” అంది నసుగుతూ.

‘ఏ విషయమే,” అంది రాంబాయమ్మ కాస్త గాభరాగా.

“ఆదే నమ్మా. నా మనువు ఇసయం,” అంది. “నీకు పెళ్లి కుదిరిందా!  అంత  సంతోషకరమయిన వార్తా నలా నాన్చుతూ చెబుతావేంటే,” అన్నది ఆమె రమణి ని దగ్గరికి తీసుకుంటూ.

ఇంతలోకే కాంతమ్మ గారు కూడా అక్కడ కొచ్చింది.

“నేను చెబుతాను రాంబాయమ్మ  గారు,” అంటూ   “అసలు విషయం ఏమిటంటే  , రమణి  వాళ్ళ నాయన నాకు ఫోన్ చేసి,  “అమ్మ గారు , రమణి కి పెళ్లి చెద్దా  మనుకుంటున్నానమ్మా ,” అన్నాడు.

“మనువు కుదిరిందా ,” అన్నాను.

“కుదిరిందమ్మా. ఎదురు సంబంధం. నా కొడుక్కి, వాళ్ళ అమ్మయికి,  వాళ్ళ అబ్బాయికి మా రమణి తో టి మనువు సెయ్యాలని మాట్లాడు కున్నాము. అలాగయితే పెట్టుబడులేమి వద్దు అని అన్నారమ్మా. మేము ఒప్పుకున్నాము” అంటూ చెప్పాడు.

“ఏమె రమణి ! నీకా పిల్లాడు తెలుసా, చూసావ? “ అంటూ రాంబాయమ్మ గారు అడిగారు.

‘లేదమ్మా, మా జాతి లో అలా పిల్ల ,పిల్లడు మనువుకి ముందరే చూసుకోరాదు,అందుకని మా పెద్దోళ్లే అన్ని చూసి మనువు కుదురుస్తారు.” అంది అమాయకంగా.

“అయ్యో అలాగా ! మరి మనువెప్పుడో తెలుసా?” అన్నదామె.

“రాంబాయమ్మ గారు, మీరు కాస్త ఆగండి, అది  అసలే గాభరా పడుతున్నది. నువ్వు వెళ్లవే  రమణి,” అంది కాంతమ్మ. మైత్రేయికి  కూడా అనుమానం వచ్చింది.

ఇంతలోకే ప్రభాకర్ కూడా లోపలకొచ్చాడు. “ హలో మైత్రేయి! బాగున్నావా ? ఎలావుందీ హెల్త్ ?” అంటూ ఏంతో  చనువుగా పలకరించాడు. “మన ప్రసాద్  కనిపించటం లేదే? క్యాంపు కి వెళ్లాడా?”  అడిగాడాయన.

“లేదు సార్. నాతొ నే బయలు దేరాడు కానీ, ఎదో పని చూసుకొని వస్తానన్నాడు,” అని చెప్పింది మైత్రేయి.

“ఓకే ఓకే , నేను ఫ్రెష్ అయి వస్తాను ,” అంటూ అయన లోపలికెళ్ళి పోయాడు.

“సాయంత్రం నేను రమణి ని తీసు కొని వాళ్ళ పల్లె లో దింపేసి వస్తాను.  నువ్వు కూడా వస్తావా మైత్రేయి,” అన్నది కాంతమ్మ.

“వస్తాను మేడం. రాత్రికే వచ్చేస్తామా ?”  “ అవును , మరీ పొద్దు పోక పోతే. బాగా లేట్ అయ్యితే మాత్రం మనం అక్కడే ఉండి  పోదాము. పొద్దునే వెన్నక్కి వచ్చేద్దాం, ఏమంటావు?” అన్నది.

“అలాగే ,” అని తలూపింది మైత్రేయి. “ మరయితే భోజనాలు కాగానే, ఒక్క అర  గంట రెస్ట్ తీసుకొని బయలు దేరుదాము,” అన్నరావిడ. ప్రసాద్ బైకు వచ్చి వాళ్ళ వాకిట్లో ఆగింది.

(ఇంకా ఉంది )

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అభ్యసన – బోధన- Which is important?

నిత్య పెళ్ళి కొడుకు – కథ