ఈ జీవితమనే పాఠశాలలో తొలి గురువులు తల్లిదండ్రులు. మన కుటుంబ వ్యవస్థలో ఉన్న బంధువులు అంతా కూడా గురుతుల్యులే. ఏదో ఒకరకంగా మన నడకకి మెరుగులు దిద్దుతూనే ఉంటారు. బడిలో చేరాక సాంకేతిక విద్య పరిజ్ఞానం ,సకల శాస్త్రాలు, భాషలు నేర్పే గురువులు మార్గదర్శకులు, మన జీవితాన్ని తీర్చిదిద్దేవారు. అద్వైత సిద్ధాంతం నేర్పిఆధ్యాత్మికతలో నడిపించినవాడు, భజగోవిందం వంటి కావ్యాలు రాసి మనల్ని ఏ విషయాన్ని ఎంతవరకు పట్టుకోవాలో ఏ విషయాన్ని ఎక్కడ వదలాలో తెలిపిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు.
సామాజిక వ్యవస్థ గురించి చాప పుట్టుకల తీరు టెన్యూర్ గురించి చెప్పి ధ్యానంతో కూడిన కర్మ సిద్ధాంతం నేర్పి, కర్తవ్యం దైవ మాహ్నికం అని నేర్పిన శ్రీకృష్ణ పరమాత్మ సకల చరాచర సృష్టికే గురువు.
ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక విషయం నేర్చుకునే విషయం ఉంటుంది అన్నారు ఒక పెద్దమనిషి .మన దినచర్యలో భాగమైన పాలవాళ్ళు ఆటో వాళ్ళు పని వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకునే వి ఎన్నో ఉన్నాయి అందుకే కాబోలు ‘నేను సమాధిలోకి వెళ్లే చివరి క్షణం వరకు విద్యార్థినే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను’ అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు. క్రమశిక్షణలో స్ట్రిక్ట్ గా ఉంచే మాస్టారులను చూస్తే మన గుర్తొచ్చేది ప్రహ్లాదని గురువు చెం డా మార్కులవారు. ఇవే కాకుండా మన జీవితాల్లో ఎదురయ్యే సంఘటనలు, అనుభవాలు, ప్రమాదాలు, ప్రతిఘటనలు, ఎన్నో పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి కదా. మనకి తెలియకుండానే మనం ఎన్నో నేర్చుకుంటూనే ఉంటాం కానీ ఏమి నేర్చుకున్నామో ఆ ఎరుక తెలిసి ఉండటమే ముఖ్యం.
ఈ జీవితమనే పాఠశాలలోనే గురువులందరికీ కోటి కోటి వందనాలు పాదాభివందనాలు