అమ్మవడి స్వర్గమే
ప్రేమిస్తు ఉండాలి
నీజన్మ దాతనే
పూజిస్తు ఉండాలి
ఒకస్త్రీ నీవనీ
క్షణమైన మరువకే
లోకమే చెడిపోయె
గమనిస్తు ఉండాలి
ఒంటరిగ నువ్వెపుడు
రెప్పయిన వెయ్యకే
చదువులే చదివినా
పరికిస్తు ఉండాలి
మృగాలే మనుషులుగ
తిరిగేస్తు వున్నాయి
చెడుచూపు పడకుండ
విదిలిస్తు ఉండాలి
మనసార నువ్వెపుడు
ఆదమరచి నవ్వకే
కళ్ళలో కాంక్షనే
పట్టే స్తు ఉండాలి
కాలనాగులేవో
నీవెనకె తిరిగేను
నాగినివై పడగెత్తి
కాటేస్తు ఉండాలి
ఏక్షణం యేమనసు
విషంగా మారునో
నీడనైన ఎప్పుడూ
ప్రశ్నిస్తు ఉండాలి
యేపుర్రె బుద్దిలో
యేపురుగు దాగెనో
కాళికగ నీవెపుడు
ఖండిస్తు ఉండాలి
చందురుడు నీకొరకు
సాక్షిగా రాడులే
అంతటా తెలివిగా
అడుగేస్తు ఉండాలి
–//–
నేడు స్త్రీలపై అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలు చూసి బాధా తప్త హృదయంతో నా కలం వ్రాసిన గజల్. స్త్రీ ఎలా ఉండాలి. ఎలా చుట్టూ వున్న పరిస్థితులు అంచనా వెయ్యాలి. అనే అంశాలతో వ్రాసాను.