అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి
విజ్ఞాన జ్యోతులు వెలిగించే వారు గురువులు..
విద్యార్థులు చేసే తప్పులను పెద్దమనసుతో అర్ధం చేసుకుని…
వారి తప్పులను సరి చేస్తూ…
వారికి ఒక సక్రమమైన మార్గాన్ని చూపేవారు గురువు…
గురు శిష్యుల సంబంధం వర్ణనాతీతం
పాఠశాల అనే ఉద్యానవనంలో
గురువు ఒక తోటమాలి…
నిరంతర శ్రామికుడు…
అవిశ్రాంత హాలికుడు…
విద్యార్థుల మస్తిష్కంలో మొలిచే
అజ్ఞానమనే కలుపుమొక్కలను
ఎప్పటికప్పుడు పెరికి వేస్తూ
వారికి కావలసిన జ్ఞానమనే ఎరువును స్నేహంగా వేస్తూ …
వారి బుద్ధి చీడపీడల బారిన పడకుండా….
వారు అజ్ఞానంతో పెడదారి పట్టకుండా…
వారికి సరైన మార్గాన్ని చూపించి…
ఫల పుష్పాదులతో ఎదిగిన తరువు వలె
విద్యార్థులను తీర్చిదిద్దే వారే అసలైన గురువులు…
అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి
జ్ఞాన జ్యోతులు వెలిగించే వారు గురువులు…
మట్టిముద్ద లాంటి పసి వారిని
అందమైన శిల్పంగా మార్చే శిల్పులు గురువులు…
తన జ్ఞానం అనే కుంచెతో ఎన్నో రంగులద్ది
విద్యార్థి జీవితాన్ని ఎంతో కళాత్మక చిత్రంగా తీర్చిదిద్దే వారు గురువులు…
గురువు ఆజ్ఞను శిరసావహించి ఉన్నత సోపానాలను
అధిరోహించే వాడు అసలైన శిష్యుడు…
దేవుడు గుడి లో ఉంటాడు…
గురువు బడిలో ఉంటాడు…
దేవుడిని పూజించు…
గురువులను గౌరవించు