సాధించు నీవు – పాట

 

పల్లవి:

వేల వేల అడుగులు నీవు వేసినా
తొలి అడుగు ఒక్కటే మరువకు, మరువకు;
దూరాలు ఎంతైనా గమ్యం ఒక్కటే,
గమ్యమే నీ లక్ష్యం,నినదించు- సాధించు//వేల వేల//

చరణం1)

ఆవిరి యంత్రాన్ని కనిపెట్టిన నాడు,
గమన సూత్రాలను ప్రతిపాదించిన నాడు,
విద్యుత్తు శక్తిని నిరూపించిన నాడు,
ఆ శాస్త్రవేత్త ఒక్కడే మరువకు, మరువకు;
చినుకు చినుకు ఒక్కటై వరదలా పారదా!
విత్తనం మొలకెత్తితే చిగురాకులు వేయదా!
చిగురించే చిరు ఆశే ఆశయానికి ఊపిరి ;గమ్యమే నీ లక్ష్యం నినదించు సాధించు// వేల వేల//

చరణం2)

బుల్లి పెట్టెలో శబ్దం దాచిన నాడు,
పట్టాల పై రైలు పరిగెత్తిన నాడు,
ఖగోళాన కాలు పెట్టి చంద్రుని స్పృశించినపుడు;
అతను ఒక్కడే, ఒక్కడే మానవుడు;
చిరు దీపం వెలిగితే, చీకటే తొలగదా!
చెమటను చిందించితే, ఫలితమే దక్కదా!
కోటి కోటి ఆశలకు ఆశయమే ఊపిరి;
ఆశయం నీ లక్ష్యం, నినదించు సాధించు// వేలవేల//

చరణం3)

ప్రకృతిలో వేల వేల గమనాలున్నాయి
మనసుపెట్టి వెతికితే నీ తోడై నిలుస్తాయి;
మానవుడే దేవుడు ,మానవుడే మహనీయుడు;
మరువకు, మరువకు; సాగించు నీ పయనం..
సాధించు నీ గమ్యం… గమ్యమే
నీ లక్ష్యం; నినదించు, సాధించు //వేల వేల //

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేటి భారతీయం (కాలం)

తెలుగు తల్లికి ఒక పన్నిటీ చుక్కొ- Dr సి వసుంధర