ఆకలికి సెలవా? The holiday

 25 – 8 – 2024 తరుణి పత్రిక సంపాదకీయం

Think good of others అంటారు. ఇది అందరికీ వర్తిస్తుంది. చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఆచరించాల్సిన, సాధించాల్సిన విషయం.వ్యక్తిత్వ వికాసానికి తొలి అడుగు. అంతే ప్రాముఖ్యత కలిగిన
Help ever , hurt never అనే మాట కూడా అంతే. ఆకలికీ ఈ వాక్యానికి సంబంధం ఏమిటి? ఉన్నది అదేంటో చూడాలి.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అంటూ కొన్ని దశాబ్దాల క్రితం కన్నతల్లులు, పెద్దవాళ్లు పాపాయిలకు ఉగ్గు తినిపించగానే రెండు చేతులు పట్టుకొని అటూ ఇటూ అంటూ, రెండు కాళ్లు పట్టుకొని అటు ఇటు అంటూ ఇలా అనేవాళ్ళు. ఈ” వాతాపి” ఏంటి ?ఈ జీర్ణం ఎందుకు? ఒక కథ ఉంది. కానీ ,ఇప్పుడు ఇక్కడ ఆ కథ అవసరం లేదు. ఈ వాక్యం తర్వాత వెంటనే” గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం”” మా పాప తిన్న ఆహారం జీర్ణం” అనేవాళ్ళు మనుషులకే కాదు సమస్త జీవరాశికి పుట్టుకతోనే ఆకలి ప్రారంభమవుతుంది. తినగానే జీర్ణం అవుతుంది సమయాన్ని బట్టి మళ్ళీ ఆకలి అవుతుంది. ఈ తినడానికి జీర్ణం అవడానికి మధ్య మనిషికి కావలసింది సరైన “ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం” అని కూడా మన పెద్దవాడు అన్నారు. భాగ్యమంటే సంపద. బుద్బుద ప్రాయమైన మనిషి జీవితం ఎప్పుడు తిరిగిపోతుందో, తగ్గిపోతుందో తెలియదు.క్షణంలో వచ్చే చావును తప్పించుకోలేరెవరు. ఇక్కడేమీ వేదాంతం బోధించుకోవడం లేదు కానీ ఎలాగూ చచ్చిపోతాం గనుక తినకుండా ఉంటామా మనం తినకుండా ఉంటే ఆకలి అనేది ఆగుతుందా ఈ ప్రశ్నల మధ్యన ఆహారం ఎలా నర్తిస్తున్నదో ఆహారం వెనుక ఆరోగ్యం వెనుక దాగి ఉన్నది ఒక సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి అదే శుభ్రత స్వచ్ఛత. అందుకే “ఇతరుల మంచిని కోరు” అనే ప్రథమ వాక్యం మరోసారి ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఎప్పుడు ఎవరికైనా సహాయం చెయ్యి. బాధ పెట్టకు, అనే వాక్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ “ఎవర్ ” కూ “నెవర్ “మధ్య కూడా తచ్చాడే” హెల్ప్” విషయాని కూడా ప్రతి ఒక్కళ్ళు చర్చించుకోవాలి.
ఈ ఆరోగ్య విషయం ఈ ఆహార విషయము ఈ సహాయాల విషయము అన్నింటి మధ్యన ఒక లింక్ వంటి విషయం ఏంటి అంటే జీవితం ఎప్పుడూ వ్యాపారం కాకూడదు జీవించడానికి వ్యాపారం చేయొచ్చు గాని జీవితాన్నే వ్యాపారం చేయకూడదు అని చెప్పుకోవడం కొరకే. ఎందుకు ఇంత” కల్తీ జీవితం ” అయిపోయింది మనుషులది? పంట పండించే చోట కల్తీ పదార్థాలను తయారు చేసే చోట కల్తీ మనుషుల హృదయాలలో కల్తీ. తెలియని జీవితం లేదు.
ఆకలికి సెలవు లేదని తెలిసే హోటళ్ల వ్యాపారస్తులు పదార్థాలను తయారు చేసేవాళ్ళు, తినుబండారాలను తయారుచేసే వాళ్ళు కల్తీ చేసి ఆహారాన్ని సిద్ధం చేసి అందంగా రూపాన్ని చేసి అమ్ముతున్నారు. అది తెలియక ఆశతో ఆసక్తితో తింటూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఇది యువతరం మీద మరీ ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది.
కల్తీ సారా, కల్తీ మద్యం సేవిస్తే జీవన కాల పరిమితి తగ్గిపోతుంది అని తెలిసీ వ్యాపారం చేస్తుంటారు. ఇదో పెద్ద సమస్య అంతు లేని, అంతు తేలని సమస్య. ఇది ప్రస్తుతం చర్చించుకోకుండా , ఆహారం విషయం చర్చించుకునే ఉద్దేశం.
ఇళ్ళల్లో నిలువ పదార్థాలు తినే అలవాటు అయ్యింది ప్రజలకు. ఆధునిక వసతికి తెరతీసింది”ఫ్రిజ్” .

ఎన్నో రోజుల క్రితం ఆహార పదార్థాలు సిద్ధం చేసి పెద్ద పెద్ద ఫ్రిజ్ లలో స్టోర్ చేసి పెడతారు.
దీనివల్ల న్యూట్రియన్స్ Nutrients తగ్గిపోయి తిన్న ఆహారం వృధా అవుతుంది. బలం రాదు. ఇవన్నీ తెలియకనా? తెలిసీ తింటుంటారు.
వేడి వేడిగా ప్రతి పూట తినాలి. అంటే ఫ్రిడ్జ్ లోంచి తీసి మైక్రో ఓవెన్ లో వేడి చేసుకుని కాదు. ఎప్పటిదప్పుడు వండుకొని తినాలి. అలా అందరికీ వీలు కాదు. కొందరికైతే అన్నం దొరకనివాళ్ళూ ఉన్నారు ఇదో మరో పెద్ద సమస్య, ప్రస్తుతం వద్దు.

ఆకలి ఆగదని తెలిసీ ఏరోజు ఆహారం ఆరోజు శుచిగా తయారు చేసి, వండి శుభ్రమైన స్థలం లో కూర్చుని తినాలి. ముందస్తు గా పదార్థాలు వస్తువులు సిద్ధం చేసుకున్నట్టే, వండుకునేందుకు మనసునూ సిద్ధం చేసుకోవాలి.
ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆకలికి హాలీడే లేదు.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 శ్రావణ మాస వైశిష్యత

దొరసాని