శ్రావణ మాస వైశిష్యత

శ్రావణమాస వైశిష్యం ఎంతో గొప్పది. హైందవ సాంప్రదాయంలో కాలానుగుణంగా అలా వస్తూనే ఉంది. ఏ ఏడికి ఆ ఏడే కొత్త పండగల సందడి. అందుకే అలా కాలాను గుణంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ మాసంలో ఇంటింటా మంగళగౌరీ వ్రతాలు, శ్రీ వరలక్ష్మీ వ్రతాలు, రాఖీ పౌర్ణమి,జంధ్యాలపౌర్ణమి ఎన్నోరకాలుగా జరుపుతారు. ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ఆనందాన్ని కలిగించేమాసం. కొత్త చీరలు కొత్త నగలుతో అలరిస్తూ ఉంటారు. కానీ శారీరక శ్రమ కూడా ఎక్కువే. ఇంటిని శుభ్రం చేసుకోవడం, పూజకు కావాల్సిన తెచ్చుకోవడం, పిండి వంటలు, పేరంటాలు అంతా సందడే సందడి.
. వానా కాలం కావడం వలన కాస్త చిదరగా ఉన్నా రైతులకి కలిసివచ్చే కాలం. నాట్లు వేయడానికి అనుకూలమైన కాలం. సస్య లక్ష్మికి శ్రీకారం చుడతారు కృషివరులు.అలాగే వేసవికి, వర్షాకాలానికి సంధి కాలం కావడం వలన,. వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఆరోగ్యపరంగా కొంత అంటురోగాలు వచ్చే కాలం. నీటి కాలుష్యం వలన కామెర్లు కలరా వంటి రోగాలు రావచ్చు. ఫ్లూ వంటి జలుబు సంబంధమైన అంటు రోగాలు రావచ్చు. పరిశుభ్రత కోసమే ఈ వర్షాకాలంలో ఇలాంటి వ్రతాలు నోములు ఏర్పాటు చేశారు.అందుకే రోజు తినే ఆహారంలో కూడా చాలా మార్పులు చేశారు పెద్దలు కాలానికి తగ్గట్టు. అవన్నీ వారికి వారి పెద్దల నుండి సంక్రమించినవి. అందుకే వాటిని చేదస్తాలని కొట్టి పారేయకూడదు. సాత్విక ఆహారం, మాంసకుత్తులు ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చారు. జీర్ణస్థితి మందకించే కాలం కనుక ఒక్క పొద్దులు కూడా చేస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
రాఖీ పౌర్ణమి దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ. భాషా భేదాలు,ప్రాంతీయ భేదాలు, నైసర్గిక బేధాలు ఉన్నా దేశమంతటా ఎంతో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆయా ప్రాంతాల వారు వారి వారి ఆచారాల ప్రకారము జరుపుకుంటారు.ఉత్తర భారతదేశం వాళ్ళకి శివ పూజ ప్రాముఖ్యత ఎక్కువ. దక్షిణాదివారు లక్ష్మిని ఈ మాసంలో ఎక్కువగా పూజిస్తారు. ఉపనయన సంస్కారం ఉన్నవాళ్లు శ్రావణ పౌర్ణమి రోజున పాత యజ్ఞోపవీతాన్ని తీసి కొత్త దాన్ని వేసుకుని గాయత్రీ జపం చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణమావాస్యను ” పొలాల అమావాస్య” అనే వ్రతాన్ని కూడా చేసుకుంటారు. ఆరోజు కంద మొక్కను పూజించి వంశవృద్ది కావాలని కోరుకుంటారు.
[09:04, 8/26/2024] Niharini: ఈ నోముల ద్వారా తమకున్న దానిని ఇతరులతో పంచుకోవడంజరుగుతుంది.సాటివారిలోదైవత్వాన్నిచూడడం అలవాటుతుంది. ఒకరినొకరు ప్రేమను పంచు కోవడానికి దోహదపడుతుంది. ఈ నోములలో పంచుకునే తాంబూలం రూపంలో ఉండే ఆకు వక్క,సున్నంస్త్రీలకు ఎముకల్లో క్యాల్షియం పెరగడానికి దోహదపడతాయి. నానబెట్టిన పెసలు,శనగలు, పళ్ళు ఆరోగ్యానికి పనికి వచ్చేవే. వచ్చిన ముత్తయిదుకి బొట్టు పెడతాం మనం పెట్టించుకుంటాం. దీనివలన ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. చేతికి తోరం కట్టుకోవడం వలన మణికట్టు లో ఉండే నరాల మీద ఒత్తిడి పెరిగి ఆక్యుప్రెషర్ ఫలితాన్ని ఇస్తుంది. కళ్ళకి కాటుక ఇచ్చిపుచ్చుకోవటం వలన నేత్ర రోగాలు రావు. కాళ్ళకి పసుపు రాసుకోవడం వలన ఫంగస్ ఇన్ఫెక్షన్లు దరి చేరవు. చేతులకు పెట్టుకునే గోరింటాకు కూడా అంతే.ఈ నోములు వ్రతాలలో ఉపవాస దీక్షలు కూడా ఉంటాయి. . మనం జరుపుకునే వరలక్ష్మీ వ్రతాన్ని పరిశీలిద్దాం…. అందులో చారుమతి ఊరి వారందరిని కలుపుకుని వ్రతం ఆచరిస్తుంది. వాయినాలు రూపంలో తన కున్నది అందరికీ పంచుతుంది. అందరి దగ్గర నుంచి ఆశీర్వచనాలు పొందుతుంది. అంతేకాదు ఆమె హితంగా, మితంగా మాట్లాడుతూ, గయ్యాళికాక, అత్తమామలను సేవిస్తూ, ఇరుగుపొరుగు వారతో సఖ్యంగా ఉంటూ, అందరు మంచి కోరుతూ అందర్నీ కలుపుకొని ఆ వ్రతం ఆచరించింది. చూశారా ఇందులో ఎంత మిత్ర భావం, సమానత్వము కనిపిస్తోందో!
నేటి ఆధునిక మహిళలు కూడా ఎంత చదువుకొని, ఎంత సంపాదించినా, వీటి మీద మక్కువ పోలేదు. వ్రతం ఆచరించే సమయంలో కొత్త చీరకట్టుకోవడం, సొమ్ములు పెట్టుకోవడం ఆడవారు ఇష్ట మైన పని.నోములు వ్రతాలు వలన ఇంట్లో ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. సంతోషమే సగం బలం కదా ఎవరికైనా…… ఎన్ని సమస్యలు ఉన్నా పక్కనపెట్టి ఎంతో ఆనందంగా ప్రతి వనిత ఈ నోములు చేస్తారు. ఇంకా చెప్పొచ్చేది ఏమంటే పూర్వం కంటే వైభవంగా,ఈ నోములు వ్రతాలు జరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకూడదు ” ఆడంబరం కన్నా వ్రతంలో అంతర్గతంగా చెప్పిన మూలమే ముఖ్యమని. అందరితో కలిసి ఉండు. అందరిలో నువ్వు ఉండు అన్నదే ముఖ్యం. బీద,గొప్పభేదంలేకుండాఏస్థాయికి,చెందినవారు,ఆస్థాయిలోజరుపుకున్నప్పుడే,సంసారం,సంఘం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.అలా ఉండాలని ఆశిద్దాం. అంతే కాదండోయ్ ఇంట్లో ఉన్న పురుషులు, పిల్లలు యజమానురాలికి పనులలో సహాయ సహకారాలు అందిస్తే ఆవిడ అలిసిపోకుండా, చికాకులు పడకుండా, ఎంతో ఆనందంగా వ్రతాలు జరుపుకోవడానికి అవకాశం కల్పించిన వారవుతారు. భర్తలారా… భార్య చేసే ఏ వ్రతమైన, పూజ అయిన నీ క్షేమం… అభివృద్ధి.. కోరే కదా. మీరు కూడా చేతనైనంత సహాయం చేయండి. ఆవిడ కష్టం కలిగించకుండా ఆవిడ అడిగినవన్నీ ఉన్నంతలో తెచ్చి పెట్టండి. ఆవిడ కంటూ ఆమెఏమీ కోరుకోదు . కుటుంబ సౌభాగ్యమే ఆమె సౌభాగ్యం అనుకునే ఇల్లాలు. పిల్లలారా.. మీరు కూడా వినండి…. నేటి పిల్లలే రేపటి పెద్దలు కదా…. మీ ఇంట్లో జరిగే ప్రతి పండగని ఎలా ఆచరిస్తున్నారో చూసి నేర్చుకోండి. మీ ముందు తరానికి మీరే వెన్నెముక. అలాగే ఇంట్లో ఉన్న పెద్దలారా….మీ సహకారం కూడా ఎంతో అవసరం. ప్రక్కకి జరిగి కూర్చోకండి. మీకు ఉన్న అనుభవంతో వారు చేస్తున్న పనులలో తప్పులను సరిదిద్ది ఒప్పులను చెప్పి మీ పెద్దరికాన్ని నిలుపుకోండి. పెద్దల మాట చద్ది మూట కదా.
************

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

ఆకలికి సెలవా? The holiday