అమ్మ లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోయారందరూ
అమ్మలేని ఆ ఇల్లు వల్లకాటితో సమానం అనుకున్నారందరూ
లేచింది మొదలు పడుకునే వరకు అమ్మ నోటి మాట వినకుండాఉండలేకపోయారుoదరూ
అప్పుడు మా అమ్మ ఒక యువరాణిలా కనిపించింది అందరి కళ్ళకు
బొంగరం బిల్లుల చకచకా పనులతో ఇల్లంతా తిరిగేది
ఇప్పుడు మా అమ్మ
ఓ మూలన పడి ఉంది.
పలకరింపుల కోసం పడిగాపులు కాస్తుంది..
పెంచి పెద్ద చేసిన పిల్లలు తన గాథలు వింటారని ఎదురుచూస్తుంది.
అమ్మ చెప్పే గాథలు వినే తీరిక మాక్కెడిది అంటున్నారు?
అందరూ ఆదమరిచిపోయారు
నా ముసలి అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టాలంటే వంతులేసుకుంటున్నారందరూ