ర్యాగింగ్

కథ

తాటికోల పద్మావతి

“కాలేజీలు తెరిచారు. విద్యార్థులంతా ఎవరికి నచ్చిన కోర్సులో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కావ్య ఇంటర్ సెకండియర్ మంచి మార్కులతో పాస్ అయింది. డిగ్రీ కాలేజీలో చేరింది. అది కో ఎడ్యుకేషన్ కావున అబ్బాయిలు అందరూ కలిసి వస్తుంటారు.
“కాలేజీ బస్సు వచ్చి సెంటర్ లో ఆగుతుంది.
కావ్య వాళ్ళ నాన్న మాధవ్ బండిమీద ఎక్కించుకొని బస్సు దాకా డ్రాప్ చేసి వెళ్తాడు.
“కాలేజీలోకి అడుగు పెట్టాలంటే నిత్యం ఒక గండమే.
భయం భయంగా కాలేజీలోకి అడుగు పెట్టింది కావ్య. కొత్తగా చేరిన వారిని ర్యాగింగ్ చేస్తున్నారట. తనకా పరిస్థితి రాకూడదని దేవుడికి వేయి దండాలు పెట్టుకుంది.
క్లాసులు మొదలైనాయి. సాయంత్రం కాలేజీ వదలగానే అందరూ తిరిగి బస్సులో వెళ్ళిపోతారు. సెంటర్లో బస్సు ఆగగానే కావ్య తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాడు.
“కావ్య బస్సు దిగి కాలేజీలోకి అడుగు పెట్టింది. ఎదురుగా వస్తున్న ఒక కుర్రవాడు కావు యొక్క డ్యాష్ ఇచ్చాడు. దాంతో కావ్య కింద పడిపోయింది. చేతికి అంటేన మట్టిని దులుపుకుంటూ బుక్స్ తీసుకొని పైకి లేస్తుంటే కావ్య చున్ని పట్టుకుని లాగానే మరొకడు.
ఏమిటి ఈ దౌర్జన్యం అంటూ ఆడపిల్లలంతా చేరారు. వాళ్లని ఎదరతి ఇచ్చి ఏమైనా అందామంటే భయం. రేపటి నుంచి మరింతగా ఏడిపిస్తారు. కావ్య తొందరపడలేదు. మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది.
“ఇంటికి వచ్చిన కావ్య మొహంలో దిగులు చేసుకున్నట్లు కనిపించింది. కాలేజీలో ఎవరైనా ఏమన్నా అన్నారా అంటూ తల్లి ప్రశ్నించింది.
“ఇంట్లో వాళ్లకు చెబితే గొడవలు అవుతాయి. కాలేజీ మాన్పించి ఇంట్లోనే కూర్చోబెడతారు.
ఏం లేదమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది వేడిగా కాఫీ తాగితే అదే సర్దుకుంటుందిలే అంటూ ఊపిరి పీల్చుకుంది.
మర్నాడు కాలేజీకి వెళ్లాలంటే కావ్య భయపడింది.
“ఎన్నాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటుంది. ధైర్యం చేసి బయలుదేరింది.
“తన క్లాస్మేట్ అరుణ కనిపించింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. నిన్న తన చున్నీ లాగిన్ వాళ్లే ఎదురుపడ్డారు. వాళ్లు కావ్య ఉన్న వైపే వస్తున్నారు. ఒకడు అరుణ చున్నీలాగాడు. మరొకడు కావ్య జడ పట్టుకొని ఇది జడా? నాగు పామా అంటూ అటూ ఇటూ ఊపుతున్నాడు.
“ఛీ! మీరు అసలు మనుషులేనా? కాలేజీలో చదువుకుంటున్నారన్న మాటే కానీ ఏ మాత్రం సంస్కారం లేదు మీలో. మీకు అక్క చెల్లెలు ఉన్నారు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేదా అంటూ కోపంగా చూసింది వాళ్ళవైపు.
“చూడమ్మా! ఇది మాకు కొత్త కాదు. జూనియర్స్ ని ఏడిపించడమే సీనియర్స్ లక్ష్యం అన్నారు.
“అప్పుడే అటుగా వస్తున్న లెక్చరర్స్ తమ కళ్ళతో చూసిన చూడనట్లు వెళ్ళిపోతున్నారు. కావ్య పరుగున వెళ్లి జరిగిన అవమానాన్ని చెప్పి కన్నీళ్ళ పర్యంతమైంది.
“చూడమ్మా! ఇది మీకు కొత్త. ఇది నిజమైన ర్యాగింగ్ కాదు. వాళ్లు ఊరికే సరదాగా మిమ్మల్ని ఆటపట్టిస్తున్నారు. ఈ మాత్రానికే మీరు కొండంతలుగా సృష్టించి గొడవలు పెట్టుకోకండి. చూసి చూడనట్లు పోతే ఇద్దరికీ మంచిది. నాలుగు రోజులు పోతే మీకే అలవాటు అవుతుందంటూ ఆ రౌడీలు ఇద్దరినీ వెనకేసుకొచ్చి మాట్లాడారు లెక్చరర్స్.
“కంచె చేను మేసింది అన్న సామెతలా ఉంది.
న్యాయం చెప్పాల్సిన వాళ్లే అన్యాయాన్ని తేలిగ్గా తీసి పారేశారు. అదే వాళ్ళ కన్న బిడ్డలకు జరిగితే చూసి సహించగలరా!
“రాను రాను ఆ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో జూనియర్స్ అమ్మాయిని ఏడిపిస్తున్నారు. కొంతమంది భయపడి ఆ కాలేజీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. కాలేజీ వదిలాక క్షేమంగా ఇంటికి వెళదామని నమ్మకం లేదు. వాళ్ళ ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోవడంతో అరుణ కాలేజీ వదిలేసి మరోచోట చేరింది. ఏ మాత్రం అవకాశం దొరికిన కావ్య వెంటపడి నా కావ్య నాయికా, నా కావ్య సుందరి అంటూ పాటలు పాడుతూ వెంటపడుతున్నారు.
కాలేజీ వెనుక భాగంలో ఉన్న ల్యాబ్ కోసం వెళుతున్నది కావ్య. చుట్టుపక్కలంతా పెద్ద కాలి స్థలం అన్ని చెట్లు చేమలే. ఏ అఘాయిత్యం జరిగిన ఎవరికి తెలియదు.
“ఒంటరిగా వెళ్తున్న కావ్యను ఆ రౌడీలు ఇద్దరు పక్కనే ఉన్నాడు చెట్లలోకి లేకపోయారు.
“ప్లీజ్! నన్ను వదలండి నన్నేమీ చేయొద్దు. మీకు చెల్లెలు లాంటి దాన్ని. నాకేమైనా జరిగితే మా అమ్మ నాన్న తట్టుకోలేరు. ప్లీజ్ వదిలేయమంటూ కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడింది కావ్య.
“కనికరం లేని ఆ కసాయి వాళ్ళు కావ్యను వదల్లేదు. వాళ్లలో ఒకడు దగ్గరకు లాక్కొని ఆమె భుజంపై చేయి వేశాడు. ఆ రెండో వాడు స్మార్ట్ ఫోన్లో నుంచి ఫోటో తీశాడు.
“పాపా! ఇప్పుడు వెళ్ళవచ్చు. ఇవాల్టికి ఇది చాలంటూ కావ్యని వదిలేశారు.
“ఆ ఫోటో ఎందుకు తీశారు! ముందర అది డిలీట్ చేసేయండి అంటూ కన్నీళ్ళ పర్యంతమైంది.
“చెయ్యకపోతే ఏం చేస్తావ్ అమ్మ!
“పోలీసులకు చెప్పి మీ ఆట కట్టిస్తాను.
“అలాగా! చూడరా పాప ఏమంటున్నదో! పోలీసులకు చెప్పి మన ఆట కట్టిస్తుందట……. అలా చేసావే అనుకో? నీ జీవితం గుగ్గిపాలవుతుంది గుర్తుంచుకో! నువ్వు అలా చేయకుండా ఉండాలంటే ఒక షరతు!
“ఏమిటది?
“ఇదిగో చూశావుగా ఈ ఫోటో ఎలా ఉందో. చూసేవాళ్ళు మనిద్దరం ప్రేమికులం అనుకుంటారు. ఈ ఫోటో మీ వాళ్ళు చూస్తే ఏమవుతుందో తెలుసా? గుండా కి చస్తారు.
“కావ్య కా ఫోటో చూపిస్తూ ఏడిపిస్తున్నారు.
“వద్దు అలా చేయొద్దు. మా వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. నా మూలంగా వాళ్ళు చనిపోకూడదు. ప్లీజ్ ఆ ఫోటో డిలీట్ చేసేసేయండి..
“కావ్య ఎంత చెప్పినా వాడు వినలేదు. చివరికి 50,000 ఇస్తే ఆ ఫోటో డిలీట్ చేస్తామన్నారు.
“ఇప్పటికిప్పుడే 50,000 అంటే ఎక్కడి నుంచి తెస్తుంది.
“అంత డబ్బు నా దగ్గర లేదంది.
“డబ్బు లేదంటే కుదరదు. ఎలాగైనా నాకు 50,000 ఇవ్వాల్సిందే. లేకపోతే తెలుసుగా! మేమేం చేస్తాము అన్నారు.
“రెండు రోజుల్లో తెచ్చి ఇవ్వాలి అంటూ గడివిచ్చారు.
“కావ్య అన్యమనస్కంగానే ఇంటికి చేరింది. ఇంట్లో ఎవరూ కనిపించలేదు. తండ్రి హాస్పిటల్ లో చేరినట్లు తెలిసింది. ఉన్నట్లుండిపోయారుట అందుకే తనకోసం బస్సు దగ్గరికి రాలేదు.
“గబగబా హాస్పిటల్ కి వెళ్ళింది. హార్ట్ ఎటాక్ అన్నారు. ఆపరేషన్ చేయాల్సి వస్తుందిట. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు అంటే లక్షలతో కూడుకున్నది. అమ్మ మెడలో నగలమ్మి నాన్నకు ఆపరేషన్ చేయించారు. గండం గడిచి బయటపడ్డాడు.
“ఈ సమయంలో కావ్య తన విషయం చెప్తే ఏం జరుగుతుందోనని భయపడి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.
“రెండు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నది.
“ఆ దుర్మార్గుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
“మేము అడిగిన డబ్బు ఎప్పుడు ఇస్తావ్ అంటూ ఫోన్ చేశారు.
“కావ్య తన దగ్గర డబ్బు లేదని చెప్పేసింది.
“అయినా వాళ్ళు వదిలిపెట్టలేదు. నాన్న చేసే ఉద్యోగం తోనే ఇల్లు గడుస్తున్నది. తను బాగా చదువుకొని ఉద్యోగం చేసి ఇంటికి సాయపడాలనుంది.
“తెల్లవారుతుంది అంటేనే భయం. కాలేజీకి వెళ్లాలన్నా భయం. జరిగిన విషయం పోలీసులకు చెబితే.
“అమ్మో! ఇంకేమైనా ఉందా! లక్ష ప్రశ్నలు వేస్తారు. అందరి ముందు తలెత్తుకొని బ్రతకలేదు. ఇంట్లో వాళ్లకి అవమానం.
“ఏం చేయాలి? ఒకటే మార్గం. ఆడపిల్లగా పుట్టటం నేను చేసిన నేరమా! ఎంతో అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఉన్నదాంట్లోనే చదువు చెప్పిస్తున్నారు. తనకో తమ్ముడు ఉన్నాడు.
“అందరినీ బాధ పెట్టే బదులు తనే లేకపోతే!
“బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది.
“మరి కాసేపట్లో కావ్యప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి.
“ఇంట్లో ఎవరూ లేరు. అందరూ హాస్పిటల్ లోనే ఉన్నారు. తెల్లవారితే తను కాలేజీకి వెళ్లే అవసరం ఉండదు. ఇలాగైనా వాళ్లకి గుణపాఠం తెలుసుకుంటారు.
“అదే ఆఖరి క్షణం. ఒక్క క్షణం చాలు ప్రాణం పోవడానికి, ప్రాణం పోయటానికి.
“సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఆ కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన శ్రీలక్ష్మి ఫోన్ చేసింది.”హలో కావ్య! ఆ రౌడీలు శివ నాగరాజుని రాత్రి పోలీసులు అరెస్టు చేశారట. కొత్తగా చేరిన సుస్మిత తెలుసా నీకు. నిన్న సాయంత్రం ల్యాబ్ లో ఒళ్ళు కాల్చుకొని చనిపోయింది. లెక్చరర్స్ తో పాటు కాలేజీ మొత్తం తెలిసిపోయింది. తను చనిపోతున్నట్లు ముందే తల్లిదండ్రులకు మెసేజ్ చేసిందిట. సుస్మితను ఆ రౌడీలు ఇద్దరు రేప్ చేశారుట. సిగ్గుతో భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం వెంటనే పోలీసులకు చెప్పడం వాళ్ళు రావడం ఆ ఇద్దరినీ తీసుకెళ్లటం జరిగిపోయింది. మన కాలేజీకి పట్టిన పీడ విరగడయిపోయింది. పాపం సుస్మిత ఆత్మహత్య చేసుకోవడం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడు కున్నారో! మనం రేపటి నుంచి హాయిగా కాలేజీకి రావచ్చు అంటూ సంతోషంగా వార్త చెప్పింది.
“ఏమిటే నువ్వు చెప్పేది. నిజంగా సుస్మిత అంత పని చేసిందా! నువ్వు ఈ వార్త చెప్పడం గా సాలస్యం అయితే ఈ క్షణం నేను ఈ లోకంలోనే ఉండేదాన్ని కాదు. నేను కూడా సుస్మిత లాగా……
“ఏమిటే నువ్వు చెప్పేది?
“అవును శ్రీలక్ష్మి ఇంట్లో వాళ్లకు చెప్పలేక కాలేజీకి రాలేక మానసికంగా కృంగిపోతున్నాను అనుకో.
“ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం సుస్మితకు జరిగిపోయింది. నిజంగా వాళ్ళిద్దరికీ తగిన శిక్ష పడాల్సిందే!
కాలేజీ ఎంత సుస్మిత గురించే చెప్పుకుంటున్నారు. విచారణ మొదలైంది. ఇద్దరు లెక్చరర్స్ కూడా వాళ్లకు వత్తాసు పలికినందుకు వాళ్లను కూడా విచారిస్తున్నారు. కాలేజీలోనే ఆడపిల్లలంతా ధర్నాలు చేస్తున్నారు. వాళ్లకి ఉరిశిక్ష పడాల్సిందేనని పోలీసులకు మీడియాకు చెప్తున్నారు.
“పోలీసుల కస్టడీ పూర్తయింది. శివ నాగరాజుని జైలుకు పంపారు.
“పెద్ద మనుషులు అండతో వాళ్ళని బయటికి తీసుకు రావాలని చూస్తున్నారు.
“ఒక ఎమ్మెల్యే కొడుకు కావటానా వాళ్ళని ఎలాగైనా తప్పించాలని చూస్తున్నారు.
“వాళ్ళిద్దర్నీ కస్టడీకి తీసుకున్నారు. విచారణ జరిగాక కోర్టుకి తీసుకువెళ్తారట. ఈలోగా ఏమైనా మార్పులు రావచ్చు. వాళ్ల మీద కేసు కూడా కొట్టివేయవచ్చు. ఇలాంటి కిరాతకుల్ని అస్సలు వదలకూడదు. భగవంతుడా వాళ్ళకెలాగైనా శిక్ష పడేటట్లు చెయ్యి అంటూ ప్రతి ఆడపిల్ల కోరుకుంటున్నది.
“14 రోజుల రిమాండ్ పూర్తయింది. రేపు కోర్టుకి తీసుకువెళ్తారు. అదే సమయంలో శివా నాగరాజులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఉప్పకూలిపోయారు. ఆ ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
“తప్పుచేసి తప్పించుకోవాలని చూస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే వాళ్ళని బయటకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంటే చివరికి ఇలా జరగటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
“తప్పు చేసినవాడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. చూశారా ఆ దేవుడు ఎలా మరణం రాసి పెట్టాడు. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడక మానదు. పోలీసుల నుంచి శిక్ష తప్పించుకోవాలని చూస్తే ఆ దేవుడే వాళ్ళకి శిక్ష వేధించాడు.
“కాలేజీకి పట్టిన పీడ విరగడైపోయినందుకు కాలేజీ వాళ్లంతా సంతోషించారు.
“కావ్య రేపటి నుంచి కాలేజీకి వెళ్లడానికి సిద్ధపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆత్మీయ వరాలు

నేటి భారతీయమ్” (కాలమ్)