చిరుదీపం

కవిత

షామీర్ జానకి

చీకటి ఛేదించే చిరు వెలుగుకు
చేయూత నిచ్చే గొప్ప మనసు నీది…

నీ కనుసన్నల కాంతిలో
ఊపిరి పోసుకోనే జీవితాలు ఎన్నో…

నీవు లేక పోతే ఈ ప్రపంచం…
సూర్యుడు రాని ఉదయం…

నీ చేతిలో వెలిగే దీపం…
నిన్ను ఆహుతి చేస్తున్నా…

ఆపవు కదా నీ సేవా గుణం…
అన్నపూర్ణ గా ఆదరించే నైజం…

అమ్మగా ఊపిరి నిస్తావు..
ఆకలి మంటలు తుడిచేస్తావు…

మరో ఇంటికి దీపమౌతావు…
భార్యవై బ్రతుకు పంచుకుంటావు…

సోదరి వై సొద వింటావు…
స్నేహంతో చేయూతనిస్తావు…

అంతటా నీ రూపమే…
సృష్టి కర్త ప్రతిరూపంగా…

మోహంతో నేడు నీకు…
అవమానం జరుగుతుంటే…

వేడుకుంటున్నాము ప్రణమిల్లి….
వెలిగించు మాలో జ్ఞాన జ్యోతి…

Written by Shamir Janakidevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కీర్తనలు

వరలక్ష్మీ పాట