సగం సగం బట్టలు వేసుకునే నేటి ఫ్యాషన్ సమాజం..
మా చిన్నప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా బిళ్ళల అతుకుల బట్టలు వేసుకున్నా పాపం లేనివాడు కదా అని జాలిపడి దగ్గరున్న పాత బట్టలు ఇచ్చేవాళ్ళము.బట్టలు విప్పుకుని ఏదో వాగుతూ తెలివితప్పి రోడ్డుమీద నడిచేవాడు పిచ్చోడు అనుకునే వాళ్ళము.
కానీ పాశ్చాత్య ప్రభావం పిచ్చెక్కి వెర్రి వేషాలు ఎక్కువై అతుకుల బట్టలు దాచుకోవాల్సిన ఒళ్లు చూపించుకోవడానికి నవ నాగరికత పెరిగిన సమాజంలో ఫ్యాషన్ పేరిట అర్ధ ప్రదర్శన.ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అందాన్ని జుర్రుకునే వారు కొంతమంది,
బట్టలు కొనే స్థితిలో లేక పాపం సగం బట్టలు వేసుకుంటున్నారనుకునేవారు కొంత మంది,ఏమి అనలేక ఎదిరించలేక స్వేచ్ఛకు భంగం కలిగించక చూస్తూ నోరుమూసుకునే అర్ధాంగుడు.
మంచి చెపితే ఎదురు తిరిగే రోజులు..
పెద్దలమాట పెడచెవిని పెట్టడం.మీకేమీ తెలియదని హేళన చేయడం.
ఎటు పోతుంది సమాజం.వెర్రి తలలు వేస్తు ముదిరిన ఫ్యాషన్ ప్రపంచంలో మొగుడికి చూపించాల్సిన అందం అందరిముందు పరవడం కాదు పారేసుకోవడం దేనికి చిహ్నం.మగవాడి వంటినిండా బట్టలు ఆడదాని వళ్ళు మాత్రం అంగాంగప్రదర్శన.
ఏమైనా అంటే స్వేచ్ఛ.అంటే బట్టలు విప్పుకుని తిరిగితేనే ఆడదానికి స్వేచ్ఛ ఉన్నట్టా. సభ్యత సంస్కారం మంట కలిసి తమాషా చూస్తున్న యువతరం.తినడంలో తిరగడంలో పనులు చేయడంలో ఉండాలి స్వేచ్ఛ బట్టలు విప్పేసి తిరిగేతేనే స్వేచ్ఛ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఏమి ఉంటుంది.మార్పు రావాలి .దాచుకోవాల్సింది పదిమందికి పంచేస్తే శీలం అనే పదానికి అర్థం ఉండదు.
నాకొక అనుమానం .భర్తతో సుఖాన్ని పొందలేకనే తన సౌందర్యాన్ని బహిర్లోకంలో ప్రదర్శిస్తున్నదేమో.ఏమో…
బాగా చదివి ఉన్న మతి పోయిందేమో..