॥॥ నాతిచరామి॥॥

కథ

“ ఏమండి నేను వెళ్ళిపోతున్నాను,”

ఉత్తరం  చేతిలోకి   తీసుకొని  చదవడం  మొదలుపెట్టాడు  భాస్కర్ , ఏమండి  నా మీద కోపంగా  ఉన్నారు కదూ  నాకుతెలుసు, నా మనసులోని బాధను మీతో పంచుకోవాడానికి  నాకింతకంటే  గత్యంతరంలేదని తెలుసు . మీకు  నా ఉత్తరం చూసాకైనా నా గురించి ఆలోచిస్తారని నేనుకోను  ఎందుకంటే మీకు క్షమించే గుణంలేదని తెలిసిపోయింది, మీకుఏనాడో  నామీద  ప్రేమచచ్చిపోయింది, మీమనసు  ఎప్పుడోబండబారిపోయింది.  పెళ్ళికిముందు  మనం  ఎంతగా  ప్రేమించుకున్నామోచూసేవాళ్ళకే  కళ్ళుకుట్టేవి.  ఎవరికళ్ళు  మనమీదపడినాయో  కానీమనప్రేమకు  దోషంవాటిల్లింది,    పెళ్ళిఅయినప్పటినుండి  మీరు  మొత్తం  మారిపోయారు.పెళ్ళికి  ముందు నేనేక్కడ  వుంటే  మీరు  అక్కడే  వుండేవారుమీకుగుర్తుందా, ఒకరోజు  నేనువంటచేసుకుంటుంటే  నాచెయ్యి  కాలిందనిమీరు  ఎంతబాధపడ్డారు, దాదాపుఏడిచినంతపని  చేసారు, ఇకఆరోజునుండి  నన్నువంటచేసుకోనివ్వకుండా,  మీఇంటినుండే  తెచ్చేవారు,   ఇద్దరం  ఏంబిబియస్అయిపోగానే  పెళ్ళిచేసుకోవాలని  అనుకున్నాముసమాజసేవ  చెయ్యాలి మంచిపేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మన  పిల్లలను  కూడా  మంచి  డాక్టర్లుగా  తీర్చిదిద్దాలిఅనుకున్నాము.  ఒకరోజు  అనుకోకుండా  మానానమ్మ  చనిపోయిందంటే  మీకు  చెప్పే  టైంలేక  వూరెళ్ళిపోయాను.అప్పట్లో  ఫోన్లు  వుండేవికాదు  పదిహేను రోజులవరకు రాలేకపోయాను. నేను కనిపించకపోయేసరికి ఇంచుమించు పిచ్చివాడిలా తయారయ్యారు

మనమధ్య  ఎప్పుడూ  మావూరిప్రస్తావనరాలేదు , అందుకే  మీకుఏంచెయ్యాలోతోచలేదుఅలాంటిమీరు  పెళ్ళి  అయ్యాక అంతగా మారిపోతారని నేనేనాడు ఊహించలేదు.

అందరి  ఆడపిల్లలలాగానేనేను  కోటి  ఆశలతో  అత్తవారింటిలో  అడుగుపెట్టాను. కానీ!  నాఆశలన్నీ  బూడిదలోపోసినపన్నీరేనని  ఆఇంటికి  వచ్చిన  వారంలోనే  తెలిసిపోయింది. అత్తగారుమామగారు, పెళ్ళి  కావలసిన  ఇద్దరుఆడపడుచులు, తోటికోడలు  బావగారువీళ్ళందరి  దృష్టిలోనేనో  బానిసను.

ఎవరికి చదువు సంధ్యలు లేవు పోనిలే  వాళ్ళతో  నాకేంటి  కట్టుకున్నవాడుమంచివాడైతేచాలుఅనుకున్నా,  ఆదీ  మూడునాళ్ళముచ్చటనే  అయింది. అమ్మచాటు  బిడ్డడు   మీరని  తెలిసిపోయింది.పెళ్ళికి  ముందు  మీరుచెప్పినవన్నీ  మరచిపోయారు, బండెడు  చాకిరిఅందరూ  మహరాణులేఅన్నట్టుగాకూర్చోనితినేవాళ్ళే,   ఇంతమందికి  అన్నీచేసిపెట్టి  హాస్పిటల్కువెళ్ళేదాన్ని.  అక్కడపేషంట్లతో  సతమతమయి  ఇంటికి  వచ్చేసరికి, గంపెడు  గిన్నెలుబట్టలువుండేవి. పనంతాముగించుకొని  వచ్చేసరికి  మహారాజులా  మీరెప్పుడో  నిద్రపోయేవారు.  మీకుభార్యఅవసరంకావాలి  అనుకుంటేలేచేవారు, కనీసం మీ నుండి ఓదార్పుపొందేఅవకాశంనాకుదక్కలేదు.అలాఎన్నిరాత్రులు  నాదిండ్లుతడిచిపోయాయో  మీకుతెలియదు.  ఇలాంటి  పరిస్తితులలో  నాకడుపుపండిందిఅనితెలిసిపొంగిపోయాను, మీరు  సంతోషపడతారని  నన్ను  ఇప్పటికైన  అర్ధంచేసుకుంటారని  ఊహించాను.

నా  ఊహలన్నీ  ఉప్మనిగాలిలో  కలిసిపోయాయి. మీ  వాళ్ళలాగే  మీరు  కూడాఅదేదో  మాములువిషయమన్నట్టుగా  చూసారు. పోనిలే  నావాళ్ళేకదాఅనుకుని  తృప్తిపడేదాన్ని, పిల్లలుపుట్టాకయినామీలో  మార్పు  వస్తుందని  ఆశించా, నాఆశలన్నీ  అడియాసలు  అయ్యాయి.

ఆడపడుచులపెళ్ళిళ్ళు  అయ్యాయి, మన  పిల్లలిద్దరు  పెద్దవాళ్ళయ్యారు  మీఅమ్మా  నాన్న  కాలంచేసారు  కదా, ఇక  ఇప్పుడైనా  మీరు  నా కోసం తాపత్రయపడతారని  కలలుకన్నాను, నాకలలన్నీ  ఎండమావులే  అని  నిరూపించారు. వెళుతూవెళుతు  మీఅమ్మ  మీలోనే   ఉండిపోయింది అనుకోలేకపోయాను.

కడుపునపుట్టిన   పిల్లలన్నా  నన్ను  అక్కునచేర్చుకుంటారని  ఎదిరిచూశాను. నాపిచ్చికాకపోతేవిత్తనంఒకటిపెడితే  చెట్టుఇంకొకటి  వస్తుందా? కోడళ్ళు వచ్చాకవిశ్రాంతి  దొరుకుతుంది  అనుకున్నాఅక్కడ  నాకు చుక్కెదురైంది , కోడళ్ళైనా నన్నర్ధం  చేసుకుని   నన్ను  గౌరవిస్తారనుకున్నాను  వాళ్ళు  నీకోడళ్ళేనని  నీరూపించారు.

ఏమండి…   ఇక   నాకు ఓపికలేదండి,   నాకు  తెలియక  అడుగుతాను మీకు     నేనేమి  అపకారం  చెయ్యలేదు  కదా!  భార్యగా  మీకేనాడు  లోపంరానివ్వలేదు. పెళ్ళికి   ముందు  మీరుచెప్పినమాటలన్నీమరిచిపోయారు, మీరుఅలా  ఎందుకుమారిపోయారో  నాకు  ఇప్పటికి  అర్ధంకాలేదు. చదువుసంధ్యలుండి  కూడా  నాకాళ్ళమీద  నేను  నిలబడగలిగే  శక్తి  వున్నా, ఒక  ఆడదానిగా  తాళికట్టిన  భర్తకువిలువ  ఇచ్చేసాంప్రదాయంలో  వున్నదాన్నిగనుక  మిమ్మల్ని  విడిచి  వెళ్ళిపోలేక  పోయాను.

నేను  పుట్టినవెంటనేతల్లిప్రేమకునోచుకోలేదు. సవతి తల్లి నిరాదరణలో  కన్నతండ్రిప్రేమకు

దూరమై,  హాస్టల్  బ్రతుకుఅనుభవించిచాటుమాటుగా  వచ్చే  నాన్న ఆప్యాయతలో చదువుసాగించాను ,   మీ పరిచయంతో నా అంత అదృష్టవంతురాలు ఉండదని పొంగిపోయాను, మీరు  పెళ్లిలో  చేసిన ప్రమాణాలు మరిచిపోయారు , “ ధర్మేచా, అర్ధేచా,

మోక్షేచా, నాతి చరామి” అని మూడు సార్లు పురోహితుడు చెప్పమంటే చెప్పారుఅది కూడా మరిచిపోయారు ,

ఏమండి  నేను  మనిషినే  కదా!  నాకు  ఒక  మనసుంటుందని  మీరేనాడైనా  ఆలోచించారా, నాఅవసరాలగురించి  ఏనాడైనా  అడిగారా, గుప్పెడు  మల్లెలు  తెస్తారని   ప్రతిరోజు ఎదిరి చూసేదాన్ని,అందరిలా  సినిమాలకు  షికార్లుకు  తిప్పుతారని   అడగకుండానే  నగలు  చీరలు  కొనిపెడతారని  భ్రమపడ్డాను,  నా జీవితం పూలపాన్పు కావాలని కోరుకున్నాను నా కలలన్నీ  కల్లలుగా  చేసారు. డాక్టర్‌గా  నా బాధ్యతలన్నీ మానిపించేసారు ఇక  చాలండి,నావల్లకాదు  నా మనసు అలసిపోయింది విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను

మీ   అందరికి  దూరంగా  ఉండి  నిరుపేదలకు   డాక్టర్గా  సేవ  చేస్తూ అనాథలను చేరదీస్తూ  నా చివరి శ్వాస వరకు  బ్రతుకుదామనుకుంటున్నాను.

ఏమండి  చివరిగా  ఒక్కమాట,  మీ గుండెలమీద చెయ్యివేసుకుని ఆలోచించండి  మీరు చేసింది  ఎంతవరకు సమంజసమో,

నాకోసం  వెతకొద్దుఅలసిపోయిన  నామనసు  మీకు  దూరంగాఉండాలనుకుంటుంది. ఒకవేళమీ  మనసుమారి  నా కోసం వెతికి నా దగ్గరకు వచ్చినా   నా  అచేతనమైన  నా  శరీరాన్ని  మాత్రమే  చూస్తారు,  కొడుకులు కోడళ్ళు మన శరీరాలు అనుకూలంగా ఉన్నంతసేపే  మనను  ప్రేమగా  చూస్తారు. జీవితం ఒక పాఠశాల ప్రతి అనుభవం  ఒక పాఠం కావాలి అది  తెలుసుకున్నప్పుడే ఒకరినొకరు అర్ధం చేసుకోగలుగుతారు. అంతేకాదు  మీ జీవితంలో మీరు చేసిన పొరబాటుకు మీకు జీవిత చరమాంకంలో  కట్టుకున్న భార్య  ఎడబాటు ఎలా ఉంటుందో అనుభవిస్తే కానీ  తెలియదు. అది  ఎవరు పూడ్చలేని అగాధం అని మీరు తెలుసుకునే సరికి  మీకు  అందనంత దూరంలో నేనుంటాను

ఇక  సెలవ్.

మల్లికా  ఎంతపనిచేసావూ  అంటూ  తలబాదుకుని  ఏడుస్తున్నాడుభాస్కర్.   నేనలా   మారిపోయాను  అనే  విషయంనీవుత్తరం  చదివేవరకు  నాకుతెలియనేలేదు,నేను   మాఅమ్మకు  ఇష్టంలేని  పెళ్ళి చేసుకున్నానని ఆవిడను      బాధపెట్టొద్దనీ  ఆమె  ఎలా  చెబితే  అలాచేసాను. ఆమెను సంతోషంగా  వుంచాలనుకున్నానే గానీ, నిన్ను ఇంతగా బాధపెడుతున్నానని ఎప్పుడు ఆలోచించలేదు . నన్ను  క్షమించు  మల్లికా,  నీకోసం  వస్తాను  మల్లికా, నువ్వెక్కడున్నా  నిన్నువెతుక్కుంటూ  వస్తాను. అంటూ  పిచ్చిపిచ్చిగా  అరుస్తూ  వెళ్ళిపోయాడు  భాస్కర్  చిక్కటి చీకటిలోకి గమ్యంలేని చోటుకి.

॥॥అయిపోయింది॥॥

 

 

 

 

 

 

Written by Lakshmi Sharma Trigulla

॥॥ రచయిత్రి పరిచయం॥॥

పేరు- లక్ష్మీశర్మ త్రిగుళ్ళ
గృహిణి
భర్త పేరు- మెట్రామ్ శర్మ
(HMT రిటైర్మెంట్ )
ప్రవృత్తి –కథలు కవితలు రచనలు
4/10/2021కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ ఆద్వర్యంలో
( మబ్బులు వీడిన ఆకాశం) కథల సంపుటి
మన తెలుగు కథలు డాట్ కామ్ వారి నుండి
(30/10/2022) ఉత్తమ రచయిత్రి బిరుదు
(సందెపొద్దు గూటిలోకి) కథకు (ప్రథమ బహుమతి)
( విశిష్ట బహుమతి) ఉత్తమ కథ బహుమతి ఓకే కథకు మూడు
రావడం
వివిధ పత్రికలలో మరిన్ని కథలు ప్రచురణ జరిగింది
మీ అందరి అభిమానంతో మరిన్ని మంచి కథలు రాయాలన్నదే
నా ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కీర్తనలు

మంచి మాట